బెంగళూరు రియల్ ఎస్టేట్‌.. ఈ ఒక్క ఏరియాలో ఇల్లు కావాలని ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. కారణం ఏంటంటే..

Bengaluru Real Estate Outlook: బలమైన ఉపాధి ఆధారిత వృద్ధి, వేగంగా మెరుగవుతున్న మౌలిక సదుపాయాల కారణంగా సిలికాన్ సిటీ బెంగళూరు నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. నగరంలోని టెక్నాలజీ రంగాలు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCs), స్టార్టప్ ఎకోసిస్టమ్ నిరంతరం ఉపాధిని సృష్టిస్తుండటంతో గృహాల డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా బెంగళూరు మార్కెట్ కేవలం ఊహాజనిత పెట్టుబడులపై కాకుండా.. మునుపెన్నడూ లేనివిధంగా 'తుది వినియోగదారుల' (End-users) కొనుగోళ్లపై ఆధారపడి ఉండటం ఈ మార్కెట్‌కు గట్టి స్థిరత్వాన్ని ఇస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

2026 మూడవ త్రైమాసికంలో బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరా (Supply) 17% మేర.. అమ్మకాలు (Sales) 12% మేర వృద్ధి చెందాయి. కొన్ని మైక్రో-మార్కెట్లలో ధరలు పెరిగినప్పటికీ, నిజమైన గృహ అవసరాలు, నగర భవిష్యత్తు వృద్ధిపై కొనుగోలుదారులలో ఉన్న దీర్ఘకాలిక నమ్మకమే ఈ డిమాండ్‌కు ప్రధాన కారణమని రియల్ ఎస్టేట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

East Bengaluru real estate Bengaluru property market Sanjeevini Group MD Suresh H A East Bengaluru property growth Gunjur real estate Varthur property market Whitefield real estate Hoskote property market Bengaluru housing demand Bengaluru property prices metro connectivity Bengaluru IT corridor real estate premium housing Bengaluru real estate growth corridors

కేవలం అపార్ట్‌మెంట్ పరిమాణానికే పరిమితం కాకుండా, మెరుగైన డిజైన్, నిర్మాణ నాణ్యత, విశాలమైన స్థలాలు, పచ్చదనం, జీవన ప్రమాణాలకు (Quality of Life) కొనుగోలుదారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేకించి టెక్ నిపుణులు, కుటుంబాల నుండి లార్జ్-సైజ్ 3BHK, 4BHK గృహాలకు డిమాండ్ భారీగా పెరిగిందని చెబుతున్నారు.

Also Read

బెంగళూరు నివాస రంగ భవిష్యత్తు రూపురేఖలను రోడ్డు నెట్‌వర్క్‌ల విస్తరణ, మెట్రో కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలే పూర్తిగా నిర్దేశిస్తున్నాయి. వైట్‌ఫీల్డ్, బ్రూక్‌ఫీల్డ్, సర్జాపూర్ రోడ్, టెక్ కారిడార్లకు సమీపంలో ఉండటం వల్ల గుంజూర్ - వర్తూర్ ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నివాస మైక్రో-మార్కెట్‌గా అవతరించింది.

డిసెంబర్ 2026 నాటికి పూర్తికానున్న వర్తూర్ ఎలివేటెడ్ కారిడార్,
వర్తూర్ - గుంజూర్ మధ్య ప్రతిపాదిత 2 కి.మీ. ఎలివేటెడ్ ఫ్లైఓవర్,
న్యూ హొరైజన్ కాలేజీ మీదుగా గుంజూర్‌ను ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) కలిపే 6.2 కి.మీ. (140 అడుగుల వెడల్పు) రహదారి ప్రాజెక్టులు ఈ ప్రాంత ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చనున్నాయి.
భవిష్యత్తులో రాబోయే వైట్‌ఫీల్డ్-సర్జాపూర్ మెట్రో కారిడార్ ఈ ప్రాంత అనుసంధానాన్ని మరింత సులభతరం చేయనుంది.

ఇక రియల్ ఎస్టేట్ రంగంలో నాణ్యత, సకాలంలో ప్రాజెక్ట్‌లను అప్పగించడం రియల్ ఎస్టేట్ సంస్థలకు చాలా సవాళ్లతో కూడుకున్న పనిలా మారింది. కారణం ఏంటంటే పెరిగిన వ్యయాలతో మార్కెట్ లో ఆశాజనక పరిస్థితులు కనపడటం లేదు. దీంతో ప్రాజెక్టుల వేగం కూడా తగ్గినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఏదేమైనా ఐటీ నగరంగా, భారత సిలికాన్ సిటీగా ఉన్న బెంగళూరు నగరం రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ దూసుకుపోతూనే ఉంటుందని చెప్పవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+