భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం లక్షలాది మంది యువతకు కలల గమ్యస్థానం. భారీ జీతాలు, అత్యాధునిక ఆఫీసులు, హై-ఫై లైఫ్ స్టైల్ ఇక్కడ అందరినీ ఆకర్షిస్తాయి. అయితే బయట నుంచి చూసే వారికి లక్షల్లో జీతం కనిపిస్తుంది కానీ, ఆ నగరంలో నివసించడానికి అయ్యే ఖర్చులు చూస్తే మాత్రం గుండె గుభేల్ అంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ బెంగళూరులోని ఖరీదైన జీవనశైలిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షాకింగ్ లెక్కలు
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక నెటిజన్ తన తమ్ముడి అనుభవాన్ని పంచుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆ యువకుడు, చదువు పూర్తికాగానే బెంగళూరులోని ఒక ప్రముఖ టెక్ కంపెనీలో నెలకు రూ. 1.5 లక్షల జీతంతో ఉద్యోగంలో చేరాడు. ఇంటి దగ్గర ఉన్న వారంతా అతను ఏదో సాధించేశాడని, భారీ జీతంతో గొప్పగా బ్రతుకుతాడని సంబరపడ్డారు. కానీ, ఆరు నెలలు గడిచాక ఆ యువకుడికి అసలు వాస్తవం అర్థమైంది.
అతని నెలవారీ ఖర్చుల చిట్టా ఇలా ఉంది..
- ఇంటి అద్దె: ఆఫీస్ దగ్గరలో ఉన్న ఒక చిన్న అపార్ట్‌మెంట్ కోసం నెలకు రూ. 36,000.
- ఆహారం & గ్రాసరీస్: నెలకు దాదాపు రూ. 13,000 నుంచి రూ. 15,000.
- రవాణా ఖర్చులు: బెంగళూరు ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిందే. క్యాబ్‌లు, ఆటోల కోసం మరో రూ. 6,000 నుంచి రూ. 8,000.
- వారాంతపు ఖర్చులు: స్విగ్గీ ఆర్డర్లు, కాఫీ షాపులు, వీకెండ్ పార్టీల కోసం రూ. 10,000 నుంచి రూ. 12,000 ఖర్చవుతున్నాయి.
కనిపించని ఖర్చులు ఇంకెన్నో..
ఇవే కాకుండా సబ్‌స్క్రిప్షన్లు, మెడికల్ ఖర్చులు, ఊహించని బిల్లులు , ఇంటికి పంపే డబ్బులు అన్నీ పోతే, నెలాఖరుకు చేతిలో కేవలం రూ. 15,000 నుంచి రూ. 20,000 మాత్రమే మిగులుతున్నాయి. అంటే రూ. 1.5 లక్షల భారీ జీతం ఉన్నప్పటికీ, సేవింగ్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. "సొంత ఊర్లో లక్ష రూపాయల జీతం అంటే చాలా ఎక్కువ, కానీ బెంగళూరు లాంటి నగరంలో అది కేవలం ఆరంభం మాత్రమే" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
నెటిజన్ల రియాక్షన్ , సలహాలు
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది బెంగళూరులో అద్దెలు మరీ దారుణంగా పెరిగిపోయాయని వాపోతున్నారు. మరికొందరు కొన్ని ఆచరణాత్మక సలహాలు ఇచ్చారు. ఆఫీస్ దగ్గరే కాకుండా, మెట్రో సౌకర్యం ఉన్న దూర ప్రాంతాల్లో ఇల్లు తీసుకుంటే అద్దె గణనీయంగా తగ్గుతుందని సూచించారు. "మనం ఆఫీస్‌కు ఎంత దగ్గరగా ఉండాలనుకుంటే, అద్దెలు అంత ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే ఇక్కడ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
మొత్తానికి పెద్ద నగరాలు డబ్బును ఎంత వేగంగా ఇస్తాయో, అంతకంటే వేగంగా ఖర్చు చేయిస్తాయనేది ఈ కథనం ద్వారా స్పష్టమవుతోంది. బెంగళూరు (Bengaluru) లో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్లు కేవలం జీతాన్ని మాత్రమే కాకుండా, అక్కడి ఖర్చులను కూడా ముందే అంచనా వేసుకోవడం మంచిది.
More From GoodReturns

Bengaluru: ఉద్యోగం కంటే సొంత వ్యాపారమే మిన్న.. ఒంటరిగా వంట చేస్తూ నెటిజన్ల మనసు గెలిచిన టెక్కీ!

Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Bengaluru: అద్దె ఎంత పెరిగినా అక్కడే ఉంటాం! ఫ్రెండ్స్ కోసం లక్షలు వదులుకుంటున్న బెంగళూరు కపుల్!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: ట్రాఫిక్, అద్దెలు, తిండి.. బెంగళూరు కష్టాలకు చెక్ పెట్టే 30 డేస్ రోడ్‌మ్యాప్! వీడియో వైరల్!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications