Zepto, Blinkit, Bigbasketకి చుక్కలు చూపిస్తున్న చిన్న వ్యాపారి.. నీ తెలివి భళా తమ్ముడు..!!
Coconut Vendor: దేశంలో క్విక్ కామర్స్ కంపెనీలు రావటంతో చిన్న మధ్య తరహా వ్యాపారాలు భారీగా మూతపడిన సంగతి తెలిసిందే. ఈ స్టార్టప్ కంపెనీలు వేల కోట్లను ఫండ్ రూపంలో తెచ్చుకుని వాటితో ఆఫర్లంటూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి. సొమ్మొకడిది సోకొకడిది కావటంతో వీరి దూకుడు ఉంటుంది. ఇది వీధి వ్యాపారులను సైతం దెబ్బతీస్తోంది.
పెద్ద కార్పొరేట్ కంపెనీల వ్యాపార దందా ఎంత దారుణంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే దీనిని తట్టుకుని ముందుకు సాగటానికి చాలా మంది ప్రయత్నించారు. అయితే కొంచెం కామన్ సెన్స్ ఉంటే టాలు వ్యాపారాన్ని ఎలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు న్యాయంగా అనే విషయాన్ని బెంగళూరులో ఒక కొబ్బరి బొండాలు అమ్మే వ్యాపారి చేయటం ఇప్పుడు అందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. స్టార్టప్ కంపెనీల క్విక్ కామర్స్ సంస్థలు తమ యాప్స్ ద్వారా నిమిషాల్లో డార్క్ స్టోర్ల నుంచి వస్తువులను సరఫరా చేస్తుంటాయి. పైగా ఎక్కువసార్లు ఆఫర్లంటూ వస్తువుల రేట్లను బయటి కంటే ఎక్కువగా పెట్టి వాటిని తగ్గిస్తుంటాయి.

వీటిని అధిగమించి ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు బెంగళూరులోని ఒక స్ట్రీట్ వెండార్. అమ్మేది కొబ్బరిబోండాలో కానీ ఐఐటీ గ్యాడ్యుయేట్లకు అతని ఆలోచన పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మార్కెట్లోని బడా క్విక్ కామర్స్ సంస్థలైన జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ తన కంటే అధిక రేటుకు కొబ్బరి బొండాలు అమ్ముతున్నట్లు రేట్లతో సహా తన వ్యాపార స్థలం వద్ద బోర్డును పెట్టాడు. తాను వీరికంటే తక్కువకే బొండాలు విక్రయిస్తున్నట్లు అందులో వెళ్లడించటంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
పోస్టులో వెల్లడించిన సమాచారం ప్రకారం Zeptoలో ధర రూ.80, Blinkitలో ధర రూ.80, Bigbasket లో ధర రూ.70 ఉందని అయితే తాను మాత్రం కొబ్బరికాయను ఒక్కోటి రూ.55కే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ వివరాలను ఇంగ్లీషులోరాసి ఉంచిన పోస్టర్ షాపు వద్ద గోడకు అతికించాడు. అతని ప్రకటన పీక్ బెంగళూరులో షేర్ చేయబడింది. ఫాస్ట్ ట్రేడ్ రోడ్డు పక్కన కొబ్బరి విక్రయదారులను ప్రభావితం చేస్తుందా? అనే టైటిల్‌తో షేర్ చేశారు. ఈ పోస్ట్ నవంబర్ 7న ప్రచురించబడగా సోషల్ మీడియాలో ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. దీనిపై ట్విట్టర్లో సైతం చాలా మంది స్పందిస్తూ కొబ్బరికాయకు రూ.50 ధర కూడా చాలా ఎక్కువేనని అంటున్నారు. మరికొందరైతే దిల్లీలో రోడ్డుపక్కన వ్యాపారులు రూ.80కి విక్రయిస్తున్నారని మరికొందరు కామెంట్లలో పేర్కొన్నారు. చాలా మంది చిన్న వ్యాపారులను రక్షించాలని వారి నిజాయితీని గౌరవించాలని అంటున్నారు. బడా కార్పొరేట్ కంపెనీల నుంచి చిన్న వ్యాపారులను కాపాడాలని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications