Bengaluru: బెంగళూరు రియల్ ఎస్టేట్ దూకుడు! మెట్రో పుణ్యమా అని ఆ ఏరియాల్లో 40% పెరగనున్న ధరలు!

బెంగళూరు అంటే ముందుగా ట్రాఫిక్ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది! బెంగళూరు (Bengaluru) అంటే మెట్రో సర్వీస్ కు కేరాఫ్ అనేగా సిటీ డెవలప్ అవుతుంది. మన సిలికాన్ వ్యాలీలో మెట్రో నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తుండటంతో, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యంగా కొత్తగా వస్తున్న యెల్లో లైన్, పింక్ లైన్ మెట్రోల వల్ల కొన్ని ఏరియాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయని ప్రముఖ సంస్థ 'కొలియర్స్ ఇండియా' తాజా నివేదిక వెల్లడించింది. వచ్చే రెండేళ్లలో ప్రాపర్టీ రేట్లు ఏకంగా 20% నుండి 40% వరకు పెరిగే అవకాశం ఉందట!

Bengaluru Real Estate Yellow Pink metro areas To Hike Property Prices In JP Nagar And Bannerghatta

ఏ ఏరియాల్లో డిమాండ్ పెరుగుతోంది?

ముఖ్యంగా సౌత్ బెంగళూరులో మెట్రో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో అందుబాటులోకి వచ్చిన యెల్లో లైన్ (ఆర్వీ రోడ్ - బొమ్మసంద్ర) ఎలక్ట్రానిక్ సిటీ వంటి ఐటీ హబ్‌లకు కనెక్టివిటీని పెంచింది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు అందరి కళ్లు పింక్ లైన్ (కాలేన అగ్రహార - నాగవార) మీద ఉన్నాయి.

ధరల పెరుగుదల అంచనాలు ఇలా ఉన్నాయి..

  • బన్నెరఘట్ట రోడ్డు: ఇక్కడ పింక్ లైన్ ప్రభావం వల్ల వచ్చే రెండేళ్లలో ధరలు 30% నుండి 40% వరకు పెరగొచ్చని అంచనా.
  • జేపీ నగర్: ఇక్కడ కూడా మెట్రో రాకతో 20% నుండి 30% వరకు ప్రాపర్టీ విలువ పెరగనుంది.
  • ఎలక్ట్రానిక్ సిటీ: ఇప్పటికే 45% పెరుగుదల చూసిన ఈ ఏరియాలో, మరో 20-30% పెరిగే ఛాన్స్ ఉంది.
  • బీటీఎమ్ లేఅవుట్ & జయనగర్: ఈ ప్రాంతాల్లో కూడా 10% నుండి 20% వరకు పెరుగుదల కనిపిస్తుంది.

ఎందుకు ఈ పెరుగుదల?

సాధారణంగా ఎక్కడైనా రవాణా సౌకర్యం పెరిగితే అక్కడ డిమాండ్ పెరుగుతుంది. పింక్ లైన్ అందుబాటులోకి వస్తే బన్నెరఘట్ట రోడ్డు, జేపీ నగర్, శివాజీ నగర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం చాలా ఈజీ అయిపోతుంది. ప్రయాణ సమయం తగ్గడం వల్ల ఐటీ ఉద్యోగులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఈ ఏరియాల్లో ఇళ్లు కొనడానికి లేదా అద్దెకు ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల లగ్జరీ అపార్ట్‌మెంట్లతో పాటు మిడిల్-ఇన్కమ్ ఇళ్లకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

డెవలపర్ల ప్లాన్ ఏంటి?

ఈ డిమాండ్‌ను గమనించిన పెద్ద పెద్ద బిల్డర్లు పింక్ లైన్ పరిసర ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులను వేగంగా లాంచ్ చేస్తున్నారు. ఆఫీస్ స్పేస్‌లు, రిటైల్ షాపులు, హోటళ్లు కూడా ఇక్కడ భారీగా రాబోతున్నాయి. మొత్తానికి, బెంగళూరు (Bengaluru) లో ఇల్లు కొనాలనే ఆలోచన ఉంటే మాత్రం ఆలస్యం చేయకపోవడమే మంచిదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే మెట్రో రైలు పట్టాలెక్కే కొద్దీ, ఇళ్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లేలా ఉన్నాయి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+