కర్ణాటక రాజధాని, భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) రియల్ ఎస్టేట్ మార్కెట్.. ఇప్పుడు ఊహించని సంక్షోభంలో పడింది. శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో బెంగళూరులో భారీ ప్రాజెక్టులు ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తెస్తున్న మార్పులు, భవిష్యత్తులో ఇళ్ల కొనుగోలుపై, ఆఫీస్ స్పేస్ డిమాండ్ పై ప్రభావం చూపుతాయన్న భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది.

పతనమైన ప్రముఖ కంపెనీల షేర్లు
బెంగళూరు నగరంలో ప్రధానంగా కార్యకలాపాలు సాగించే రియల్టీ దిగ్గజాల షేర్లు 4% వరకు నష్టపోయాయి.. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ (Prestige Estates) షేర్లు భారీగా పతనమయ్యాయి. బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ (Brigade Enterprises) కంపెనీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. అలాగే ఒబెరాయ్ రియాల్టీ (Oberoi Realty) కంపెనీ... సెక్టార్ ఇండెక్స్ తో పాటు కిందికి జారింది. మొత్తంగా రియల్టీ సెక్టార్ ఇండెక్స్ 2% కంటే ఎక్కువ నష్టపోవడం గమనార్హం.
ఐటీకి, రియల్ ఎస్టేట్‌కు ఉన్న సంబంధం ఏంటి?
బెంగళూరు (Bengaluru) రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధానంగా ఐటీ ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటుంది. ఐటీ కంపెనీలు ఇచ్చే భారీ జీతాలు, కొత్త నియామకాలే ఇక్కడ ఇళ్లు , ఆఫీసుల డిమాండ్‌ను పెంచుతాయి. అయితే ప్రస్తుతం 'అంత్రోపిక్' వంటి ఏఐ సంస్థలు తమ టెక్నాలజీ ద్వారా లీగల్ పనులు, కోడింగ్, అనలిటిక్స్ ను ఆటోమేట్ చేస్తున్నాయి. దీనివల్ల ఐటీ కంపెనీల్లో సిబ్బంది తగ్గే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
'SaaSpocalypse' భయాలు
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ (Jefferies) ఈ పరిస్థితిని 'SaaSpocalypse' అని అభివర్ణించింది. అంటే సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (SaaS) కంపెనీలకు ఏఐ వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. "గతంలో ఏఐ ఈ కంపెనీలకు సహాయం చేస్తుందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏఐ ఈ కంపెనీలనే రీప్లేస్ చేస్తుందేమో అన్న భయం మొదలైంది" అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రియల్టీ రంగానికి ఎదురవుతున్న సవాళ్లు..
- ఆఫీస్ స్పేస్ డిమాండ్: వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ మోడల్స్ ఇప్పటికే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ను దెబ్బతీయగా.. ఇప్పుడు ఏఐ వల్ల ఆఫీసుల అవసరం మరింత తగ్గుతుందేమో అన్న ఆందోళన నెలకొంది.
- రెసిడెన్షియల్ సేల్స్: ఐటీ ఉద్యోగులు ముఖ్యంగా మిడ్-టు-ప్రీమియం (రూ. 1 కోటి పైబడిన) ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఒకవేళ ఉద్యోగాల కోత లేదా జీతాల పెంపు తక్కువగా ఉంటే.. ఈ సెగ్మెంట్ లో అమ్మకాలు మందగించే ప్రమాదం ఉంది.
- వడ్డీ రేట్లు: ఇప్పటికే పెరిగిన గృహ రుణ వడ్డీ రేట్లు కొనుగోలుదారులపై భారాన్ని పెంచాయి.
ప్రస్తుతానికి ఈ అమ్మకాల సునామీ ఒక రకమైన భయాందోళన (Panic) వల్ల జరుగుతోందని కొందరు నిపుణులు చెబుతున్నప్పటికీ.. బెంగళూరు (Bengaluru) మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీలో వస్తున్న ఈ పెను మార్పులు రియల్ ఎస్టేట్ రంగ రూపురేఖలను ఎలా మార్చబోతున్నాయో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. ఇన్వెస్టర్లు ఇప్పుడు రియల్టీ షేర్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటమే మంచిదని విశ్లేషకుల అభిప్రాయం.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications