Bengaluru: ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి.. లేదంటే మీ అడ్వాన్స్ డబ్బులు వెనక్కి రావు!

ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) లో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతుంటాయి. భారీ అద్దెలతో పాటు లక్షల్లో సెక్యూరిటీ డిపాజిట్లు (అడ్వాన్స్) వసూలు చేయడం ఇక్కడి ఓనర్లకు అలవాటు. అయితే, మర్యాదగా సమయానికి అద్దె కడుతున్నా కొందరు హౌస్ ఓనర్లు టెనెంట్లను (అద్దెదారులు) తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక అద్దెదారుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన చేదు అనుభవం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. తన ఇంటికి వచ్చిన అతిథుల ముందే ఓనర్ నానా బూతులు తిడుతూ, అవమానించి, ఇల్లు ఖాళీ చేయమంటూ బెదిరించాడని సదరు టెనెంట్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Bengaluru Tenant Landlord Dispute Security Deposit Refund Rent Agreement Legal Notice

9 నెలలుగా కరెక్ట్ టైమ్‌కు రెంట్.. అయినా సరే వేధింపులు!

బాధితుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం.. ఆయన 9 నెలల క్రితం నెలకు రూ. 14,000 అద్దెతో, రూ. 40,000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఆ ఇంట్లోకి మారాడు. గడిచిన 9 నెలలుగా ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా కరెక్ట్ టైమ్‌కు రెంట్ కడుతున్నాడు. అయినప్పటికీ గత కొన్ని నెలలుగా సదరు ల్యాండ్‌లార్డ్ ప్రవర్తన చాలా దారుణంగా తయారైంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం, రూడ్‌గా మాట్లాడటం చేస్తుండటంతో బాధితుడు వేరే ఇల్లు వెతుక్కోవడం ప్రారంభించాడు.
ఈ క్రమంలోనే ఒకరోజు టెనెంట్ ఇంటికి కొందరు గెస్టులు వచ్చిన సమయంలో ఓనర్ వచ్చి గొడవ పెట్టుకున్నాడు. "మా బంధువులు, స్నేహితులు చూస్తుండగానే ఓనర్ గట్టిగట్టిగా అరుస్తూ నన్ను నోటికొచ్చినట్లు తిట్టాడు. కిందికి రాకపోతే నీకు మంచిది కాదు అంటూ బెదిరింపులకు దిగాడు. అందరి ముందు నాకు ఘోరమైన అవమానం జరిగింది" అని టెనెంట్ రాసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని ఓనర్ టెక్స్ట్ మెసేజ్ పంపాడు.

ఓనరే ఖాళీ చేయమంటే.. డిపాజిట్ కట్ చేయవచ్చా?

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లీగల్ అడ్వైస్ కోసం అడుగుతున్న ఈ బెంగళూరు (Bengaluru) నివాసి.. "ఓనరే స్వయంగా మెసేజ్ చేసి నన్ను ఇల్లు ఖాళీ చేయమంటున్నప్పుడు, నా సెక్యూరిటీ డిపాజిట్ నుండి ఒక నెల రెంట్ (రూ. 14,000) కట్ చేసుకునే హక్కు అతనికి ఉందా? నేను నా స్వంత నిర్ణయంతో వెళ్లడం లేదు, వారే నన్ను బలవంతంగా పంపించేస్తున్నారు" అని ప్రశ్నించాడు. తన వద్ద సకాలంలో రెంట్ కట్టిన పేమెంట్ రికార్డులు, ఓనర్ పంపిన మెసేజ్ స్క్రీన్‌షాట్లు , ఆ గొడవకు సాక్ష్యంగా ఉన్న బంధువుల స్టేట్‌మెంట్లు అన్నీ ఉన్నాయని చెప్పాడు. తన పూర్తి అడ్వాన్స్ రూ. 40,000 తిరిగి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే లీగల్ నోటీసు సిద్ధం చేశానని, కోర్టు ద్వారా ఈ సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

నెటిజన్ల క్రేజీ సలహాలు: ఇల్లు ఖాళీ చేసేటప్పుడు జాగ్రత్త!

ఈ పోస్ట్‌పై బెంగళూరు టెనెంట్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు..

  • ఒక యూజర్ స్పందిస్తూ.. "బెంగళూరులో ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఒక నెల రెంట్ లేదా పెయింటింగ్ చార్జీల పేరుతో రూ. 14,000 కట్ చేసుకోవడం ఇక్కడ ఒక సాధారణ నియమం (Norm) లా మారిపోయింది. మీ అగ్రిమెంట్‌లో దీనికి వ్యతిరేకంగా బలమైన క్లాజ్ ఉంటే తప్ప ఆ డబ్బులు వెనక్కి రావడం కష్టం" అని కామెంట్ చేశారు.
  • మరో నెటిజన్ కీలకమైన సలహా ఇస్తూ.. "మీరు గొడవ పడే కొద్దీ ఓనర్ మరింత ఎక్కువ డబ్బులు కట్ చేయడానికి చూస్తాడు. కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చే ముందు.. ఇంట్లో ఎలాంటి డ్యామేజ్ లేదని నిరూపించడానికి ఇల్లంతా క్లియర్‌గా ఫొటోలు, వీడియోలు తీసి పెట్టుకోండి. భవిష్యత్తులో లీగల్ ఫైట్ చేయాల్సి వస్తే ఇవి మీకు గట్టి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి" అని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+