Bengaluru: బెంగళూరులో రెంట్ పెంచడానికి యజమాని ఆడిన ఈ అబద్ధం చూస్తే షాకవుతారు!

ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) లో జాబ్ సంపాదించడం ఒకెత్తయితే.. అక్కడ ఉండటానికి ఒక మంచి ఇల్లు వెతుక్కోవడం, ఆ హౌస్ ఓనర్ల డిమాండ్లను తట్టుకోవడం మరో ఎత్తు. బెంగళూరులో అద్దెలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యులు, ఐటీ ఉద్యోగులు బలైపోతున్నారు. తాజాగా ఒక ల్యాండ్‌లార్డ్ (ఇంటి యజమాని) అద్దె పెంచడానికి ఆడిన అబద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దిశాక అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో "రియాలిటీస్ ఆఫ్ లివింగ్ ఇన్ బెంగళూరు" అనే పేరుతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.

Bengaluru Rent Hike Landlord Randomly Increases Rent Viral Video Tenant Frustration News

రెంట్ పెంచడానికి క్రేజీ అబద్ధం.. ఓనర్ ప్లాన్ ఇదీ!

ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఉంటున్న ఫ్లాట్ ఓనర్ హఠాత్తుగా వచ్చి, "మా తమ్ముడు బెంగళూరుకు షిఫ్ట్ అవుతున్నాడు.. అతనికి ఈ ఇల్లు కావాలి, కాబట్టి నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి" అని చెప్పాడు. తీరా కట్ చేస్తే.. అసలు విషయం అది కాదు. కేవలం అద్దె పెంచడానికే ఓనర్ ఈ డ్రామా ఆడాడని తర్వాత తెలిసింది. చివరికి ఆమెను అక్కడే ఉండనివ్వడానికి నెలకు ఏకంగా రూ. 4,000 రెంట్ పెంచేశాడు.

"ఆ బిల్డింగ్ మొత్తం ఆ ఓనర్‌దే. అన్ని ఫ్లాట్లు ఆయనవే అయినప్పుడు కేవలం నన్నే ఎందుకు ఖాళీ చేయమంటున్నాడో నాకు అప్పుడే అర్థం కాలేదు. బెంగళూరులో ల్యాండ్‌లార్డ్స్ కేవలం డబ్బు పిచ్చితో ఇలా ప్రవర్తిస్తారని తెలుసు కానీ.. ఇలా అబద్ధాలు చెప్పి మరీ రెంట్ పెంచడం నిజంగా క్రేజీ" అంటూ దిశాక తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె ప్రతి నెలా రూ. 4,000 అదనంగా చెల్లిస్తోంది.

సోషల్ మీడియాలో క్యూ కట్టిన బాధితులు..

ఈ వీడియో వైరల్ కావడంతో బెంగళూరులో అద్దెకు ఉంటున్న మిగతా నెటిజన్లు కూడా కామెంట్ల రూపంలో తమ ఫ్రస్ట్రేషన్‌ను బయటపెడుతున్నారు.

  • "ఇది బెంగళూరులో చాలా కామన్. మా ఓనర్ కూడా ఇల్లు అమ్మేస్తున్నామని అబద్ధం చెప్పి, రోజుకో కొత్త వ్యక్తిని ఫ్లాట్ చూపించడానికి తీసుకురావడం స్టార్ట్ చేశాడు.. చివరకు రెంట్ పెంచాకే ఊరుకున్నాడు" అని ఒకరు రాశారు.
  • "నాకు కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు నేను ప్రతి నెలా రూ. 2,000 ఎక్స్‌ట్రా కడుతున్నాను" అని ఇంకొకరు కామెంట్ చేశారు.
  • "కోవిడ్ తర్వాత బెంగళూరు ఓనర్లు అడ్డగోలుగా రేట్లు పెంచేస్తున్నారు. మనం ఒప్పుకోకపోతే ఒక నెల నోటీస్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు" అంటూ నెటిజన్లు తమ బాధలను పంచుకున్నారు.

అమెరికాలో రూల్స్ ఉన్నాయి.. ఇండియాలో లేవా?

కేవలం దిశాక మాత్రమే కాదు.. గత వారం డానా మేరీ అనే ఒక అమెరికన్ మహిళ కూడా బెంగళూరు రెంట్స్ పై ఇన్‌స్టాగ్రామ్‌లో పెదవి విరిచింది. ఆమె ఉంటున్న ఇంటి ఓనర్ రెంట్‌ను ఏకంగా 33 శాతం పెంచాలని డిమాండ్ చేశాడట. దీనిపై ఆమె స్పందిస్తూ.. "ఇలాంటివి అమెరికాలో అసలు లీగల్ కాదు. అక్కడ ఏడాదికి గరిష్టంగా 10 శాతం మాత్రమే రెంట్ పెంచాలనే క్యాప్ (నిబంధన) ఉంది. ప్రజలు కూడా ఆ చట్టాన్ని గౌరవిస్తారు. కానీ బెంగళూరు (Bengaluru) లో ఇలా ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచడం, ప్రయాణికులు దాన్ని ఒక సాధారణ విషయంగా అలవాటు చేసుకోవడం దారుణం" అని పేర్కొంది. ఈ అద్దెల మంట ఐటీ కారిడార్‌లో సామాన్యుడి బతుకును ఎంత భారంగా మారుస్తుందో ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+