దేశ ఐటీ రాజధాని బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒక రూమ్, వంటగది అంటే 1RK ఫ్లాట్‌లకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే దీనిని చాలా ఇష్టపడుతున్నారు. ఇందుకు కారణం పెరుగుతున్న అద్దె ఖర్చులు. ఆఫీస్ వెళ్లేందుకు ట్రాఫిక్ నుండి బయటపడడానికి చాలా మంది వీక్ డేస్ అంటే (monday-friday) ఉండటానికి ఈ ఫ్లాట్‌ను ఉపయోగించుకుంటున్నారు.

విద్యార్థులకి మాత్రమే కాదు ఉద్యోగులకు కూడా: బెంగళూరులో 1RK అంటే ఒక గది, వంటగది ఉన్న అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. హిందూస్తాన్ టైమ్స్ వార్త ప్రకారం, ఇవి విద్యార్థులలోనే కాకుండా ఉద్యోగుల్లో కూడా డిమాండ్ పొందుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో అద్దె పెరుగుదల, ప్రజల లైఫ్ స్టయిల్ మారడం, పెద్ద ఇళ్ల ధరలు పెరగడం వంటివి. ఐటీ హబ్‌లు ఇంకా మెట్రో లేదా బస్సు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.
హను రెడ్డి రియాల్టీ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, "సుమారు ఐదు సంవత్సరాల క్రితం బెంగళూరులో 1RK ఫ్లాట్లు అంతగా సాధారణం కాదు. కానీ ఇప్పుడు సిటీ సెంటర్ వంటి ప్రాంతాలలో అద్దెలు పెరిగాయి. కాబట్టి, చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు 1RK అపార్ట్‌మెంట్‌లనే ఇష్టపడుతున్నారు. ఇవి 2BHK, 3BHK కంటే తక్కువ అద్దె ఉండటమే కాకుండా, మైంటెన్సెన్స్ కూడా ఫ్రీ" అని అన్నారు.
ఫ్లాట్లు ఎంత పెద్దవి అంటే : బెంగళూరులో స్టూడియో అపార్ట్‌మెంట్లు సాధారణంగా 250 నుండి 450 చదరపు అడుగుల వరకు ఉంటాయి. నగర శివార్లలో ముఖ్యంగా ఐటీ హబ్‌ల సమీపంలో నిర్మిస్తున్న కొత్త ఫ్లాట్ ధర 50-60 లక్షల మధ్య ఉంటుందని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు. ఈ కొత్త ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీలలో భాగం. సెక్యూరిటీ, మెయింటెనెన్స్, క్లబ్‌హౌస్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. బెంగళూరులో అపార్ట్‌మెంట్ అద్దె చాలా ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. అందుకే 1RK ఫ్లాట్‌లను ఇష్టపడుతున్నారు. ఇవి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో తక్కువకే ఉన్నాయి. ఈ చిన్న అపార్ట్‌మెంట్‌లు కొన్ని ప్రాంతాలలో నెలకు దాదాపు రూ.22,000కు ఉన్నాయి. కాబట్టి తక్కువ బడ్జెట్‌తో జీవించాలనుకునే వారికి బెస్ట్ అప్షన్.
కాన్సెప్ట్ కొత్తది: 1RK అపార్ట్‌మెంట్ల కల్చర్ బెంగళూరులో ఇప్పటికీ కొత్తదేనని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. అందువల్ల, వాటి సంఖ్య తక్కువ. ఈ కారణంగా డిమాండ్ పెరుగుతోంది, ధరలు కూడా పెరుగుతున్నాయి. బెంగళూరులోని హై-ఎండ్ 1RK ఫ్లాట్స్ ఎక్కువగా IT హబ్‌లకు సమీపంలో ఉన్నాయి. పూర్తిగా ఫర్నిష్ చేసిన అపార్ట్‌మెంట్‌ల అద్దె సాధారణంగా నెలకు రూ.25,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications