IT News: దేశంలోని ప్రముఖ టెక్ దిగ్గజాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటి. భారత సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పండంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇంతటి ఘన చరిత్ర కలిగిన టాటా కంపెనీకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఉద్యోగులందరూ వణికిపోయినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
కంపెనీలో బాంబు ఉందంటూ బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) థింక్ క్యాంపస్ లోని B బ్లాక్ కు ఇవాళ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో స్థానిక పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ ను కంపెనీ అప్రమత్తం చేసింది. బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్‌తో పాటు పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హుబ్లీకి చెందిన TCS మాజీ ఉద్యోగి ఈ బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసుల తదుపరి విచారణలో తేలిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. నిందితుని పూర్తి వివరాలు వెల్లడి కాలేదు కానీ ఆ కాల్ చేసింది ఓ మహిళగా గుర్తించారు. కంపెనీపై కోపంతోనే ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తేల్చారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
దాదాపు 6 నెలల క్రితం హైదరాబాద్‌లోని TCS క్యాంపస్‌కు ఇలాంటి బూటకపు బాంబు హెచ్చరిక కాల్ వచ్చింది. ఆ ఫోన్ కూడా బెంగళూరుకు చెందిన కంపెనీ మాజీ ఉద్యోగి నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. అనతరం విచారణలో కాలర్ హైదరాబాద్ TCSలోని సెక్యూరిటీ వింగ్ లో పనిచేసిన మాజీ ఉద్యోగిగా గుర్తించారు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇలా చేసినట్లు తేలింది. కాగా ఇప్పుడు మరోసారి ఇదే తరహా ఘటన రిపీట్ అయింది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications