ఇన్నాళ్లుగా బెంగళూరు అంటే టెక్నాలజీ, స్టార్టప్‌లు, కొత్త ఆలోచనలకు హబ్. ప్రతి వీధిలో ఒక ఐడియా, ప్రతి క్యాఫేలో ఒక స్టార్టప్ స్టోరీ. అలా జన్మించిన ఓ ప్రయోగమే 'Blip'. ఇది కేవలం ఫ్యాషన్ స్టార్టప్ కాదు "పది నిమిషాల్లో ఫ్యాషన్ డెలివరీ!" అన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. కానీ ఆ కల ఒక్క ఏడాది కూడా నిలబడలేదు. ఎన్నో ఆశలతో ప్రారంభించిన ఈ స్టార్టప్, ఏడాదికే తలదించుకుంది. ఎందుకంటే ఆ కలకు ఎంత వేగం ఉన్నా, పునాది మాత్రం బలంగా లేదు.

బ్లిప్ అనే స్టార్టప్ ప్రత్యేకంగా ఒక వినూత్న ఆలోచనతో మార్కెట్లోకి వచ్చింది. ట్రెండీ ఫ్యాషన్ ఉత్పత్తులను కేవలం 30 నిమిషాల్లో వినియోగదారుల ఇంటి వద్దకు డెలివరీ చేయడం. ఇది ఒక సాధారణ ఆన్‌లైన్ షాపింగ్ అనుభవం కాదు. ఒకవేళ మీకు అకస్మాత్తుగా ఈవెంట్, డేట్, పార్టీ లేదా ఎమర్జెన్సీ వస్త్ర అవసరం ఉంటే, అప్పుడు వెంటనే ఆర్డర్ చేస్తే మీ ఇంటి వరకు అర్ధ గంటలో వస్త్రాలు, యాక్సెసరీస్, వంటి అవసరమైనవి వచ్చేవి. ఇందుకోసం బ్లిప్ స్థానిక ఫ్యాషన్ బ్రాండ్లతో భాగస్వామ్యం చేసి, ప్రత్యేకంగా ప్రణాళికతో రూపొందించిన మైక్రో-వేర్‌హౌజింగ్ మోడల్‌ను ఉపయోగించింది. వీటి ద్వారా వేగవంతమైన డెలివరీలు సాధ్యమయ్యేలా చేసింది. వినియోగదారులకు డోర్‌స్టెప్ డెలివరీతో పాటు స్టోర్ పికప్ అనే ఎంపిక కూడా అందించబడింది. ఈ విధంగా ఫ్యాషన్‌ను వేగంగా అందించాలన్న ఆవేశంతో ముందుకొచ్చిన 'Blip', యూజర్ అనుభవాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
ఈ సంస్థ అభివృద్ధికి కొన్ని ముఖ్యమైన కారణాల్లో మొదటిది పెట్టుబడి లోపం. తక్కువ వర్కింగ్ క్యాపిటల్‌తో వ్యాపారాన్ని నడిపించాలన్న లక్ష్యంతో ప్రారంభించినప్పటికీ, అది పెద్ద మార్కెటింగ్ ప్రణాళికలు, బలమైన డెలివరీ వ్యవస్థలు, టెక్నాలజీ అభివృద్ధిని కలిసి రావడానికి సాధ్యపడలేదు. ఈ లోపం వ్యాపారాన్ని నిలకడగా ముందుకు తీసుకెళ్లడంలో తీవ్రమైన ఆటంకంగా మారింది. రెండవ సవాలు పోటీ కంపెనీల ప్రవేశం. పెద్ద టెక్, ఈ-కామర్స్ కంపెనీలు అదే ఫ్యాషన్ క్విక్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టడంతో, చిన్న స్టార్టప్‌గా బ్లిప్ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం చాలా కష్టంగా మారింది. చివరగా, GTM (Go-To-Market) execution లో కూడా పలు అడ్డంకులు ఎదురయ్యాయి. వ్యూహాలు ఉన్నప్పటికీ, వాటిని వేగంగా అమలు చేయడంలో ఆలస్యం జరిగింది. సరైన సమయంలో సరైన ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం కుదరలేదు. దీని వలన బ్లిప్‌ను సరిగ్గా స్థిరంగా నిలపడం సాధ్యం కాలేదు.
ఈ స్టార్టప్ వ్యవస్థాపకులు తమ స్వంతంగా నిధులతో ఈ ప్రయాణం మొదలుపెట్టారు. దాంతో, చిన్న చిన్న విజయాల తర్వాత పెద్ద స్థాయిలో వ్యాపారం పెంచుకోవడంలో సమస్యలు వచ్చాయి. మార్కెట్లో ఉన్న బ్రాండ్స్‌కి పోటీ ఇవ్వాలంటే డబ్బు మాత్రమే కాదు, బలమైన వ్యూహం కూడా అవసరం. కానీ దానికి ముందే వేగంగా ముందుకు వెళ్లాలన్న తపనలో కొన్ని తప్పులు జరిగిపోయినట్టు కనిపిస్తుంది.
బ్లిప్ సహ-సంస్థాపకుడు అంష్ అగర్వాల్ లింక్డ్ఇన్‌లో పోస్టు చేస్తూ ఈ విధంగా తెలిపారు: "ఒక సంవత్సరం పాటు నిర్మించిన తర్వాత, మేము చివరకు ఆపివేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రంగంపై మాకు ఇంకా పూర్తి నమ్మకమే ఉంది. కానీ తక్కువ పెట్టుబడితో బూట్‌స్ట్రాప్ చేసి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం... ప్రత్యేకంగా ఈ స్థాయిలో పోటీ ఉన్న మార్కెట్‌లో ఎంతో కష్టం అయింది. ఇక్కడ ప్రతి అడుగు శ్రమతో నిండింది. అయినా మా టీం చేసిన ప్రయోగం మీద గర్వంగా ఉంది. ఈ ప్రయాణం మాకు గొప్ప పాఠాలు నేర్పింది."
ఈ పోస్ట్‌లో ఆయన వ్యక్తిగత అనుభవం, స్టార్టప్ వెనుక ఉన్న కృషి, ఆశలు, మార్కెట్‌కి ఎదురైన వాస్తవ పరిస్థితులు అన్నీ వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే చివరకు వదిలేయాల్సి వచ్చినా, బ్లిప్ ఒక ప్రయోగాత్మక ప్రణాళికగా, కొత్తదనం కోసం చేసిన ప్రయత్నంగా నిలిచింది. ఇది ఓ స్టార్టప్ క్లోజ్ అయిన కథ కాదు.. ఓ కొత్త దారిని అన్వేషించాలన్న ఆలోచనకు ప్రతిరూపం. సాధనలో ఎదురైన అడ్డంకులతో వెనక్కి తగ్గినా, ఫ్యాషన్ రంగంలో వేగవంతమైన సేవల అవసరంపై ఊహించి తీసిన ఈ అడుగు, భవిష్యత్తులో మరెవరికైనా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications