బెంగళూరులో సోషల్ మీడియాలో ఫోటోలు చూసి రూ.2 కోట్లతో ఇల్లు కొన్న 24 ఏళ్ళ టెకీ.. తీరా చూస్తే..

ఇంతకుముందు పూర్తిగా ఆఫ్‌లైన్‌లోనే సాగిన రియల్ ఎస్టేట్ రంగం, ఇప్పుడు వేగంగా డిజిటల్ దిశగా మారుతోంది. ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలు ఇప్పుడు ప్రధాన మార్కెటింగ్ సాధనాలుగా మారాయి. ఎందుకంటే అక్కడ లక్షలాది యూజర్లు ఉంటారు. ఇంటి ఫోటోలు, వీడియోలు, లైవ్ టూర్ల వంటి విజువల్ కంటెంట్‌తో వారి దృష్టిని తేలికగా ఆకర్షించవచ్చు.

Bengaluru Real Estate Techie Home loan 2BHK apartment Reddit viral Millennials Real estate Instagram marketing First-time homebuyers Property trends Digital marketing Broker strategy 2BHK

ఈ మార్పుకు ఉదాహరణగా బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఇటీవలే తన మొదటి 2BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. ఆ ఇంటి వివరాలు మొదటిగా అతని తండ్రే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి గుర్తించారు. "ఇప్పుడు చాలా మంది బ్రోకర్లు కూడా ఇన్‌స్టాలోనే లిస్టింగ్స్ పెడుతున్నారు. అక్కడ మంచి ఆఫర్లు కనిపిస్తున్నాయి," అని ఈ యువకుడు చెబుతూ తన అనుభవాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నాడు.

ఈ బెంగళూరు టెకీ "మా నాన్నగారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అపార్ట్‌మెంట్‌ను చూశారు. ఇప్పుడు చాలా మంది బ్రోకర్లు కూడా ఇన్‌స్టాలో పెడుతున్నారు. అక్కడ చాలా మంచి ఆఫర్లు దొరుకుతున్నాయి" అని పోస్ట్‌లో ఫ్లాట్‌లోని బెడ్‌రూమ్ ఫోటోతో పాటు, తన హోమ్ లోన్ అకౌంట్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు, "అబ్బా...ఇంత అందమైన ఇల్లు? అదీ 24 ఏళ్లకే?" అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, ఇప్పటికే రెండు నెలలుగా హోమ్ లోన్ EMIలు చెల్లిస్తున్నాడని తెలిపారు.

ఇది ఎలా జరిగిందో కూడా చక్కగా వివరించాడు, మొదటగా దాన్ని ఆయన తండ్రి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసారని వెల్లడించాడు. ఇంటి మొత్తం విలువ రూ. 1.9 కోట్లకు తీసుకోగా ఆ మొత్తంలో 35 శాతం నగదు రూపంలో చెల్లించగా, మిగిలిన 65 శాతం(రూ. 1.22 కోట్లు) కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లు తెలిపాడు. మొదటిగా డౌన్‌పేమెంట్‌కు తల్లిదండ్రులు కొంత సహాయం చేసినప్పటికీ, లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడం మరియు నెలవారీ EMIలు తన బాధ్యతగా తీసుకున్నట్టు పేర్కొన్నారు.

ఇది కేవలం ఒక వ్యక్తిగత కథ కాదు. ఇది ప్రస్తుతం ఏర్పడుతున్న ఒక కీలక ట్రెండ్‌కు సూచన. బెంగళూరులో యువ మిలీనియల్స్ (Millennials) రూ. 1 నుంచి రూ. 2 కోటి మధ్య విలువ గల అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేయడంలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 2025 మొదటి భాగంలో ఈ ధర శ్రేణిలో 12,000కు పైగా యూనిట్లు మార్కెట్‌లోకి వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కేటగిరీలో మిల్లేనియల్స్ ప్రధాన వినియోగదారులుగా నిలిచారు.

ఇప్పటి డిజిటల్ యుగంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఏజెంట్లు ఇన్‌స్టాగ్రామ్‌ను తమ ప్రధాన మార్కెటింగ్ ప్లాట్‌ఫాంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా 22-34 ఏళ్ల మధ్య వయసు కల యువత అధికంగా ఈ యాప్‌ను వాడుతున్నారు కాబట్టి, ఫస్ట్‌టైమ్ హోమ్ బయ్యర్లను చేరుకోవడంలో ఇది చాలా ప్రభావవంతంగా మారింది. ఇంటి ఫోటోలు, వీడియో టూర్లు, రీల్స్‌, కరోసెల్ పోస్టుల ద్వారా ఫ్లాట్‌లోని ప్రతీ మూలను ఆకర్షణీయంగా చూపిస్తున్నారు. అంతేకాకుండా, "వర్చువల్ ఓపెన్ హౌస్" లైవ్ వీడియోలతో ఇంటిని ప్రత్యక్షంగా చూపించగలుగుతున్నారు.

వారు వారి బిజినెస్ అకౌంట్లలో కంపెనీ పేరు, ఫోన్ నెంబర్, వెబ్‌సైట్ లింక్‌ను బయోలో పెట్టి, డైరెక్ట్ మెసేజ్ లేదా లింక్ ద్వారా కొనుగోలు చేసేలా చేస్తారు. స్టోరీస్, హైలైట్స్ ద్వారా రోజూ కొత్త ఆఫర్లు షేర్ చేస్తూ, హ్యాష్‌ట్యాగ్స్ (#2BHKBangalore, #FlatsForSale) వంటివి ఉపయోగించి టార్గెట్ సెర్చ్‌లో తారసపడేలా చేస్తున్నారు.

అలాగే కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు పాత క్లయింట్ల రివ్యూలను వీడియోలుగా పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది బ్రోకర్లు తమ యాప్‌లను కూడా లింక్ చేసి, నేరుగా స్థలాలు బుక్ చేసుకునే అవకాశమివ్వడమూ జరుగుతోంది. మొత్తానికి, ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు బ్రోకర్లకు కేవలం సోషల్ మీడియా కాకుండా, మొత్తంగా డిజిటల్ మార్కెట్ ప్లేస్‌గా మారింది.

వీరి బ్రాండ్ ఇమేజ్ బలపడటానికి, కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి, డీల్ క్లోజింగ్ వరకు పూర్తి ప్రయాణాన్ని ఇన్‌స్టాలోనే సెట్ చేసుకునేలా బ్రోకర్లు తమ వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు. ఇది ఒక వేగవంతమైన, మల్టీమీడియా ఆధారిత రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ టూల్‌గా మారిన దశగా చెప్పవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+