Bengaluru: అపార్ట్‌మెంట్‌లో కింది ఫ్లోర్ బెటరా? పై ఫ్లోర్ బెటరా? కొనేముందు ఈ నిజాలు తెలుసుకోండి!
బెంగళూరు (Bengaluru) రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఐటీ హబ్ లో ఒక సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఒక పెద్ద అపార్ట్‌మెంట్ (High-rise) లో ఫ్లాట్ కొనేటప్పుడు చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం.. "తక్కువ ధరకు వచ్చే కింది ఫ్లోర్లు (Lower Floors) తీసుకోవాలా? లేదా ప్రీమియం ధర చెల్లించి పై ఫ్లోర్లు (Upper Floors) తీసుకోవాలా?" అనేది. ఇటీవల ఒక రెడ్డిట్ (Reddit) యూజర్ తాను ఒక 20 అంతస్తుల బిల్డింగ్ లో మొదటి అంతస్తులో ఫ్లాట్ కొన్నానని, అది మంచి నిర్ణయమేనా? అని అడిగిన ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

కింది అంతస్తులు (Lower Floors)..
బెంగళూరులో లోయర్ ఫ్లోర్ ఫ్లాట్లు సాధారణంగా పై ఫ్లోర్ల కంటే 20 నుంచి 25 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. ఉదాహరణకు ఒకే అపార్ట్‌మెంట్‌లో కింది ఫ్లోర్ ధర రూ. కోటి ఉంటే.. అదే ఫ్లాట్ 8వ లేదా అంతకంటే పై అంతస్తులో రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఉండవచ్చు.
ప్రయోజనాలు:
- లిఫ్టుల మీద ఆధారపడాల్సిన అవసరం తక్కువ. అత్యవసర సమయాల్లో మెట్లు వాడటం సులభం.
- బడ్జెట్ లో ఇల్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
- వృద్ధులు లేదా ఎత్తు అంటే భయం (Acrophobia) ఉన్నవారికి ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి.
ప్రతికూలతలు..
- సౌండ్ & డస్ట్: మెయిన్ రోడ్డు పక్కన ఉంటే ట్రాఫిక్ శబ్దం, దుమ్ము ఎక్కువగా ఉంటుంది.
- దోమల బెడద: గార్డెన్ లేదా డ్రైనేజీ పాయింట్లకు దగ్గరగా ఉండటం వల్ల దోమల సమస్య ఎక్కువ.
- వెలుతురు: చుట్టూ ఇతర టవర్లు ఉండటం వల్ల సహజమైన ఎండ, గాలి తక్కువగా రావచ్చు.
పై అంతస్తులు (Top Floors)..
చాలామంది బెంగళూరు (Bengaluru) సిటీ వ్యూ కోసం లేదా ప్రశాంతత కోసం టాప్ ఫ్లోర్ల వైపు మొగ్గు చూపుతారు. బిల్డర్లు కూడా 'ఫ్లోర్-రైజ్ ఛార్జీల' పేరుతో పైకి వెళ్లే కొద్దీ రేట్లు పెంచుతారు.
- అడ్వాంటేజ్: మంచి గాలి, వెలుతురు, బయట ప్రపంచం నుంచి వచ్చే శబ్దం తక్కువగా ఉంటుంది.
- సవాళ్లు: వేసవిలో ఎండ వేడి నేరుగా రూఫ్ మీద పడటం వల్ల ఇల్లు చాలా వేడెక్కుతుంది. అలాగే నీటి పీడనం (Water Pressure) తగ్గడం, లిఫ్ట్ రిపేర్ వస్తే ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉంటాయి.
రీసేల్ వాల్యూ ఎక్కడ ఎక్కువ?
రియల్ ఎస్టేట్ నిపుణుడు సునీల్ సింగ్ ప్రకారం.. బెంగళూరులో 4 నుంచి 8వ అంతస్తు మధ్య ఉండే ఫ్లాట్లకు డిమాండ్ ఎక్కువ. ఇవి సంవత్సరానికి 10% వరకు ధర పెరుగుదలను (Appreciation) చూస్తాయి. అదే కింది ఫ్లోర్లలో ఇది 5% వరకే ఉండవచ్చు. ఒక గ్రేడ్-ఏ ప్రాజెక్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అమ్మకానికి పెడితే దాదాపు 7-8 నెలల వరకు ఎవరూ కొనలేదని, అదే అప్పర్ ఫ్లోర్ ఫ్లాట్లు వెంటనే అమ్ముడయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఏది ఏమైనా మీరు తక్కువ బడ్జెట్‌లో, కేవలం నివసించడానికి ఇల్లు చూస్తుంటే లోయర్ ఫ్లోర్ బెటర్. కానీ, భవిష్యత్తులో మంచి లాభానికి అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మధ్యస్థ లేదా పై అంతస్తులే (4th to 8th Floor) సరైన ఎంపిక. బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లో ఇల్లు కొనేముందు మీ అవసరాలను, ఆ ఫ్లాట్ పొజిషన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.


Click it and Unblock the Notifications