బెంగళూరులో భారీగా తగ్గిన ఇంటి అద్దె ధరలు..ఇంకా తగ్గిస్తాం రమ్మంటున్న యజమానులు..

భారతదేశ సిలికాన్ సిటీ.. బెంగళూరులో ఎక్కువ మంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఉపాధి, విద్య, వ్యాపారం వంటి వివిధ ప్రయోజనాల కోసం బెంగుళూరు వచ్చి.. నగరంలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు బెంగళూరుకు వచ్చి స్థిరపడుతున్నారు. దీంతో బెంగుళూరులో అద్దె ఇళ్లకు పుల్లు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇంటి యజమానులు ఇళ్లను అద్దెకు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. రెంట్లు కూడా భారీగానే ఉండటంతో వీరికి లాభాల పంట పండింది.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. బెంగళూరులో అద్దె ధరలు తగ్గుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి.. ఇప్పుడు బెంగుళూరు నగరంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు నగరంలో అద్దె ధరలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అద్దె ధరల తగ్గుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే.. కరోనా మహమ్మారి తర్వాత వాయిదా పడిన నిర్మాణ ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు పూర్తి అయిపోతున్నాయి. 2020-2023 మధ్య వాయిదా పడిన చాలా అపార్ట్‌మెంట్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో నివాసానికి రెడీ అయ్యాయి.

Bengaluru rent trends 2025 Bengaluru housing market Bengaluru rent drop rental rates in Bengaluru Bengaluru apartments rent dip rent prices Whitefield HSR Layout rent trends Bengaluru real estate news Bengaluru netizens rent updates IT hub housing costs Bengaluru 2BHK rent Bengaluru property market 2025 2025 2BHK

దీంతో బెంగుళూరు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో అద్దె ఇళ్ల సరఫరా విపరీతంగా పెరిగింది. దీంతో పాటుగా మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలలో స్పష్టత లేకపోవడం, స్వల్ప జీత పెరుగుదల, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వంటి కారణాలతో చాలామంది ఉద్యోగులు తక్కువ రెంట్ ఉండే ఇంటి కోసం వెతుకున్నారు. ఎక్కువ మంది తక్కువ ఖర్చుతో ఉండే బిల్డర్ ఫ్లోర్ లలో లేదా ప్రక్క ప్రాంతాల్లో ఇళ్లను చూస్తున్నారు. దీంతో యజమానులు కూడా రెంట్ తగ్గించి ఇంటిని అద్దెకు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి నగరంలో..

వాస్తవానికి ఆన్‌లైన్‌లో చూపే అద్దె ధరలు కేవలం అంచనాలు మాత్రమే..చాలా తక్కువ ధరలకే ఇళ్లు అద్దెకు దొరుకుతున్నాయి. నగరంలో యజమానులు ఇప్పుడు మంచి టెనెంట్లు దొరకడం కోసం ధర తగ్గిస్తున్నారని Reddit యూజర్ ఒకరు చెబుతున్నారు. ఇక పనిలో పనిగా ఆదాయానికి తగ్గట్టు ఖర్చు తగ్గించుకునేందుకు కొందరు బెంగుళూరు నగరాన్ని వీడుతున్నారు. వేరే నగరాలకు వలస వెళుతున్నారు.

ఐటీ ఉద్యోగులలో చాలామంది పూణే, హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళుతున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ వల్ల రోజుకు 3 గంటలు వృథా అవుతున్నాయి. సమీపంలో ఉండాలంటే భారీ అద్దె చెల్లించాలి. ఇది ఫ్రెషర్స్‌కి చాలా ఇబ్బందకరంగా మారుతుందని ఓ టెకి సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోరమంగళ, వైట్‌ఫీల్డ్, హెచ్‌ఎస్ఆర్ లేఅవుట్ వంటి ప్రాంతాల్లో అద్దె ధరలు సుమారుగా 3 నుంచి 5 శాతం వరకు తగ్గినట్టు చెబుతున్నారు.ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు రూ. 40,000కి అద్దెకు వెళ్తున్న 2BHK అపార్ట్‌మెంట్లు ఇప్పుడు రూ. 30,000కి దొరకుతున్నాయి. ఇది అద్దె మార్కెట్ స్థిరంగా మారుతోందన్న సంకేతంగా కనిపిస్తోంది. పై విషయాలన్నీ బెంగళూరులో అద్దె హవా కొంత తగ్గుతోందన్న విషయం స్పష్టంగా చెబుతుందని పలువురు చెబుతున్నారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+