బెంగళూరులో ఈ ఒక్క ఏరియాకే పుల్లు డిమాండ్.. స్థలాలు కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు

ఒకప్పుడు బెంగళూరు నగర తూర్పు శివార్లలో పచ్చని పల్లె ప్రాంతంగా ఉన్న గుంజూర్.. ఇప్పుడు బెంగళూరులో అత్యంత చురుకైన గృహ మార్కెట్‌లలో ఒకటిగా దూసుకుపోతోంది. రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం 2020లో చదరపు అడుగుకు రూ. 4,800 ఉన్న నివాస ఆస్తి ధరలు, 2024లో రూ. 11,850కి పెరిగాయి. ఇది కేవలం నాలుగేళ్లలో 146% పెరుగుదల నమోదు చేసింది.

2022 ప్రారంభం నుండి ఇప్పటి వరకు గుంజూర్‌లో 9,031 యూనిట్లు ప్రారంభించారు. వీటిలో 2025 రెండవ త్రైమాసికం నాటికి 7,635 యూనిట్లు ఇప్పటికే అమ్మకాలు జరిగాయి. 2024లో మాత్రమే అమ్మకాలు 10% పెరిగి 2,828 యూనిట్లకు చేరుకున్నాయి. 2025 మొదటి ఆరు నెలల్లో 1,100 ఇళ్లు కొనుగోలు చేయబడ్డాయి. ఈ గణాంకాలు గుంజూర్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనంగాచెప్పుకోవచ్చు.

Gunjur ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం.. బెంగళూరులోని ప్రధాన ఐటీ హబ్‌లైన వైట్‌ఫీల్డ్, బ్రూక్‌ఫీల్డ్, సర్జాపూర్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ లకు సమీపంలో ఉండటమే. అలాగే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఈ మైక్రో మార్కెట్ ఆకర్షణను పెంచింది. సంజీవిని గ్రూప్ చైర్మన్ ఉమేష్ గౌడ ప్రకారం.. గుంజూర్‌లో నివసించడం వల్ల నగరంలోని అన్ని ప్రాంతాలకు మంచి కనెక్టివిటీతో పాటు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాలు వంటి సామాజిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఈ ప్రాంతం పచ్చని ప్రదేశాలు, ప్రకృతి ప్రేరణతో జీవన శైలి వల్ల ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందన్నారు.

Bengaluru real estate Gunjur housing market Bengaluru property prices Gunjur property appreciation housing demand Bengaluru real estate boom Gunjur Bengaluru new residential hub Gunjur flats and villas Bengaluru property investment fastest growing locality Bengaluru

2024లో బెంగళూరులో 21.7 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగి, ఇది గత సంవత్సరం కంటే 39శాతం ఎక్కువగా ఉంది. ఈ వృద్ధి గుంజూర్ వంటి పరిధీయ ప్రాంతాల్లో గృహ అవసరాన్ని మరింతగా పెంచింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుంజూర్ లో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున ఆకర్షితమవుతున్నారు. వీరు మూలధన పెరుగుదల, అద్దె రాబడి కోసం ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు.

గుంజూర్ పెరుగుదల వెనుక మరో కీలక అంశం రవాణా ప్రాజెక్టులు.పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR), గుంజూర్ పాల్య రోడ్, వర్తూర్-సర్జాపూర్ రోడ్ వంటి ప్రధాన మార్గాల అభివృద్ధి ఈ ప్రాంతాన్ని నగర రవాణా గ్రిడ్‌తో అనుసంధానించాయి. రాబోయే బెంగళూరు బిజినెస్ కారిడార్, ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే రూపంలో మరింత కనెక్టివిటీ అందించనుంది. ఇది కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు, ఐటీ కారిడార్‌లకు సులభ ప్రాప్యత ను కల్పించనుంది.

2025 మొదటి ఆరు నెలల్లోనే గుంజూర్‌లో 1,522 కొత్త యూనిట్లు లాంచ్ చేశారు. ఇది 2024లోని మొత్తం సరఫరాలో దాదాపు రెండు మూడవ వంతుగా చెప్పుకోవచ్చు. 2020-2024 మధ్యలో 8,558 యూనిట్లు ప్రారంభించడం జరిగింది. ఇది 2015-2019 కాలంతో పోలిస్తే 150 శాతం ఎక్కువ. 2025 రెండవ త్రైమాసికం నాటికి 7,745 యూనిట్లు అమ్మకాలు జరపడం 103 శాతం వృద్ధిని సూచిస్తోంది.

గుంజూర్‌లో ప్రధానంగా రూ. 1 కోటి - రూ. 2 కోట్ల మధ్య ధరగల 3 బెడ్‌రూమ్ ఫ్లాట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇవి మంచి జీవనశైలితో పాటు దీర్ఘకాలిక విలువ పెరుగుదల కోరుకునే కుటుంబాలను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక సంజీవిని గ్రూప్ ఇప్పటికే ఈ ప్రాంతంలో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుకు ఇప్పటికే RERA ఆమోదం కూడా పొందింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+