తాను నమ్మిన కల కోసం రిస్క్ తీసుకుని అందులో సక్సెస్ అయితే వచ్చే కిక్కే వేరు. అలాంటిదే హర్విన్ సింగ్ ది కూడా. బెంగళూరు (Bengaluru) కు చెందిన ఈ స్టార్టప్ ఉద్యోగి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలో సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి, ఒక కొత్త స్టార్టప్‌లో చేరినప్పుడు అతని తల్లిదండ్రులు ఎంతగానో ఆందోళన చెందారు. కానీ, నేడు అదే స్టార్టప్ సాధిస్తున్న విజయాలు చూసి వారు గర్వంతో మురిసిపోతున్నారు.

అసలేం జరిగింది?
హర్వీన్ సింగ్ చద్దా అనే యువకుడు ఏప్రిల్ 2025లో మైక్రోసాఫ్ట్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 'సర్వం AI' (Sarvam AI) అనే బెంగళూరు స్టార్టప్ లో ఎల్‌ఎల్‌ఎమ్ రీసెర్చర్ గా చేరాడు. అప్పట్లో కొడుకు తీసుకున్న ఈ నిర్ణయం చూసి అతని తల్లిదండ్రులు అస్సలు సంతోషించలేదు. ఇంత పెద్ద కంపెనీని వదిలి కొత్త కంపెనీలో చేరడం రిస్క్ అని భావించారు. కానీ 10 నెలల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది.
తల్లిదండ్రుల మార్పు.. గర్వంతో కూడిన ప్రచారం!
ఇటీవల ఢిల్లీలో జరిగిన 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' లో సర్వం AI అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికల్లో ఆ కంపెనీ పేరు మారుమోగింది. ఇది చూసిన హర్వీన్ తండ్రి.. తన కొడుకు పని చేస్తున్న కంపెనీ గురించి వచ్చిన ప్రతి క్లిప్పింగ్ ను భద్రపరుస్తున్నారు. ఇక తల్లి అయితే తన వాట్సాప్ గ్రూపుల్లో, ఇరుగుపొరుగు వారికి తన కొడుకు గొప్పతనాన్ని, కంపెనీ ఘనతను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. "10 నెలల క్రితం వారు బాధపడ్డారు. కానీ, నేడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు వారి ముఖంలో చిరునవ్వు చూశాను" అని హర్వీన్ 'ఎక్స్' లో భావోద్వేగంగా రాశారు.
అసలు 'సర్వం AI' స్పెషాలిటీ ఏంటి?
2023 లో బెంగళూరు (Bengaluru) వేదికగా ప్రారంభమైన ఈ కంపెనీ, భారతీయుల కోసం ప్రత్యేకంగా AI మోడళ్లను అభివృద్ధి చేస్తోంది. మన దేశంలో 1.45 బిలియన్ల జనాభా ఉన్నప్పటికీ, చాలా మందికి ఇంగ్లీష్ రాయడం లేదా టైప్ చేయడం రాదు. అందుకే సర్వం AI కేవలం మాట ద్వారా (Voice- first) పని చేసే టెక్నాలజీని రూపొందించింది. ఇది సుమారు రెండు డజన్ల భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ స్టార్టప్ కృషిని గతంలో ప్రశంసించడం విశేషం.
భారతీయ సాంకేతిక సార్వభౌమాధికారం
ఇండియా AI సమ్మిట్ లో సర్వం సహ-వ్యవస్థాపకుడు వివేక్ రాఘవన్ మాట్లాడుతూ.. విదేశీ టెక్నాలజీల కంటే మన స్వదేశీ టెక్నాలజీ (Indigenous Tech) ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. భారత్ తన స్వంత ఏఐ (AI) మౌలిక సదుపాయాలను నిర్మించుకోవడం వల్ల దేశ భద్రత, డేటా ప్రైవసీ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హర్వీన్ లాంటి ప్రతిభావంతులు దేశం కోసం ఇలాంటి స్టార్టప్‌లలో చేరడం భారత్ టెక్ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించబోతోందనడానికి ఒక నిదర్శనం.
More From GoodReturns

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Jiostar: జియో సినిమాను నంబర్ వన్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు ఏఐ ప్రపంచాన్ని ఏలబోతున్నారా?

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications