భారత రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కీలక దశలో ఉంది. వివిధ స్థూల ఆర్థిక సవాళ్లు, వడ్డీ రేట్లలో మార్పులు, ప్రపంచ ఐటీ పరిశ్రమలో అనిశ్చితులు ఉన్నప్పటికీ, బెంగళూరు రియల్ ఎస్టేట్ మాత్రం ఊహించిన దాని కన్నా ఎక్కువగానే ముందుకు సాగుతోంది. యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. వడ్డీ రేట్ల తగ్గుదల, తక్కువ ద్రవ్యోల్బణం, ఆదాయపు పన్ను మినహాయింపులు, అలాగే అనుకూల వర్షాకాలం వంటి అంశాలు రియాలిటీ రంగానికి ఊతమిచ్చాయి.
బెంగళూరు, పూణే, హైదరాబాద్ మార్కెట్లు మంచి వృద్దిని నమోదు చేస్తున్నాయి. ఉత్తర బెంగళూరు, హైదరాబాద్‌లోని కొన్ని మైక్రో-మార్కెట్లు, అలాగే పూణే లోని నిర్దిష్ట ప్రాంతాల్లో ప్రత్యేక ధరల పరిధిలో గల ఆస్తులకు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ఇది సరసమైన గృహ ఎంపికలపై పెరుగుతున్న ఆసక్తిగా మనం చూడవచ్చు. మరో వైపు.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో మాత్రం వినియోగదారులు నిర్ణయాలను వాయిదా వేస్తుండటంతో వృద్ది మందగించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో కూడా మిశ్రమ పరిస్థితి కనిపిస్తోంది. గురుగ్రామ్‌లో తక్కువ వృద్ది కారణంగా ధరలపై ఒత్తిడి పెరుగుతుండగా, నోయిడా మాత్రం ఆరోగ్యకరమైన పరిస్థితిని కొనసాగిస్తోంది.

ఈ పరిణామాల మధ్య.. యాంటిక్ బ్రోకింగ్ రెండు అగ్రశ్రేణి కంపెనీలను తమ టాప్ స్టాక్ పిక్స్‌గా పేర్కొంది. అవి శోభా లిమిటెడ్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్. ఈ రెండు సంస్థలు రియాల్టీ మార్కెట్లలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండటమే కాకుండా.. స్థిరమైన డిమాండ్ కారణంగా భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శోభా, తన ప్రీమియం ప్రాజెక్టుల ద్వారా విశ్వసనీయతను నిలబెట్టుకోగా, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ కొత్త లాంచ్‌లతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే real estate ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా తక్కువేమీ కావు. లాంచ్‌లు ఆలస్యమవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. యాంటిక్ అంచనా ప్రకారం.. ఎక్కువ ప్రాజెక్టులు FY26 రెండవ వార్థంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ సస్టైనెన్స్ సేల్స్‌పైనే ఆధారపడి ఉంది. ఇక పోటీ విషయానికి వస్తే.. MMR, గురుగ్రామ్‌లలో పునరాభివృద్ధి ప్రాజెక్టులు కంపెనీల మధ్య పోటీని పెంచుతున్నాయి. ప్రాజెక్టులను పొందడానికి చెల్లించే అధిక విలువలు లాభాల మార్జిన్‌లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయినప్పటికీ బలమైన ఆర్థిక స్థితి, స్థిరమైన బ్రాండ్ విలువ కలిగిన డెవలపర్లకు ఈ పరిస్థితి ఒక అవకాశంగా మారుతోంది.
మొత్తంగా చూసుకుంటే.. బెంగళూరు మార్కెట్ తన సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థ, ఐటీ ఉద్యోగుల డిమాండ్, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతుల కారణంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది. గురుగ్రామ్, MMR వంటి మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, నోయిడా, పూణే, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు పెట్టుబడిదారులకు మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారుల కోసం రాబోయే రెండు సంవత్సరాలు కీలకంగా మారున్నాయి. ఏదేమైనా రియాల్టీ రంగం భవిష్యత్తు పూర్తిగా కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లపై, ప్రభుత్వ విధాన మద్దతుపై, గృహ రుణ వడ్డీ రేట్ల స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!



Click it and Unblock the Notifications