Bengaluru Real Estate News : భారత టెక్ రాజధాని, సిలికాన్ వ్యాలీ బెంగళూరులో రియల్ ఎస్టేట్ బూమ్ ఎప్పుడూ డిమాండ్ గానే ఉంటుంది. నగరంలో చాలా చోట్ల రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా ఉంది. పలు ప్రాంతాల్లో రియాల్టీ పడిపోగా మరికొన్ని ప్రాంతాల్లో రియల్ బూమ్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. బెంగళూరు నగరంలోని సర్జాపూర్ రోడ్, తనిసంద్ర మెయిన్ రోడ్‌లలో గత మూడు సంవత్సరాలలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశం కావడంతో పాటుగా ఇది మాన్యత టెక్ పార్క్, విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ భూములు ధరలకు రెక్కలు వచ్చాయి.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనారాక్ అందించిన డేటా ప్రకారం.. ఈ ప్రాంతాల్లో సగటు ఇళ్ల ధరలు దాదాపు 80 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ నెలలో సర్జాపూర్ రోడ్‌లో సగటు ఇంటి ధర చదరపు అడుగుకు రూ. 10,800కి పెరిగింది. 2021 చివరి నాటికి, ఈ ధర చదరపు అడుగుకు రూ. 6,050గా ఉంది.ఇక బెంగళూరు తూర్పు ఐటీ కారిడార్‌లో సర్జాపూర్ రోడ్డు కీలక భాగంగా ఉంది. హెబ్బాల్‌ను సర్జాపూర్‌ను కలిపే రెడ్ లైన్ మెట్రో ప్రాజెక్టు ఇక్కడ భూములపై కొత్త ఆసక్తిని రేకెత్తించింది. తనిసంద్రలో ఆస్తి పెట్టుబడులకు మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఉద్యోగస్తులకు అనుకూలంగా మారుతోంది.

అదేవిధంగా, మాన్యత టెక్ పార్క్ సమీపంలోని తనిసంద్ర మెయిన్ రోడ్డు మధ్యతరగతి, ఉన్నత ఆదాయ ఐటీ నిపుణులకు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ రెండు ప్రధాన రోడ్లపై అద్దె విలువలు దాదాపు 81 శాతం పెరిగాయి. తనిసంద్ర బెంగళూరు నగరంలో ఉత్తర భాగంలో ఉంది. ఇది హెబ్బాల్, నాగవార, యలహంక వంటి ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి రియాల్టీ బిల్డర్లు ఇక్కడ ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అనరాక్ నివేదిక ప్రకారం.. ఏడు ప్రధాన నగరాల్లోని 14 సూక్ష్మ మార్కెట్లలో.. 2021 చివరి నుండి 2025 రెండవ త్రైమాసికం మధ్య మూలధన విలువలు 24-139 శాతం. అద్దె విలువలు 32-81 శాతం పెరిగాయి. ఈ ఏడు నగరాలు బెంగళూరు, హైదరాబాద్, పూణే, NCR, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైగా ఉన్నాయి. సర్జాపూర్, తనిసంద్ర కారిడార్లు ప్రీమియం గమ్యస్థానాలుగా ఆవిర్భవించాయని సత్వ గ్రూప్ చైర్‌పర్సన్ కరిష్మా సింగ్ అన్నారు. ORR-విమానాశ్రయం మెట్రో కనెక్టివిటీ, సర్జాపూర్-హెబ్బాల్ కారిడార్ మరియు ఔటర్ రింగ్ రోడ్ ఐటీ బెల్ట్‌కు సమీపంలో ఉండటం వల్ల విలువ పెరిగింది.
ఇక స్టెర్లింగ్ డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ అంజనా శాస్త్రి మాట్లాడుతూ.. హెబ్బాల్, తనిసంద్ర ప్రాంతాల్లో వేగంగా డిమాండ్ పెరుగుతోంది. ఉత్తర బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగంలో కనెక్టివిటీ ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. సర్జాపూర్, తనిసంద్ర వంటి ప్రాంతాలలో గ్రేడ్ A కార్యాలయ స్థలాల వేగవంతమైన అభివృద్ధి జరుగుతోంది. ఇది మూలధనం, అద్దె విలువలలో నిరంతర వృద్ధికి దారితీసిందని BCD గ్రూప్ CMD అంగద్ బేడి చెబుతున్నారు. ఇక సర్జాపూర్ స్టార్టప్‌లకు ప్రధాన ప్రదేశం కాగా తనిసంద్ర బహుళజాతి కంపెనీలకు ప్రధాన ప్రదేశంగా ఉంది. అందువల్ల, ఇది రిటైల్ పెట్టుబడిదారులకు అనువైన ప్రదేశం అని ప్రాపర్టీ ఫస్ట్ వ్యవస్థాపకుడు భవేష్ కొఠారి అన్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Bengaluru: ఉద్యోగం కంటే సొంత వ్యాపారమే మిన్న.. ఒంటరిగా వంట చేస్తూ నెటిజన్ల మనసు గెలిచిన టెక్కీ!

Bengaluru: అద్దె ఎంత పెరిగినా అక్కడే ఉంటాం! ఫ్రెండ్స్ కోసం లక్షలు వదులుకుంటున్న బెంగళూరు కపుల్!

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!



Click it and Unblock the Notifications