బెంగళూరు రియల్ ఎస్టేట్ ఢమాల్, లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌ డీలా..కారణాలు ఏంటంటే..

భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో లగ్జరీ హౌసింగ్ మార్కెట్ కుప్పకూలుతోంది. ఉద్యోగ నష్టాలు, ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఈ మార్కెట్ డీలా పడుతోంది. ఒకప్పుడు స్థిరంగా సాగిన నగర లగ్జరీ గృహ మార్కెట్ ప్రస్తుతం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కుంటోంది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం, ఐటీ రంగంలో ఉద్యోగ నష్టాలు, గ్లోబల్ కంపెనీల ఖర్చుల నియంత్రణ వంటి పరిణామాలు రియాల్టీ కొనుగోలుదారుల నమ్మకాన్ని భారీగా దెబ్బతీస్తున్నాయి.

తాజాగా.నగరంలోని టాప్ డెవలపర్లు ప్రీమియం హౌసింగ్ కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. దీంతో లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. 25:75 చెల్లింపు పథకాలు.. ముందస్తు డిస్కౌంట్లు వంటి విధానాలు.. ఇవి గతంలో చాలా అరుదుగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితులు కనపడటం లేదు.

2025 రెండవ త్రైమాసికంలో బెంగళూరులో గృహ అమ్మకాలు 8 శాతం తగ్గినట్లు ANAROCK నివేదిక చెబుతోంది. గత ఏడాది 16,350 యూనిట్ల నుంచి ఇప్పుడు 15,100 యూనిట్లకు తగ్గాయి. సగటు గృహధరలు 12 శాతం పెరిగినా.. అమ్మకాల్లో వెనకడుగు పడింది. ఇది ధరల పెరుగుదల డిమాండ్‌ను ప్రభావితం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Bengaluru luxury housing Bengaluru real estate slowdown luxury property market Bengaluru job losses impact housing economic uncertainty real estate Bengaluru housing market trends high-end apartments Bengaluru premium property prices Bengaluru real estate experts Bengaluru IT layoffs real estate effect real estate news India Bengaluru real estate 2025 luxury home demand drop 2025

ప్రముఖ డెవలపర్లు గడిచిన కాలంలో దూకుడుగా ప్రాజెక్టులను ప్రారంభించగా.. ఇప్పుడు ప్రాజెక్టుల నాణ్యత, డెలివరీపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. మధ్యతరగతి వర్గాల గృహాలపై దృష్టి పెడుతున్న ప్రెస్టీజ్ గ్రూప్ రూ. 2-రూ.3 కోట్ల మధ్య ధరల గృహాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మధ్యతరగతి జీతాల గల కొనుగోలుదారులకు తగిన డిమాండ్‌ను అందించనుంది. దీంతో లగ్జరీ హౌసింగ్ మార్కెట్ వైపు ఎవరూ చూడటం లేదు.

దీంతో నగరంలో లగ్జరీ మార్కెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాల్లో ధరలు చదరపు అడుగుకు రూ. 1,000 మార్కెట్ సగటు కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఇన్వెంటరీ నిలకడగా పెరుగుతోంది. కొన్నిచోట్ల అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అదే సమయంలో, కోరమంగళ, ఇందిరానగర్ వంటి ప్రైమ్ లొకేషన్లలో లగ్జరీ డిమాండ్ అలాగే కొనసాగుతూనే ఉంది.

ఉద్యోగ నష్టాలు, IT రంగంలో గందరగోళం, అధిక ధరలు వంటి అంశాలు ఇల్లు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. వారు ఇప్పుడు ఎక్కువ పరిశీలనతో, తక్కువ రిస్కుతో, మెరుగైన డీల్ కోసం వేచి చూస్తున్నారు. కరోనా తర్వాత కొనుగోలుదారులు సౌకర్యాలు, స్థల పరిమాణం, బ్రాండ్ విలువ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయినప్పటికీ.. నిపుణుల అభిప్రాయం ప్రకారం లగ్జరీ గృహ విభాగాన్ని పూర్తిగా వదిలేయడం డెవలపర్లకు సాధ్యపడదు. ఇది మార్కెట్లో వారి బ్రాండ్ స్టేటస్‌ను మెరుగుపరుస్తుంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs) లాంటి సంస్థల నుంచి స్థిరమైన డిమాండ్‌ను అందిస్తుంది. రూ. 3 కోట్ల వరకూ గృహాలు కొనుగోలు చేయగలిగే సామర్థ్యం కలిగిన కుటుంబాల సంఖ్య బెంగళూరులో తక్కువేం కాదని చెప్పవచ్చు.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+