బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఐదేళ్లలో ఇల్లు కట్టకపోతే ప్లాట్లు వెనక్కి.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Bengaluru Real Estate: బెంగళూరు నగరంలో ఖాళీ స్థలాలు ఉన్నవారికి బిగ్ షాక్.. ఖాళీ స్థలాల నిర్వాహణ, పౌర పరిశుభ్రతపై కర్ణాటక ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించింది. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA), పూర్వపు సిటీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ బోర్డ్ (CITB), పౌర సంస్థలు, సహకార సంఘాల ద్వారా ప్రభుత్వ స్థలాలు (ప్లాట్లు) పొందిన లబ్ధిదారులు ఐదేళ్లలోపు ఇళ్లు నిర్మించడంలో విఫలమైతే.. ఆ స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం స్పష్టం చేశారు. కేటాయింపుదారులు చెల్లించిన అసలు మొత్తాన్ని వడ్డీతో సహా వాపసు ఇచ్చి ఆస్తులను రీ-అక్వైర్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

హెబ్బాల్ జంక్షన్ సమీపంలో నిర్వహించిన వ్యర్థాల నుండి స్వేచ్ఛ ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. నగరంలో ఏళ్లుగా ఖాళీగా పడి ఉన్న ప్లాట్లు చెత్తకుప్పలుగా, డంపింగ్ గ్రౌండ్‌లుగా మారి తీవ్ర పారిశుధ్య సమస్యలను సృష్టిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు పొందిన లబ్ధిదారులకు అక్కడ ఇళ్లు నిర్మించుకుని, తమ ఆస్తులను పరిశుభ్రంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన నొక్కి చెప్పారు. కొందరు 20, 30 లేదా 40 ఏళ్లు గడిచినా స్థలాలను అలాగే ఖాళీగా వదిలేస్తున్నారని.. కనీసం ప్రహరీ గోడ కూడా నిర్మించకుండా చెత్తకుప్పలుగా మారడానికి కారణమవుతున్నారని విమర్శించారు.

Karnataka Housing Karnataka Government Plot Rules Housing Policy Residential Plots House Construction Siddaramaiah Karnataka CM Bengaluru Housing Urban Development Real Estate News Property News Karnataka News Housing Scheme Business News Bengaluru Real Estate

నగరంలో పారిశుధ్య లోపాలను నివారించేందుకు ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవని, చట్టపరమైన చర్యలు తప్పవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఐదేళ్ల గడువులోగా ఇల్లు కట్టని పక్షంలో రెట్టింపు ఆస్తి పన్ను విధించడం లేదా ప్లాట్‌ను పూర్తిగా తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్లాట్ యజమానులు స్వయంగా చెత్త వేయకపోయినా, తమ ఆస్తిని కాపాడుకుంటూ పరిశుభ్రంగా ఉంచడం వారి పౌర బాధ్యత అని పునరుద్ఘాటించారు. ఐటీ రాజధాని బెంగళూరును స్వచ్ఛమైన, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

Also Read

ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్ని చెత్త సమస్య నుండి విముక్తి చేసి, అత్యంత పరిశుభ్రమైన మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం ఒక బృహత్తర పారిశుధ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నగరాన్ని ప్లాస్టిక్, వ్యర్థ రహితంగా మార్చడమే ధ్యేయంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం హెబ్బాల్ జంక్షన్ సమీపంలో వ్యర్థాల నుండి స్వేచ్ఛ అనే ప్రత్యేక ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన డీకే శివకుమార్.. నగరంలో రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను విసిరేసే సంస్కృతికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. నగరంలో పారిశుధ్య నిర్వహణను వేగవంతం చేయడానికి, చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రజలు, వ్యాపారులు, ఆస్తి యజమానులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.

బెంగళూరును స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, గ్రీన్ సిటీగా మార్చడమే వ్యర్థాల నుండి స్వేచ్ఛ అభియాన్ యొక్క మూల ఉద్దేశమని.. ప్రతి ఆస్తి యజమాని తమ పౌర బాధ్యతను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+