బెంగళూరులో అమెజాన్‌లో మంచి స్థాయి ఉద్యోగం చేస్తున్న ఒక యువ ఇంజనీర్ శుభం సోని.. ఇటీవల లింక్డ్ఇన్‌లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ కేవలం ఉద్యోగం మార్పు గురించి కాదు.. జీవితం, విజయం, కుటుంబం, మనశ్శాంతిపై కొత్త దృష్టికోణాన్ని తెరపైకి తెచ్చింది. శుభం సోని అమెజాన్‌లో పని చేస్తూ మంచి జీతం సంపాదించేవాడు.
కాని అతని మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి.. ఈ రద్దీ నగర జీవితం, ఒంటరి రోజులు, ఒత్తిడి ఇవన్నీ విలువైనవేనా?... చివరికి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు: తన కెరీర్‌లో 10 శాతం జీతం తగ్గినా సరే, ఇంటి దగ్గర ఉండి కుటుంబంతో గడిపే అవకాశం కలిగించే ఉద్యోగం తీసుకోవాలనుకున్నాడు.

లింక్డ్ఇన్‌లో తన అనుభవాన్ని పంచుకుంటూ సోని ఇలా రాశాడు. మెట్రో నగరంలో 1-1.5 లక్షలు సంపాదించడం కంటే, ఇంటి నుండి 50-70 వేల రూపాయలు సంపాదించి మనశ్శాంతిగా జీవించడం చాలా మంచిది. అతను ఈ నిర్ణయానికి ముందు ఎన్నో సార్లు ఆలోచించాడని అంగీకరించాడు. పెద్ద కంపెనీ బ్రాండ్ పేరు వదిలిపెట్టడం, కెరీర్ వృద్ధి మందగించవచ్చనే భయం ఇవన్నీ అతన్ని వెనక్కి లాగాయి. అయినప్పటికీ, చివరికి అతను తన అంతరాత్మను విని ముందుకు కదిలాడు.
ఇప్పుడు వెనక్కి చూసుకుంటే, నేను అస్సలు చింతించడం లేదు. ముందుగా బెంగళూరులో ఒంటరిగా ఉండేవాన్ని. ఇప్పుడు కుటుంబం మధ్యన ఉన్నాను. ఆ శాంతి అమూల్యం అని సోని పేర్కొన్నాడు. అతని మాటల్లో ఒక లోతైన సందేశం ఉంది. పని, ఆశయం ముఖ్యమైనవే అయినప్పటికీ, జీవితంలో ప్రశాంతంగా ఉండటం అంతకంటే ముఖ్యమైంది. సోని పోస్ట్ త్వరగానే లింక్డ్ఇన్, ఇతర సోషల్ మీడియా వేదికలపై వైరల్ అయింది. వేలాది మంది నెటిజన్లు అతని నిజాయితీని, అతని నిర్ణయ ధైర్యాన్ని ప్రశంసించారు.
ఇదే నిజమైన ఫ్లెక్స్.. కుటుంబంతో కలిసి జీవించడం, నెలకు 80 వేల రూపాయలు సంపాదించడం గొప్ప విషయమని ఓ నెటిజన్ అన్నారు. డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం. ఈ ఆలోచన చాలా మందికి గుర్తు చేస్తుంది. ఎందుకు పనిచేస్తున్నాం అనేది అంటూ మరో నెటిజన్ అన్నారు. అయితే, అందరూ ఏకీభవించలేదు. మెట్రో నగరాల్లో పనిచేయడం కూడా అపారమైన అవకాశాలు, వృద్ధిని ఇస్తుంది. "శాంతి అవసరం ఉన్నా, కెరీర్‌లో వృద్ధి కూడా అంతే ముఖ్యమని" కొందరు సూచించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications