రూ. 5,000 జీతం నుండి రూ. 45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో ఊహించని ట్విస్ట్!
లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలా? లక్షలు పెట్టి బీటెక్ చదవాలా? అంటే.. 'అవసరం లేదు, టాలెంట్ ఉంటే చాలు' అని నిరూపించాడు ఓ బెంగళూరు టెక్కీ. కేవలం ₹5,000 నెల జీతంతో కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఏడాదికి ₹45 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. అయితే ఇంత సక్సెస్ సాధించినా, అతని మనసులో ఒక పెద్ద వెలితి ఉండిపోయింది. ఇటీవల అతను షేర్ చేసిన తన లైఫ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కామర్స్ నుండి కంప్యూటర్ సైన్స్ వైపు..
ఈ బెంగళూరు టెక్కీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంటర్మీడియట్‌లో కామర్స్ చదివిన అతను, ఆ తర్వాత 2013లో మూడేళ్ల డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్‌లో జాయిన్ అయ్యాడు. కోర్సు పూర్తి కాకుండానే అదే ఏడాది నెలకు కేవలం ₹5,000 జీతంతో ఒక చిన్న వెబ్ డెవలప్‌మెంట్ కంపెనీలో మొదటి ఉద్యోగం సంపాదించాడు.
అక్కడి నుంచి అతని ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. చిన్న చిన్న కంపెనీల్లో పని చేస్తూ, ఎన్నో కష్టాలు పడుతూ మెల్లమెల్లగా కంపెనీలు మారుస్తూ వచ్చాడు. అలా కంపెనీలు మారిన ప్రతిసారీ అతని శాలరీ పెరుగుతూ వచ్చింది.
2021లో బిగ్ బ్రేక్.. 2025లో లేఆఫ్ షాక్!
ఈ టెక్కీ కెరీర్‌లో అసలైన టర్నింగ్ పాయింట్ 2021లో వచ్చింది. మొదటిసారి అతని నెల జీతం ₹1 లక్ష దాటింది. ఆ తర్వాత అది ₹1.8 లక్షలకు కూడా చేరింది. అంతా బాగుంది అనుకుంటున్న టైమ్‌లో, 2025లో ఐటీ రంగంలో వచ్చిన లేఆఫ్స్ వల్ల అతను ఉద్యోగం కోల్పోయాడు.
జాబ్ పోయే సమయానికి అతని దగ్గర ₹11 లక్షల సేవింగ్స్‌తో పాటు కంపెనీ ఇచ్చిన సెవెరెన్స్ పే (Severance Payout) ఉంది. అయితే అధైర్యపడకుండా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టి, అదే ఏడాది ఏకంగా ₹45 LPA (ఏడాదికి ₹45 లక్షలు) ప్యాకేజీతో సరికొత్త జాబ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రజెంట్ అతను నెలకు ₹2.7 లక్షల జీతం తీసుకుంటున్నాడు.
ఇప్పటికీ వెంటాడుతున్న ఆ ఒక్క వెలితి!
ప్రస్తుతం ₹70 లక్షల నెట్ వర్త్ (ఆస్తి) ఉన్నప్పటికీ, అతను ఒక రకమైన అభద్రతాభావంతో (Imposter Syndrome) బాధపడుతున్నాడు. "నా శాలరీ పట్ల నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న వెబ్ డెవలప్‌మెంట్ కంపెనీల్లోనే ఉండిపోకుండా, ఇంకాస్త కష్టపడి ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. నాకు కేవలం డిప్లొమానే ఉంది, నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ లేదు కదా.. నాకు ఇంతకంటే ఎక్కువ జీతం రాదేమో అనే భయం నన్ను వెనక్కి లాగింది" అని అతను చెప్పుకొచ్చాడు.
రెగ్యులర్ డిగ్రీ లేదనే బాధ అతన్ని ఎంతగా వెంటాడిందంటే.. కేవలం ఒక డిగ్రీ సర్టిఫికెట్ కోసమే ఈ ఏడాది జనవరిలో ఇగ్నో (IGNOU) లో బీసీఏ (BCA) కోర్సులో అడ్మిషన్ తీసుకున్నాడు. "నాతో సమానమైన ఎక్స్‌పీరియన్స్ ఉండి, నాకంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లను చూసినప్పుడు తెలియకుండానే కంపారిజన్ వచ్చేస్తోంది. ఇది హ్యూమన్ నేచర్ కావచ్చు" అంటూ తన మనసులోని మాటను పంచుకున్నాడు.
₹70 లక్షల సంపాదన.. ఫైనాన్షియల్ ప్లానింగ్ సూపర్!
డిగ్రీ లేదనే బాధ ఉన్నప్పటికీ, ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మాత్రం ఈ టెక్కీ అందరికీ రోల్ మోడల్‌గా నిలిచాడు. మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్ (PF), , ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) రూపంలో ఇప్పటివరకు ₹70 లక్షల వరకు పొదుపు చేయగలిగాడు.
చిన్న జీతంతో స్టార్ట్ చేసినా, సరైన స్కిల్స్ ఉంటే ఐటీ హబ్ అయిన బెంగళూరు (Bengaluru) లో ఏ స్థాయికైనా ఎదగవచ్చని ఇతని స్టోరీ నిరూపిస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ లేకపోయినా పట్టుదలతో ఇంత దూరం రావడం నిజంగా గ్రేట్ కదా!


Click it and Unblock the Notifications