బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది చరిత్ర సృష్టించారు. నగరంలో తొలిసారిగా ఒకే సంవత్సరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై వసూలైన జరిమానాల మొత్తం రూ. 200 కోట్ల మార్క్‌ను దాటింది. 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు, అధికారులు 51.8 లక్షల మంది ఉల్లంఘనదారుల నుండి రూ. 207.35 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. ఈ గణాంకాలు బెంగళూరు నగర ట్రాఫిక్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలిచాయి.
2024లో మొత్తం 82.9 లక్షల కేసులు నమోదు కాగా.. వాటి ద్వారా వసూలైన జరిమానా మొత్తం రూ. 84.91 కోట్లుగా మాత్రమే ఉంది. అంటే, ఈ ఏడాది వసూలైన మొత్తం ఆదాయం గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెండింతలు. ఇది ట్రాఫిక్ అమలులో పోలీసులు తీసుకున్న సాంకేతిక ఆధారిత చర్యలకు నిదర్శనం. 2025లో ట్రాఫిక్ వసూళ్లు పెరగడానికి ఒక ముఖ్య కారణంజ. పెండింగ్ జరిమానాలపై రాయితీ పథకం. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 14 వరకు Bengaluru ట్రాఫిక్ పోలీసులు బకాయిలపై 50 శాతం డిస్కౌంట్ అందించారు. ఈ కాలంలోనే సుమారు 3.86 లక్షల కేసులు క్లియర్ అయ్యాయి, దీని ద్వారా ఒక్కసారిగా రూ. 106 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పథకం పౌరులను పాత చలాన్లను చెల్లించడానికి ప్రోత్సహించింది.

బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రాయితీ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చింది. చాలామంది పౌరులు పాత బకాయిలను క్లియర్ చేశారు. ప్రస్తుత అమలు చర్యలు సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నో పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపారు. 2025లో నమోదైన మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల్లో హెల్మెట్ లేని డ్రైవర్లు, వెనుక సవారీదారులు అత్యధికంగా ఉన్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసిన 15.85 లక్షల కేసులు, వెనుక ప్రయాణికులపై 8.71 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే, మొత్తం కేసుల్లో దాదాపు సగం హెల్మెట్ సంబంధిత ఉల్లంఘనలే.
ఇతర ప్రధాన ఉల్లంఘనల్లో తప్పుడు పార్కింగ్ 7.11 లక్షల కేసులు, సిగ్నల్ జంపింగ్ 5.11 లక్షలు, సీట్ బెల్ట్ పాటించకపోవడం 5.46 లక్షలు నమోదు అయ్యాయి. ఇవి ట్రాఫిక్ నియమాలను పట్టించుకోని డ్రైవర్ల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.
బెంగళూరు ట్రాఫిక్ అమలు విభాగం సాంకేతికతపై ఆధారపడటం కొనసాగిస్తోంది. AI ఆధారిత కెమెరాలు, ఆటోమేటెడ్ ఈ-చలాన్ సిస్టమ్‌ల ద్వారా ఎక్కువ ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. 2024లో మొత్తం 94 శాతం ఉల్లంఘనలు ఆటోమేటిక్‌గా బుక్ చేయబడ్డాయి. 2025లో ఇప్పటివరకు ఆ సంఖ్య 87 శాతం వద్ద ఉంది. ఇది ఆన్-గ్రౌండ్ పోలీసింగ్‌పై ఒత్తిడిని తగ్గిస్తూ, ట్రాఫిక్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా చేస్తోంది.
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి ఈ రికార్డు వసూళ్లు ఊరట కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ జరిమానాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రాష్ట్ర ఖజానాలో జమ అవుతుంది. ఇది పలు సంక్షేమ పథకాల అమలుకు ఆర్థిక మద్దతు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే అధిక వసూళ్లు జరిమానాలు పెరిగిన సూచిక కాదు.. ట్రాఫిక్ క్రమశిక్షణ తగ్గిన సంకేతమని. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం, విద్యా కార్యక్రమాలు చేపట్టడం కూడా అంతే అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications