బెంగుళూరులో ఇల్లును అద్దెకు తీసుకుంటున్నారా..అయితే ఈ సమస్యల గురించి ముందు తెలుసుకోండి

సిలికాన్ సిటీ.. బెంగళూరులో ఉద్యోగ అవకాశాలతో పాటుగా జీవనశైలి ఆకర్షణగా ఉండటంతో దేశం నలుమూలల నుండి వచ్చేవారికి బెంగుళూరులో అద్దె ఇంటి వెతకడం ఉత్సాహంగా ఉండొచ్చు కానీ అసలు విషయంలో మాత్రం కాస్త క్లిష్టతరంగా మారుతోంది. చాలా విషయాలు ముందుగా ఆలోచించుకుని బెంగుళూరులో ఇల్లు వెతకాలని రెడ్డిట్‌ వేదికగా చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు.బెంగళూరులో అద్దెకు ఇల్లు చూసే వారు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాటిలో ప్రధానంగా నీటి సరఫరా, రెంటల్ ఒప్పందంలోని నిబంధనలు, పెయింటింగ్ ఛార్జీలు,నోటీస్ పీరియడ్ తగ్గింపులు వంటి అంశాలపై రెంటుకు తీసుకునే వారు స్పష్టత తీసుకోవాలని సూచిస్తున్నారు. బెంగుళూరులో అద్దెకు ఉంటున్న చాలామంది ఇప్పటికే నీటి సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మునిసిపల్ వాటర్ సరఫరా ఉండదు.ప్రత్యేకించి ఎండాకాలంలో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఇక కొన్ని అపార్ట్‌మెంట్లలో అయితే మే నుండి జూలై వరకు రూ.4000-రూ. 5000 వరకు నీటి మెంటెనెన్స్ ఛార్జీలను అదనంగా వసూలు చేస్తారు.

Bengaluru rent issues hidden rental costs Bengaluru water problems in Bengaluru flats Bengaluru house rent warnings tenant complaints Bengaluru Bengaluru rental scams Bengaluru flat water issues apartment rent tips Bengaluru Bengaluru rent advice society guard tips rent Bengaluru Bangalore rental problems renting in Bengaluru

అందువల్ల, ఫ్లాట్ ఫైనల్ చేయకముందే అక్కడి సెక్యూరిటీ గార్డులతో లేదా ప్రస్తుతం నివసిస్తున్నవారితో ఆ అపార్ట్ మెంట్లో నీటి పరిస్థితిని తెలుసుకోవడం తప్పనిసరి అని పలువురు సూచిస్తున్నారు.ఆన్లైన్‌లో మాత్రమే ఫ్లాట్లు వెతకకండి, మీరు ఉండదలచిన ప్రాంతంలో నడుచుకుంటూ చూడండి అంటూ మరి కొందరు సలహాలు ఇస్తున్నారు. చాలా మంచి అద్దె ఇంట్లు ఏజెంట్లు/ఆప్స్‌లో ఉండవు - ఇంటి దగ్గరే To-Let బోర్డులు పెడతారని వారు చెబుతున్నారు.

మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. సెక్యూరిటీ డిపాజిట్.ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. కొందరు యజమానులు 5 నుంచి 10 నెలల అద్దె మొత్తాన్ని డిపాజిట్‌గా అడుగుతారు. కానీ రెంటర్లు సూచిస్తున్న విషయం ఏమిటంటే అంతకన్నా 30-40% తక్కువగా ఆఫర్ చేయండి. ఎక్కువగా యజమానులు ఒప్పుకుంటారని చెబుతున్నారు. 1BHK లేదా సింగిల్ గా ఉండే వారు రూం తీసుకుంటే అయితే రూ.20,000-రూ.30,000 డిపాజిట్ సరిపోతుంది అని సలహా ఇస్తున్నారు.

ఇక ఒప్పందంపై పూర్తిగా దృష్టి పెట్టాలని పలువురు చెబుతున్నారు. పాత రెంటర్లు ఎలా అనుభవించారో వారి ద్వారా సమాచారం తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, ఫ్లాట్‌లోకి వెళ్లే ముందు ఫోటోలు, వీడియోలు తీసి డాక్యుమెంట్ చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. తరవాత రిపేర్లు, మరమ్మతుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.

ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇల్లు ఎటువంటి చట్టపరమైన వివాదాల్లో లేదు అని నిర్థారించుకునేందుకు Resident Welfare Association నుండి NOC (No Objection Certificate) తీసుకోవడం కూడా చాలామంచిదని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+