AI: మీడియా రంగంలో AI టెక్నాలజీ వినియోగం వల్ల న్యూస్ ప్రజెంటర్స్ కొలువులకు ఇబ్బందులు తలెత్తనున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ సమయంలో తాజాగా బెంగళూరుకు చెంది ఓ కంపెనీ తీసుకున్న నిర్ణయం.. ఈ ధోరణిపై మరిన్ని ఆందోళనలను లేవనెత్తింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతోంది.
దుకాణ్ వ్యవస్థాపకులు, CEO సుమిత్ షా చేసిన ట్వీట్ పై పెద్ద దుమారం చెలరేంగింది. కస్టమర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాము AI చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. దీంతో సహాయక సిబ్బందిలో 90 శాతం మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం కఠినమైనదే అయినా తప్పనిసరి అని తెలిపారు.

సాధారణ ఉద్యోగుల స్థానంలో AI వినియోగం వల్ల తమ సంస్థకు లభించిన బెనిఫిట్స్ ను సైతం షా స్పష్టం చేశారు. కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో AI చాట్ బాట్ అత్యంత ప్రభావవంతంగా పనిచేసిందని పేర్కొన్నారు. తద్వారా కంపెనీకి దాదాపు 85 శాతం మేర ఖర్చు ఆదా అయినట్లు చెప్పారు.
షా ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. కంపెనీ చాలా మంది ఉద్యోగులను తొలగించడాన్ని తప్పుపడుతూ కొందరు విమర్శలకు దిగారు. కాగా AIని వినూత్నంగా ఉపయోగించారని మరికొందరు ప్రశంసించారు. లింక్డ్ ఇన్ పోస్టులో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని దుకాణ్ CEO ప్రకటించారు. ఈ విధంగా చూస్తే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఉద్యోగాలు ఊడతాయోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.
More From GoodReturns

నోకియా నుంచి 14 వేల మంది రోడ్డు మీదకు.. టెలికాం రంగంలో ప్రకంపనలు రేపుతున్న తాజా లేఆప్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications