చాలామందికి గూగుల్ (Google) లో ఉద్యోగం సాధించడం ఒక కల. అది కూడా నెలకు లక్షల్లో, ఏడాదికి ఏకంగా రూ. 2 కోట్ల ప్యాకేజీ అంటే ఆ అదృష్టం ఎందరికో ఉండదు. కానీ, బెంగళూరు (Bengaluru)కు చెందిన ఒక టెక్కీ మాత్రం ఈ భారీ ఆఫర్‌ను కాదని బయటకు వచ్చింది. తన క్రియేటివిటీని చూపించడానికి, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను నిర్మించుకోవడానికి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

10 ఏళ్ల కెరీర్.. రూ. 2 కోట్ల జీతం
శ్రీగీత శ్రీనివాస్ (35) గత పదేళ్లుగా గూగుల్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి డబ్లిన్ (ఐర్లాండ్) వరకు ఆమె ప్రస్థానం సాగింది. గూగుల్‌లో ప్రిన్సిపల్ అకౌంట్ మేనేజర్ గా ఆమె ఏడాదికి సుమారు 2 లక్షల యూరోలు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు) సంపాదించేవారు. ఆర్థికంగా ఎంతో భద్రత ఉన్నప్పటికీ.. కేవలం కార్పొరేట్ చట్రంలోనే ఉండిపోవాలని ఆమె భావించలేదు. తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, విభిన్న నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జూన్ 2025 లోనేగూగుల్‌ను వదలాలని నిర్ణయించుకున్నారు.
వైరల్ అయిన వీడియో.. పెరిగిన ఫాలోవర్లు
నిజానికి శ్రీగీత గత ఐదేళ్లుగా పార్ట్-టైమ్ గా కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 2025లో గూగుల్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియో ఊహించని విధంగా వైరల్ అయ్యింది. కేవలం నెల రోజుల్లోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య 900 నుంచి 3,000కు పైగా పెరిగింది. "చాలామందికి డ్రీమ్ జాబ్ అనిపించే గూగుల్ ఉద్యోగాన్ని వదిలేయడంపై ప్రజల్లో ఉన్న ఆసక్తి నన్ను ఆశ్చర్యపరిచింది" అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం "రీబిల్డింగ్ లైఫ్ ఆఫ్టర్ క్విట్టింగ్ గూగుల్" అనే సిరీస్‌తో ఆమె 100K ఫాలోవర్ల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త దారిలో సంపాదన
ఉద్యోగం వదిలేసిన తర్వాత కేవలం ఫాలోవర్ల కోసమే కాకుండా, కంటెంట్ క్రియేషన్‌ను ఒక బిజినెస్ గా ఆమె మలుచుకుంటున్నారు. ట్రావెల్, లైఫ్‌స్టైల్ బ్రాండ్లతో కొలాబరేషన్లు చేస్తూ ఇప్పటికే ఆదాయం ప్రారంభించారు. కెమెరా ముందు మాట్లాడటం, కథలు చెప్పడం (Storytelling) వంటి తనలోని కొత్త కోణాలను ఆమె ఆవిష్కరిస్తున్నారు. సక్సెస్ అంటే కేవలం డిగ్రీ, ఉద్యోగం, పెళ్లి, ఇల్లు మాత్రమే కాదు.. మనకు నచ్చిన పనిని ధైర్యంగా చేయడమే అసలైన విజయం అని ఆమె నమ్ముతున్నారు.
మొత్తంగా చూస్తే శ్రీగీత శ్రీనివాస్ కథ నేటి యువతకు ఒక గొప్ప పాఠం. సంపాదన కంటే మనశ్శాంతి, నచ్చిన పని చేయడం ముఖ్యమని భావించే వారికి ఆమె ఒక స్పూర్తిగా నిలుస్తున్నారు. మరికొంత కాలం ఇలాగే సాగి తనకంటూ ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ ను నిర్మించుకోవాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ట్రాఫిక్, అద్దెలు, తిండి.. బెంగళూరు కష్టాలకు చెక్ పెట్టే 30 డేస్ రోడ్‌మ్యాప్! వీడియో వైరల్!

Bengaluru: బెంగళూరులో ఫుడ్ ధరలకు రెక్కలు! దోశ, ఇడ్లీ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications