Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం పోయిందంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్ మాత్రం, "నా ఉద్యోగం పోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లో ఇల్లు కొనాలా? లేక అద్దెకు ఉండాలా? అనే సందిగ్ధంలో ఉన్నవారికి ఈయన అనుభవం ఒక పెద్ద కనువిప్పుగా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

Bengaluru techie layoff viral post on housing affordability and avoiding heavy EMIs in uncertain job market

ఈఎంఐ కంటే ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం!

ఆ టెక్కీ తన రెడ్డిట్ (Reddit) పోస్ట్‌ లో ఏం చెప్పాడంటే.. "గత ఏడాది నేను బెంగళూరులో ఒక 3BHK ఇల్లు కొనాలని వెతికాను. నా నెట్ వర్త్ చూసుకుంటే రూ. 2 కోట్ల విలువైన ఇంటిని సులభంగా కొనగలను. కానీ, నేను అప్పుడు AI మైగ్రేషన్ టీమ్‌ లో పని చేస్తున్నాను. రాబోయే 2 - 3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయో నాకు ముందే తెలుసు. అందుకే ఆఫీస్ నుంచి గంట దూరం ప్రయాణం చేస్తూ భారీ ఈఎంఐలు (EMIs) కట్టడం కంటే, ఆఫీస్ దగ్గర్లోనే అద్దెకు ఉండాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా గత వారం నా ఉద్యోగం ఊడింది. ఇప్పుడు నా తలపై ఈఎంఐ (EMI) ల భారం లేదు కాబట్టి, ప్రశాంతంగా నా తర్వాతి కెరీర్ గురించి ఆలోచించుకోగలుగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.

బెంగళూరు రియల్ ఎస్టేట్ బుడగ పేలుతుందా?

ఈ పోస్ట్‌ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరులో 70-80 శాతం ఇళ్ల కొనుగోలుదారులు ఐటీ ఉద్యోగులే. సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో ఉద్యోగ భద్రత తగ్గుతున్న ఈ తరుణంలో, భారీ అప్పులు చేసి ఇళ్లు కొనడం ఆత్మహత్యాసదృశ్యమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక యూజర్ అయితే, "గ్లోబల్ యుద్ధాలు, AI ప్రభావం, మార్కెట్‌ లో పెరుగుతున్న ఇళ్ల సరఫరా చూస్తుంటే.. ఇప్పుడు కొనడం కంటే మరో రెండేళ్లు వేచి చూడటమే మంచిది" అని కామెంట్ చేశారు. మరికొందరు బిల్డర్లు కావాలనే 'స్టాక్ అయిపోయింది' అని అబద్ధాలు చెబుతూ ధరలను పెంచుతున్నారని ఆరోపించారు.

నిపుణులు ఏమంటున్నారు?

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నగరాల్లో ఇల్లు కొనేవారు తమ ఆదాయంలో అధిక భాగం ఈఎంఐలకే కేటాయించడం వల్ల ఆర్థికంగా బలహీనపడుతున్నారు. ఉద్యోగం పోవడం లేదా అనారోగ్యం వంటి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, భారీ అప్పులు ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని హెచ్చరిస్తున్నారు. బెంగళూరు (Bengaluru) లోని మౌలిక సదుపాయాలు, నీటి సమస్యలు చూస్తుంటే, కోట్లాది రూపాయలు పెట్టి ఇల్లు కొనడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

మొత్తానికి ఆ టెక్కీ చెప్పినట్లుగా.. భవిష్యత్తు అస్పష్టంగా ఉన్నప్పుడు భారీ ఆర్థిక బాధ్యతలు నెత్తిన వేసుకోకుండా, ప్రశాంతంగా ఉండటమే 'పీస్ ఆఫ్ మైండ్' అనిపిస్తోంది. ఈఎంఐ (EMI) ల ఉచ్చులో పడకుండా ఉండటమే నేటి కాలంలో అసలైన సక్సెస్ అని ఐటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+