భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) నగరం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలకే కాదు, ఆకాశాన్ని తాకుతున్న అద్దెలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక యువతి చేసిన పోస్ట్ బెంగళూరులో పెరుగుతున్న నివాస ఖర్చుల మీద పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఐటీ నిపుణులు, స్టార్టప్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే 'కోరమంగళ' ప్రాంతంలో అద్దెలు చూస్తుంటే సామాన్యులకు చెమటలు పడుతున్నాయి.

అసలు విషయం ఏమిటి?
లుబ్నా మల్హోత్రా అనే మార్కెటింగ్ ప్రొఫెషనల్.. కోరమంగళలోని ఒక 2BHK ఫ్లాట్ కోసం నెలకు రూ. 70,000 అడుగుతున్నారని తెలిసి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. "కోరమంగళ.. కొంచెం సిగ్గు తెచ్చుకోండి! ట్రాఫిక్ జామ్ లు, తెరిచి ఉన్న మురుగు కాలువలు, అధ్వాన్నమైన రోడ్లు.. ఇలాంటి సౌకర్యాలకా మేము అంత ప్రీమియం అద్దె కట్టేది?" అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఒక్క పోస్ట్‌ను ఇప్పటికే 70 వేల మందికి పైగా వీక్షించడం బెంగళూరులో ఉన్న అద్దె సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
సమస్య మౌలిక సదుపాయాలదే..
కోరమంగళ అనేది బెంగళూరులో చాలా పాపులర్ ఏరియా. ఇక్కడ మంచి రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు దగ్గరగా ఉంటాయి. అందుకే చాలామంది ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న డిమాండ్ ను సాకుగా చూపి ఇంటి యజమానులు అడ్డగోలుగా అద్దెలు పెంచేస్తున్నారని అద్దెదారులు ఆరోపిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా.. అందులో సగానికి పైగా అద్దెలు, టాక్సులకే పోతున్నాయని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. 70 వేలు అద్దె కట్టే ప్రాంతంలో కనీసం నడవడానికి మంచి రోడ్లు కూడా లేకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్ల మధ్య యుద్ధం
ఈ పోస్ట్ కింద కామెంట్లు చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒక నెటిజన్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. "మేము కట్టే అద్దెలతో ఓనర్లు లగ్జరీ వాచీలు కొనుక్కుంటున్నారు. మాకేమో ఇక్కడ లేఆఫ్స్ భయం పట్టుకుంది" అని రాశారు. మరొకరు స్పందిస్తూ.. కేవలం కేఫ్‌లకు దగ్గరగా ఉండటం కోసం పగిలిన రోడ్ల మధ్య అంత అద్దె కట్టడం వృధా అని అభిప్రాయపడ్డారు. అయితే కొంతమంది ఇంటి యజమానులు మాత్రం మార్కెట్ రేటు ప్రకారమే అద్దెలు వసూలు చేస్తున్నామని సమర్థించుకుంటున్నారు.
పెరుగుతున్న డిమాండ్ - తక్కువ సప్లై
కొన్నేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తగ్గి.. ఆఫీసులు మళ్ళీ ప్రారంభం కావడంతో బెంగళూరు (Bengaluru) లో ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రైమ్ ఏరియాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లు తక్కువగా ఉండటం వల్ల ఓనర్లు తమ ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తున్నారు. కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ చూసి వేలకు వేలు అద్దెలు పోయడం కంటే సౌకర్యవంతమైన ప్రాంతాలను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications