బెంగళూరు అనగానే ఐటీ కంపెనీలు, ట్రాఫిక్, బిజీ లైఫ్ గుర్తొస్తాయి. కానీ గత కొంతకాలంగా ఈ నగరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీటి కొరత. వేసవి కాలంలో కరవైన కావేరి నీటి సరఫరా, పెరిగిన జనాభా ఇవన్నీ కలిపి బెంగళూరును నీటి సంక్షోభంలోకి నెట్టేశాయి. అయితే, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఎలాంటి భారీ ప్రాజెక్టులు, టెక్నాలజీలు అవసరం లేదు ఒక చిన్న పరికరం గేమ్‌చేంజర్‌గా మారింది. అదే "ట్యాప్ ఏరేటర్".
బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) ఈ ఆలోచనను పెద్ద స్థాయిలో అమలు చేసింది. గత సంవత్సరం నుండి పాఠశాలలు, అపార్ట్‌మెంట్లు, ఆఫీసులు, మాల్స్ వంటి బల్క్ యూజర్లకు ఏరేటర్లు "తప్పనిసరి" చేశారు. ఇప్పటివరకు నగరంలో "15 లక్షలకు పైగా ఏరేటర్లు" అమర్చబడ్డాయి. నియమాలు పాటించని వారికి రూ. 5,000 జరిమానా అవసరమైతే నీటి సరఫరా కూడా తగ్గిస్తామని BWSSB స్పష్టం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 594 కేసులు బుక్ చేసి రూ. 29.7 లక్షల జరిమానా వసూలు చేశారు.

BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ ప్రకారం, ఈ చిన్న మార్పుతో నగరం "రోజుకు దాదాపు 10 కోట్లు లీటర్ల నీటిని" సేవ్ చేస్తోంది. ఇది కేవలం ట్యాప్స్‌లో ఏరేటర్ పెట్టడం వల్లే సాధ్యమైంది. ఊహించండి ఎలాంటి పెద్ద ఖర్చు లేకుండా, సులభమైన మార్పుతో నగరానికి ఎంతటి రీలీఫ్ వచ్చిందో. గత నెలలో కావేరి ప్రాజెక్ట్ నిర్వహణ పనుల కారణంగా 60 గంటల నీటి సరఫరా అంతరాయం జరిగింది. ప్రస్తుతానికి కేవలం 1,460 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. కావేరి స్టేజ్ V ప్రారంభమైతే అదనంగా 750 MLD నీరు వస్తుంది కానీ విద్యుత్ ఖర్చులు కూడా ఇంకా పెరిగిపోతాయి.
ఏరేటర్ అంటే ఏమిటి?
ఏరేటర్ ప్రాథమికంగా ఒక చిన్న రింగ్ లాంటి పరికరం. దీన్ని ట్యాప్ చివర అమర్చేస్తే చాలు. ఇది నీటి ప్రవాహాన్ని నియంత్రించి, వృథాను తగ్గిస్తుంది. ఉదాహరణకు ఒక సాధారణ ట్యాప్‌లో నిమిషానికి సుమారు 10-15 లీటర్ల నీరు వస్తుంది. కానీ ఏరేటర్ అమర్చిన తర్వాత అది కేవలం "3-4 లీటర్లకు" తగ్గిపోతుంది. మన పనులకి సరిపోయేంత నీరు వస్తుంది కానీ వృథా మాత్రం దాదాపు 70% తగ్గిపోతుంది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
ఇది ముఖ్యంగా ఎక్కువ "హ్యాండ్‌వాష్ ట్యాప్స్"లో అమర్చుతారు. ఎందుకంటే ఇళ్లలో రోజువారీ నీటి వినియోగంలో 30% వరకు ఈ ట్యాప్స్ ద్వారానే వృథా అవుతుంది. ఏరేటర్ ఖరీదు చాలా తక్కువ. ఇంట్లో నైనా, ఆఫీసులోనైనా పెట్టుకోవచ్చు. ఒక చిన్న పరికరం వల్ల ఒక పెద్ద నగరం నీటి సంక్షోభాన్ని తట్టుకోగలిగింది. బెంగళూరు ఉదాహరణ మనందరికీ ఒక మంచి లెసన్ అవుతోంది సమస్య ఎంత పెద్దదైనా, స్మార్ట్ సొల్యూషన్‌తో దాన్ని తగ్గించవచ్చు.
పెద్ద ప్రాజెక్టులు కాకుండా, చిన్నచిన్న మార్పులు కూడా నగరానికి పెద్ద తేడా తీసుకురావచ్చని బెంగళూరు ప్రూవ్ చేసింది. ఏరేటర్ లాంటి సింపుల్ ఐడియా దేశంలోని ఇతర నగరాల్లో కూడా అమలైతే, నీటి వృథా సమస్య చాలా వరకు తగ్గవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications