కుప్పకూలుతున్న బెంగళూరు రియల్ ఎస్టేట్.. అదను చూసి దెబ్బ కొట్టిన తమిళనాడు..

Bengaluru Real Estate: కర్ణాటక రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఎం-శాండ్ (M-Sand), పి-శాండ్ (P-Sand), అగ్రిగేట్స్, రెడీ-మిక్స్ కాంక్రీట్ (RMC) వంటి అవసరమైన నిర్మాణ సామగ్రి రవాణాపై పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఏకంగా జనవరి 2027 వరకు పొడిగించడంతో సరఫరా వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. దీంతో కర్ణాటకలో రాళ్లు, ఇసుక, జెల్లీ సరఫరా ఏకంగా 40 శాతానికి పడిపోయింది. ఫలితంగా నిర్మాణ వ్యయం సుమారు 33 శాతం పెరగడంతో పాటు గృహాల విక్రయాలు మందగించి డెవలపర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

TOI కథనం ప్రకారం.. తమిళనాడు సరిహద్దుల ద్వారా సరఫరా నిలిచిపోవడంతో పాటు, కర్ణాటకలోని 70 శాతానికి పైగా స్టోన్ క్రషర్లు, కృష్ణగిరి ప్రాంతంలోని 15-20 శాతం క్రషర్లు మూతపడటంతో కొరత తీవ్రమైంది. ఇసుక ధరలు టన్నుకు గతంలో ఉన్న రూ.250-రూ.300 నుండి ఒక్కసారిగా రూ.450-రూ.800కు ఎగబాకాయి. దీనికి తోడు సిమెంట్, స్టీల్ ధరలు కూడా 8 నుండి 10 శాతం పెరిగాయి. దీనివల్ల చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ.250 నుండి రూ400 (దాదాపు 15-18%) వరకు పెరిగిందని డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Bengaluru construction costs construction costs rise 33 Bengaluru real estate builders margin squeeze Bengaluru property market construction material shortage sand prices in Bengaluru cement prices steel prices Tamil Nadu construction material ban real estate news India homebuyers Bengaluru housing sales slowdown construction project delays RERA extension October 2026 real estate news 33

ఈ పతనంపై నిపుణులు, బిల్డర్ల అభిప్రాయాలు:

ఫారూక్ మహమూద్ (గౌరవాధ్యక్షులు, BRAI): "రెరా (RERA) గడువు నాలుగు నెలలు పొడిగించడం తాత్కాలిక సడలింపు ఇచ్చినా, తమిళనాడు నిషేధం వల్ల ప్రాజెక్టులు కనీసం ఆరు నెలల పాటు ఆలస్యం కానున్నాయి. ప్రాజెక్టుల పూర్తి ఆలస్యమైతే, గృహ కొనుగోలుదారులు ఒకేసారి అద్దె మరియు బ్యాంక్ ప్రీ-ఈఎమ్‌ఐలు (Pre-EMIs) చెల్లించాల్సి వచ్చి తీవ్ర ఆర్థిక భారానికి గురవుతారు.

సురేష్ హరి (భాగస్వామి, విశాల్ ప్రమోటర్స్): RERA నిబంధనల ప్రకారం ఒకసారి ఒప్పందం కుదిరిన తర్వాత మేము కస్టమర్లకు ధరలను పెంచలేము. ప్రస్తుత పెరిగిన ఖర్చుల భారాన్ని బిల్డర్లే భరించాల్సి వస్తోంది. సుదీర్ఘకాలంలో ముడి పదార్థాల లభ్యతపై ప్రభుత్వం పటిష్ట నియంత్రణ యంత్రాంగాన్ని తెవాలి.

రమణి శాస్త్రి (డైరెక్టర్, స్టెర్లింగ్ డెవలపర్స్): RERA పొడిగింపు కేవలం ప్రాజెక్టు ఆలస్యాలకు పడే జరిమానాల నుండి మాత్రమే రక్షిస్తుంది, కానీ పెరిగిన నిర్మాణ వ్యయాన్ని ఏమాత్రం తగ్గించలేదు."

పరిశ్రమ వర్గాల డిమాండ్లు & ప్రభుత్వ జోక్యం:

గుజరాత్‌లోని మోర్బిలో దాదాపు 200లకు పైగా భవన నిర్మాణ సామగ్రి యూనిట్లు మూతపడటం, అంతర్జాతీయంగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల పెట్రోకెమికల్ ఆధారిత పెయింట్లు, టైల్స్ ధరలు పెరగడం ఒత్తిడిని మరింత పెంచాయి. క్రెడాయ్ (CREDAI) కర్ణాటక అధ్యక్షుడు భాస్కర్ టి నాగేంద్రప్ప మాట్లాడుతూ.. వచ్చే వారం ప్రభుత్వ అధికారులతో సమావేశమై తమ సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు.

డబుల్ రాయల్టీ సమస్యను పరిష్కరించడం, క్రషర్ల నిర్వహణ వేళలను పెంచడం, సరిహద్దు జిల్లాల్లో ఇ-పర్మిట్ల కోసం తమిళనాడు ప్రభుత్వంతో దౌత్య సమన్వయం చేసుకోవడం, మరియు ప్రీమియం/అప్రూవల్ ఫీజులను మూడు నెలల పాటు వాయిదా వేయాలని బిల్డర్లు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+