ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, ఒక యువకుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బెంగళూరు (Bengaluru) లోని ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో నివసించే 23 ఏళ్ల యువకుడు తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, తన చిన్న ఫ్లాట్ నుండే ఒక క్లౌడ్ కిచెన్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఎవరి సాయం లేకుండా వంట చేయడం, క్లీనింగ్, ప్యాకేజింగ్ , లాజిస్టిక్స్ వంటి అన్ని పనులను తనే స్వయంగా నిర్వహిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

"ఈరోజు ఒక సాహసోపేతమైన అడుగు వేశాను"
సదరు యువకుడు రెడ్డిట్ (Reddit) వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ.. "నాకు 23 ఏళ్లు, ఈరోజే నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. నా సొంత ప్లాన్ ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీలోని నా చిన్న ఫ్లాట్ నుండే క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం అన్నీ నేనే చూసుకుంటున్నాను. నా దగ్గర పెద్దగా డబ్బు లేదు, కేవలం జోమాటోలో రిజిస్టర్ చేయడానికి , ప్యాకేజింగ్ మెటీరియల్ కొనడానికి మాత్రమే సరిపడా నిధులు ఉన్నాయి. ఇది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కానీ, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను" అని రాసుకొచ్చాడు.
'అర్బన్ తడ్కా'కు పెరుగుతున్న మద్దతు
అతని పోస్ట్‌కు బెంగళూరు నెటిజన్ల నుండి విశేష స్పందన లభించింది. తన క్లౌడ్ కిచెన్ పేరు 'అర్బన్ తడ్కా' (Urban Tadka) అని అతను వెల్లడించగా, ఎలక్ట్రానిక్ సిటీ పరిసరాల్లో ఉండే కాలేజీ విద్యార్థులు , ఉద్యోగులు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ కిచెన్ ద్వారా నార్త్ ఇండియన్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, రోల్స్ , శాండ్‌విచ్‌లు విక్రయిస్తున్నట్లు అతను తెలిపాడు.
నెటిజన్ల సలహాలు.. హెచ్చరికలు
ఈ సాహసాన్ని మెచ్చుకుంటూనే నెటిజన్లు కొన్ని విలువైన సూచనలు చేశారు..
- క్వాలిటీ ఫోటోలు: జోమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆహార పదార్థాల ఫోటోలు ఆకర్షణీయంగా ఉండాలని, క్యాలరీల వివరాలు జోడించాలని సూచించారు.
- పరిశుభ్రత ముఖ్యం: "ఒక్కసారి కస్టమర్‌కు ఆరోగ్యం పాడైనా, మళ్ళీ ఆ గ్రూప్ నుండి మీకు ఆర్డర్లు రావు. కాబట్టి ఫుడ్ హ్యాండ్లింగ్‌లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి" అని ఒక యూజర్ హెచ్చరించాడు.
- స్వయం ఉపాధి: "ఈ రోజుల్లో జీతం మీద ఆధారపడటం కంటే, సొంతంగా ఏదైనా చేసుకోవడం ఉత్తమం" అంటూ మరికొందరు అతనికి ధైర్యం చెప్పారు.
యువతకు ఒక పాఠం
బెంగళూరు వంటి ఖరీదైన నగరంలో, అదీ 23 ఏళ్ల వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం కాదు. బెంగళూరు (Bengaluru) లో పెరిగిపోతున్న జీవన వ్యయం , ఉద్యోగ అనిశ్చితి మధ్య, ఈ యువకుడి ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. సరైన ప్లానింగ్, నాణ్యమైన ఆహారం అందిస్తే ఈ క్లౌడ్ కిచెన్ భవిష్యత్తులో పెద్ద బ్రాండ్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చెప్పాలంటే, రిస్క్ తీసుకునే గుణం ఉంటేనే వ్యాపారంలో రాణించగలమని ఈ యువకుడు నిరూపిస్తున్నాడు. కార్పొరేట్ ఏసీ గదుల నుండి కిచెన్ లోని వేడి గదులకు మారడం అంత సులభం కాదు. కానీ, తన కల కోసం అతను పడుతున్న కష్టం చూస్తుంటే, బెంగళూరు స్టార్టప్ కల్చర్ మళ్ళీ కొత్త పుంతలు తొక్కుతోందని అనిపిస్తుంది. అతని ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుందాం.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: ట్రాఫిక్, అద్దెలు, తిండి.. బెంగళూరు కష్టాలకు చెక్ పెట్టే 30 డేస్ రోడ్‌మ్యాప్! వీడియో వైరల్!

Bengaluru: అద్దె ఎంత పెరిగినా అక్కడే ఉంటాం! ఫ్రెండ్స్ కోసం లక్షలు వదులుకుంటున్న బెంగళూరు కపుల్!

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో ఫుడ్ ధరలకు రెక్కలు! దోశ, ఇడ్లీ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications