Bengaluru AI Job: అమెరికాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రస్తుతం ఇప్పటి వరకు డిగ్రీతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న వ్యక్తులకు మాత్రమే కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహా పరిస్థితులు ఇండియాలో కూడా రానున్న కాలంలో కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఒక ఏఐ స్టార్టప్ ఇటీవల ఉద్యోగులం ఎంపిక విషయంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. సాధారణంగా విద్యార్హతలు, డిగ్రీలు, రెజ్యూమ్ల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తున్న రొటీన్ ప్రక్రియ అడ్డుగోడను పగలగొట్టింది. ఈ క్రమంలో స్మాలెస్ట్ AI అనే కంపెనీ కొత్తగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ పోస్ట్ చేసింది. దీని కింద ఎంపికైన వ్యక్తికి ఏడాదికి రూ.40 లక్షల జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం అభ్యర్థులను ఎంచుకునే ప్రక్రియలో విద్యార్హతలు, అనుభవం అనే విషయాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని కంపెనీ పేర్కొంది.

తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అభ్యర్థులు తమ నైపుణ్యాలను నిరూపించేందుకు 100 పదాల పరిచయంతో పాటు తమ ఉత్తమ పనులకు సంబంధించిన లింకులను పంపాలని సూచించింది. ఈ వివరాలను ట్విట్టర్ వేధికగా ప్రకటించటంతో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ కొనసాగుతోంది. వాస్తవానికి టెక్ నిపుణుల్లో సైతం ఈ అంశంపై పెద్ద స్థాయిలో చర్చ కొనసాగుతోంది. కొందరు దీనిని అభినందిస్తుండగా.. మరికొందరు మాత్రం ఎలాంటి నైపుణ్యాలు, విద్యార్హతలను పరిగణలోకి తీసుకోకపోవటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ దీని కింద ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ కోసం వ్యక్తిని హైర్ చేసుకోవాలని చూస్తోంది.
We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI
— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025
Salary CTC - 40 LPA
Salary Base - 15-25 LPA
Salary ESOPs - 10-15 LPA
Joining - Immediate
Location - Bangalore (Indiranagar)
Experience - 0-2 years
Work from Office - 5 days a week
College - Does not matter…
స్మాలెస్ట్ AI వ్యవస్థాపకుడు సుదర్శన్ కమత్ చేసిన పోస్టులో తాము ఫుల్-స్టాక్ ఇంజినీర్‌ను నియమించడానికి చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు 100 పదాల ఇంట్రోతో పాటు తమ ఉత్తమ పనికి సంబంధించిన లింక్స్ [email protected] కు పంపాలని కోరారు. ఇక్కడ అభ్యర్థి నైపుణ్యాలను మాత్రమే తాము చూస్తామని డిగ్రీలను కాదని వెల్లడించారు. కనీసం సున్నా నుంచి 2 ఏళ్ల మధ్య అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు కూడా దీని కోసం అప్లై చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
కానీ నెట్టింట ఈ ప్రకటనపై రెస్పాన్సులు మిశ్రమంగా ఉన్నాయి. కొంతమంది ఈ కొత్త విధానాన్ని ప్రశంసింస్తుండగా.. ఒక వినియోగదారు "నిజంగా మీరు కాలేజ్ మరియు గ్రేడ్‌లకు బదులుగా ఫలవంతమైన పని అడుగుతున్నందుకు నాకు ఇష్టమైందని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం కంపెనీ ఆఫర్ చేస్తున్న వేతనంపై చర్చిస్తున్నారు. ఇందిరానగర్ చాలా ఖరీదైన ప్రాంతం, రూ.15 లక్షల జీతం తీసుకుంటే నెలకు చేతికి రూ. లక్ష మాత్రమే వస్తుంది. అద్దె, గ్రోసరీస్, వారాంతపు ఖర్చులు, EMI లాంటి ఇతర ఖర్చులతో నెలకు కేవలం రూ.20,000 సేవింగ్ మాత్రమే మిగులుతాయని అన్నాడు. మెుత్తానికి ఈ విధానం ప్రస్తుతంలోని సాధారణ ఉద్యోగ నియామక విధానాలకు విరుద్ధంగా ఉందని చెప్పవచ్చు.. కానీ ఇది టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ నైపుణ్యాలను గుర్తించే కొత్త దారికి మార్గదర్శకంగా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

ఫ్రిజ్‌లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

Bengaluru: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నరకం చూశాం: యుద్ధం మధ్య చిక్కుకున్న పీవీ సింధు ఎమోషనల్ పోస్ట్!

Bengaluru: క్యాబ్‌లోనే వంట, ఆఫీస్ వర్క్.. బెంగళూరు ట్రాఫిక్‌పై జర్మన్ యువతి జోకులు!

Bengaluru: బెంగళూరు రియల్ ఎస్టేట్ 2026.. ఏ ఏరియాలో ధర ఎంత? పూర్తి వివరాలు!

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

Layoffs: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్.. 30 వేల మందిపై వేటు? అసలు కారణం ఇదేనా?

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..



Click it and Unblock the Notifications