భారతదేశ టెక్ రాజధానిగా పేరుగాంచిన సిలికాన్ సిటీ బెంగళూరు ఇప్పుడు గృహ అద్దె మార్కెట్‌లో పలు రకాల మార్పులను చూస్తోంది. నగరంలోని వైట్‌ఫీల్డ్, మారతహళ్లి, సర్జాపూర్ రోడ్ వంటి ఐటీ కారిడార్‌లలో ఇళ్లకు అద్దె డిమాండ్ తగ్గుతోందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాల తగ్గుదల, ఖర్చు తగ్గింపు చర్యలు కావడమని చెప్పుకోవచ్చు.
ఇటీవల రెడ్డిట్‌లో ఒక వినియోగదారు పోస్ట్ చేసిన అంశం నెటిజన్ల నుంచి చర్చకు దారి తీసింది. గతంలో రూ. 40 వేల లోపు ఉండే 2BHK అపార్ట్‌మెంట్‌లకు ఇప్పుడు ఎక్కువ లిస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. ఇది ఏమైనా డిమాండ్ తగ్గుదలకు సంకేతమా అంటూ అని ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల సంఖ్య తగ్గడం, జీతాల్లో పెరుగుదల లేకపోవడం లాంటి అంశాలు ఈ మార్పుకు కారణమవుతున్నాయని బెంగుళూరు గృహ యజమానులు చెబుతున్నారు.

2024-25లో ఇంటెల్, మైక్రోసాఫ్ట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి దిగ్గజాలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. గత వారంలో టీసీఎస్ 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఆటోమేషన్, ఎఐ పెరుగుదలతో సాంప్రదాయ టెక్ ఉద్యోగాల డిమాండ్ మందగించింది. దీనివల్ల ఐటీ ఉద్యోగుల్లో భవిష్యత్ భద్రతపై అనిశ్చితి పెరిగింది.
రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఈ కొత్త ట్రెండ్‌ను అంగీకరిస్తున్నారు.గత సంవత్సరం నుంచి వైట్‌ఫీల్డ్ పరిసరాల్లో అద్దె కోసం వచ్చే కాల్స్ 15-20 శాతం తగ్గాయని హను రెడ్డి రియాలిటీ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ చెబుతున్నారు. టెక్ ఉద్యోగులు ఇప్పుడు కేంద్ర ప్రాంతాల కన్నా బయట పక్కా లొకేషన్లలో చవక ధరల కోసం చూస్తున్నారని తెలిపారు.ఇక ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గతంలో టెక్ ఉద్యోగులకు అద్దెకు ఇళ్లను కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడు వేచి చూడటానికి మొగ్గుచూపుతున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా రీసెర్చ్ హెడ్ వివేక్ రతి అన్నారు. ప్రస్తుత మార్కెట్‌లో భద్రత, స్థిరతలపై సందేహాలు ఉండటంతో, పెట్టుబడిదారులు గట్టి నిర్ణయం తీసుకునేందుకు ముందు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.
ఇక మహమ్మారి అనంతర కాలంలో 2023 నాటికి కొరమంగళ, బెల్లందూర్, సర్జాపూర్ వంటి ప్రాంతాల్లో అద్దెలు సంవత్సరానికి 30-35 శాతం పెరిగాయి. ఈ ప్రాంతాల్లో అద్దె మార్కెట్ వేగంగా పెరిగింది. కానీ ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. వైట్‌ఫీల్డ్, HSR లేఅవుట్ లాంటి ప్రాంతాల్లో అద్దె ధరలు 3-5 శాతం తగ్గాయని బ్రోకర్ఇన్‌బ్లూ సీఈఓ మంజేష్ రావు తెలిపారు.
అయినప్పటికీ, ఇంటి యజమానులు పెద్దగా తగ్గింపు చేయడం లేదు. ఎక్కువగా 5-10 శాతం తగ్గింపు ఉంటుంది. దీనికి మించి వారు హోల్డ్ చేయడం ఇష్టపడతారని రెడ్డిట్ వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ క్రాష్ కాలేదు కానీ వేడి తగ్గిపోయిందంటూ ఓ నెటిజన్ తెలిపారు. క్లుప్తంగా చెప్పాలంటే..ఐటీ రంగంలోని మందగమనం పరిస్థితులు బెంగళూరులో అద్దె గృహాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ఇది పూర్తిగా పతనమా, లేక తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనా అన్నది ముందు ముందు చూడాలి.
More From GoodReturns

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications