బెంగళూరు ఓనర్ల దోపిడి దారుణం.. 2BHKకు రూ. 70 వేల అద్దె.. రూ. 4 లక్షల డిపాజిట్..

Bengaluru Rental Market: దేశీయ ఐటీ రాజధాని బెంగళూరులో అద్దె ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతుండటం, ఇంటి యజమానులు విధించే అవాస్తవిక నిబంధనలు అద్దెదారులకు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. ఇటీవల ఒక ఐటీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అనుభవం నగరంలోని అద్దె మార్కెట్ పరిస్థితికి నిదర్శనంగా నిలిచింది.

తన ఆఫీసుకు నడిచి వెళ్లేంత సమీపంలో ఉన్న ఒక 2BHK ఫ్లాట్ కోసం, ప్రాథమిక వసతులైన ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, రెండో బెడ్‌రూమ్‌లో మంచం కూడా లేకపోయినా నెలకు రూ. 70,000 అద్దెతో పాటు రూ. 3 నుండి 4 లక్షల భారీ డిపాజిట్ చెల్లించాలని యజమాని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రతీ ఏటా 7-8 శాతం అద్దె పెంపునకు ఒప్పందం చేసుకోవాలని షరతు విధించారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన ఆ ఉద్యోగి.. బెంగళూరు క్రేజ్ పేరిట అడిగినంత చెల్లించడం సరికాదని.. తగిన విలువ లభించనప్పుడు ఆ ఇళ్లను తిరస్కరించడమే శ్రేయస్కరమని ఇతర అద్దెదారులకు హితవు చెప్పారు.

Bengaluru Rental Market Bengaluru Rent Bangalore Rent Bengaluru 2BHK Rent Bangalore 2BHK Rent 70 000 Rent 4 Lakh Deposit Bengaluru House Rent Bengaluru Rental News Bengaluru Property Bengaluru House Hunt Rental Market Bengaluru Tenant Experience Security Deposit Rent Hike Bengaluru Rent Crisis Bangalore Rental Market 2BHK 4 70

ఇలాంటి పరిస్థితుల్లో అవాస్తవిక అద్దెలకు లొంగిపోకుండా.. బేరమాడి లేదా కాస్త సరసమైన ప్రాంతాన్ని ఎంచుకుని నెలకు రూ. 15,000 పొదుపు చేయగలిగితే అది దీర్ఘకాలంలో భారీ సంపదగా మారుతుంది. సదరు పొదుపు మొత్తాన్ని ఊరికే వదిలేయకుండా 12 శాతం అంచనా వార్షిక రాబడి ఇచ్చే ఈక్విటీ ఫండ్లలో (SIP) పెట్టుబడి పెడితే పదేళ్ల కాలపరిమితిలో మీరు పొదుపు చేసే రూ. 18 లక్షల అసలు సొమ్ము, సమ్మేళన రాబడితో (Compound Growth) రూ. 34.85 లక్షల ఫండ్‌గా మారుతుంది.

ఇదే క్రమశిక్షణను 20 ఏళ్ల పాటు కొనసాగిస్తే.. మొత్తం రూ. 36 లక్షల పెట్టుబడికి గాను రూ. 1.13 కోట్ల రాబడితో మొత్తం కార్పస్ ఫండ్ రూ. 1.50 కోట్లకు చేరుకుంటుంది. కేవలం ఒక ఇంటి అద్దె విషయంలో సమయోచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో సాధారణ ఉద్యోగులు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందని కొన్ని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read

నెలకు రూ. 15,000 చొప్పున క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక (SIP) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో డిపాజిట్ చేస్తే, 12 శాతం అంచనా వార్షిక రాబడి ఆధారంగా దీర్ఘకాలంలో లభించే రాబడి గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రారంభంలో మొదటి మూడు సంవత్సరాల కాలంలో నెలకు రూ. 15,000 చొప్పున మొత్తం రూ. 5,40,000 డిపాజిట్ చేస్తే, 12 శాతం అంచనా రాబడితో రూ. 1,06,312 లాభం సమకూరి తుది విలువ రూ. 6,46,312 కి చేరుతుంది.

ఐదేళ్ల వ్యవధి చూస్తే, మొత్తం పెట్టుబడి రూ. 9,00,000 కాగా, అంచనా రాబడి రూ. 3,37,294 తో కలిపి మొత్తం కార్పస్ రూ. 12,37,294 గా మారుతుంది. పదేళ్ల కాలపరిమితి నాటికి మీరు జమ చేసే రూ. 18,00,000 కి గాను రాబడి రూ. 16,85,027 లభించి, సంపద విలువ రూ. 34,85,027 కి పెరుగుతుంది.

అయితే అసలైన కాంపౌండింగ్ ప్రభావం 10 సంవత్సరాల తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. 15 ఏళ్ల వ్యవధిలో డిపాజిట్ చేసిన రూ. 27,00,000 సొమ్ముపై ఏకంగా రూ. 48,08,829 రాబడి లభించడంతో మొత్తం కార్పస్ విలువ రూ. 75,08,829 మార్కును తాకుతుంది. ఇదే క్రమశిక్షణను 20 సంవత్సరాల పాటు నిలకడగా కొనసాగిస్తే, మీరు డిపాజిట్ చేసే మొత్తం సొమ్ము రూ. 36,00,000 కాగా, దానికి లభించే అంచనా రాబడి ఏకంగా రూ. 1,13,87,305 గా నమోదవుతుంది.

దీనివల్ల తుది కార్పస్ విలువ రూ. 1,49,87,305 కి చేరి సాధారణ ఉద్యోగులను కూడా కోటీశ్వరులుగా మారుస్తుంది. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణతో కూడిన చిన్న పొదుపు కూడా దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించగలదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రతి నెలా కష్టపడి సంపాదించే ఆదాయంలో నుండి కొంత మొత్తాన్ని వేరు చేసి, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం వల్ల కాంపౌండింగ్ (సమ్మేళన రాబడి) లబ్ధి చేకూరుతుంది. నెలకు రూ. 15,000 చొప్పున క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక (SIP) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో డిపాజిట్ చేస్తే, 12 శాతం అంచనా వార్షిక రాబడి ఆధారంగా దీర్ఘకాలంలో లభించే రాబడి గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. ఆఫీసుకు దూరంగా ఉంటే బెంగళూరు ట్రాఫిక్, రోడ్ల పరిస్థితి వల్ల సమయం, ప్రశాంతత దెబ్బతింటున్నాయని, అందుకే వేరే మార్గం లేక అద్దెదారులు యజమానులు అడిగినంత చెల్లిస్తున్నారని కొందరు పేర్కొన్నారు. బేరసారాలు ఆడకుండా అడిగినంత చెల్లించే ధోరణి వల్లే యజమానులు ధరలు పెంచుతున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ వంటి నగరాల్లో ఇళ్ల సరఫరా ఎక్కువగా ఉండటం, ప్రజలు స్వతంత్ర అపార్ట్‌మెంట్లను ఎంచుకోవడం వల్ల మార్కెట్ సమతుల్యంగా ఉందనే ఉదాహరణలను నెటిజన్లు ప్రస్తావించారు. ఐటీ జీతాలు నిరంతరం పెరగవని గుర్తించి, అదనపు వ్యయాన్ని నియంత్రించుకుని పెట్టుబడుల వైపు మళ్లడమే అద్దెదారులకు సుదీర్ఘకాలంలో నిజమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+