డబ్బు అనేది జీవితం కాదు. ఒక్కోసారి డబ్బు జీవితాన్ని కాపాడలేకపోవచ్చు. మానవ సంబంధాలను బలపర్చలేకపోవచ్చు. డబ్బు అనే మాయలో పడి అందరూ కుటుంబాన్ని,బంధాలను కోల్పోతున్నారు. డబ్బే సర్వస్వం అని బతికిన చాలామంది చివరకు అది శాశ్వతం కాదని తెలుసుకుంటున్నారు. డబ్బు కోసం పరుగులు పెడుతూ విలువైన దాన్ని ఏం కోల్పోతున్నారో తెలుసుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ టెకీ డబ్బు తన జీవితంలో ఏర్పరిచిన అగాధాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
బెంగళూరులో నివసిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన జీవత కథను ఇటీవల Redditలో పంచుకున్నారు. ఈ టెకీ కథ కేవలం ఉద్యోగంలో సాధించే జీతాలే కాదు.. జీవితంలోని ఆర్థిక చైతన్యం, బాధలు, మార్పులు, ఆత్మవిమర్శలతో కూడిన పాఠాల సారాంశం అని చెప్పుకోవచ్చు. అతను దాదాపు 20 ఏళ్ల క్రితం ఐదు లక్షల రూపాయలత వార్షిక వేతనంతో తన ఉద్యోగ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు రూ. 2.5 కోట్లు వేతనాన్ని ఏడాదికి సంపాదిస్తున్నాడు. అయితే ఈ ఎదుగుదలలో అతను ఏం కోల్పోయాడో వివరిస్తున్నాడు. బాధలు, కుటుంబ విభేదాలు, ఆరోగ్య సమస్యలు, రుణ భారం అన్నీ అతనిని ఈ ఎదుగుదలలో ఎదురయ్యాయి.

అతను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన తండ్రి తీవ్ర అనార్యోగానికి గురయ్యాడు. హృదయ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. రూ. 20 రోజుల పాటు ఆస్పత్రి ఐసీయూలో ఉన్నాడు. ఈ సమయంలో 50 రోజుల ICU బిల్లులు అతనికి పూర్తిగా అప్పులను మిగిల్చాయి భీమా లేకపోవడంతో డబ్బు మొత్తం మంచినీళ్లలా ఖర్చయిపోయింది. తండ్రి బాగు కోసం అక్కతో కలిసి రూ. 5 లక్షలు పర్సనల్ తీసుకున్నాడు. వాళ్ల అక్క కూడా రూ. 5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకుంది.
ఇక తండ్రి మరణం తర్వాత అతని ఆర్థిక పరిస్థితి చాలా దిగజారింది. ఈ సమయంలో తరతరాల నుంచి వస్తున్న కుటుంబ ఆస్తిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తండ్రి మరణంతో ఒంటరైన తల్లిని చూసుకోవడానికి సింగపూర్ లో పని చేయాలన్న తన కలను కూడా వదులుకున్నాడు. ఇక్కడే కష్టపడి పనిచేసి 2018 నాటికి రూ. 50 లక్షల జీతానికి చేరుకున్నాడు. అప్పులేకుండా రెండవ ఇల్లు, స్థిరమైన ఆదాయాన్ని పొందగలిగాడు. కానీ ఈ వృద్ధిలోని ప్రధాన పాఠం ఏంటంటే.. ఆదాయానికి మించి, ఆర్థిక జ్ఞానం అవసరం ముఖ్యం అని తెలుసుకున్నాడు.
తన 30వ దశకంలో తీవ్ర బీపీతో ఆసుపత్రిలో చేరిన తర్వాత.. డబ్బు మాయలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత పెద్ద తప్పో అతను గ్రహించారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి వల్ల ఆరోగ్యం పాడయిపోయింది.ఇది జీవితంలో పెను మార్పులకు ప్రధాన కారణమైంది.
ప్రారంభంలో ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ స్వయంగా నిర్వహించేవారు. అయితే తక్కువ రాబడులు రావడంతో SEBI-రిజిస్టర్ అయిన ఫీజు ఆధారిత ఫైనాన్షియల్ ప్లానర్ సహాయం తీసుకున్నారు. ప్రస్తుతం అతని ఆదాయం సంవత్సరానికి రూ. 2.5 కోట్లు.. ఇక అతని రియాల్టీ ఆస్తులు విలువ రూ. 4.5 కోట్లు.ఇక లిక్విడ్ ఆసెట్లు రూ.10 కోట్లు ఉన్నాయి. అప్పులేమి లేవు.. క్లుప్తంగా ఆయన ఏం చెబుతున్నారంటే.. ఆదాయం ఏకైక లక్ష్యం కాదు, సంపదకి మూలం ఆర్థిక ప్రణాళిక.. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోకుంటే ఎంత సంపాదించినా వేస్ట్.. ఎంత సంపాదించినా, ప్లాన్ లేకపోతే అంతా ఆవిరై పోతుందని టెకీ చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications