కర్ణాటక నగరానికి సమీపంలో రెండవ ఎయిర్ పోర్ట్ కోసం అనువైన స్థలాన్ని గుర్తించడానికి వచ్చిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారుల బృందం మంగళవారం కనకపుర రోడ్డులోని రెండు ప్రదేశాలను అలాగే నెలమంగళ-కునిగల్ రోడ్డులోని ఒక స్థలాన్ని సందర్శించి పరిశీలించనుంది. అయితే కర్ణాటక ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఖుష్బూ గోయల్ నిన్న సోమవారం మూడు ప్రతిపాదిత ప్రదేశాల గురించి వీరికి వివరించారు. ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వం & కర్ణాటక రాష్ట్ర పారిశ్రామిక అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (KSII DC) అధికారులను సోమవారం కలిసింది.

అలాగే ఈ బృందం బుధవారం మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రి ఎంబి పాటిల్‌తో చర్చలు జరపనుంది. AAI బృందం మంగళవారం ఉదయం 10 గంటలకు కనకపుర రోడ్డు నుండి ఈ ప్రదేశాల చెకింగ్ ప్రారంభించి తరువాత నేలమంగళకు బయలుదేరుతుంది. ఎంబి పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ, "బెళగావి, హుబ్లి మధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలనే డిమాండ్ ఉంది. ఎందుకంటే విదేశాలకు నేరుగా ప్రయాణించడానికి ఈ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించాలి అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ముందస్తు అధ్యయనం కోసం సూచించిన మూడు ప్రదేశాలలో రెండు కనకపుర రోడ్డులో ఉన్నాయి చూడహళ్లి అండ్ సోమనహళ్లి. మూడవది నెలమంగళ-కునిగల్ రోడ్డులో ఉంది. ఈ మూడు ప్రదేశాలలో బెంగళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన టెక్నీకాల్ ప్రదర్శనలను సోమవారం AAI బృందానికి అందించారు. ఈ ప్రదర్శనలో ఆయా ప్రదేశాల భూభాగం, 10 సంవత్సరాల వాతావరణ రిపోర్ట్, రోడ్డు, రైలు ఇంకా మెట్రో కనెక్టివిటీ అండ్ బెంగళూరు నుండి మూడు ప్రదేశాల దూరం గురించి వివరాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. AAI బృందం ఏప్రిల్ 9 వరకు కర్ణాటకలో ఉండి, తనిఖీ కోసం ప్రతిపాదిత ప్రదేశాలను సందర్శిస్తుంది.
వీరి సందర్శనల తర్వాత AAI బృందం ఒక రిపోర్ట్ సమర్పిస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక స్థలాన్ని ఖరారు చేసి, విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారుల కోసం చూస్తుంది అని తెలిపాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి 74 కి.మీ దూరంలో ఉన్న హోసూర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాల కోసం వెతుకుతోంది.


Click it and Unblock the Notifications