బెంగళూరు రియల్ ఎస్టేట్ షాక్! ఇన్వెస్టర్లకు హాట్‌స్పాట్‌గా మారుతున్న కొత్త ఏరియాలు!

ఐటీ హబ్ అనగానే మనకు గుర్తొచ్చేది బెంగళూరు (Bengaluru). ఉద్యోగాల కోసమే కాదు, ఇప్పుడు ఇండ్లు కొనాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా అందరి చూపు ఈ సిటీ పైనే పడుతోంది. అయితే, ఇప్పటివరకు ఐటీ కంపెనీలు ఉన్న ఈస్ట్ బెంగళూరు (వైట్‌ఫీల్డ్, మరతహళ్లి లాంటి ఏరియాలు) మాత్రమే రియల్ ఎస్టేట్‌లో రారాజుగా ఉండేవి. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది! నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, సరికొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ కారణంగా బెంగళూరులోని కొన్ని కొత్త ప్రాంతాలు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగ్నెట్స్‌గా మారిపోయాయి.

Bengaluru Real Estate Investment Growth Corridors North South Premium Housing Property News

ఈస్ట్ బెంగళూరును దాటేసిన నార్త్ బెంగళూరు!

అవును, బెంగళూరు రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇది ఒక పెద్ద మార్పు. మొదటిసారిగా నార్త్ బెంగళూరు ప్రాంతం కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల లాంచ్‌లలోనూ, ఇండ్ల అమ్మకాల్లోనూ ఈస్ట్ బెంగళూరును దాటేసి టాప్‌లోకి దూసుకెళ్లింది. ముఖ్యంగా హెబ్బాల్, తానిసాండ్ర, జక్కూర్, హెన్నూర్, యెలహంక , ఎయిర్‌పోర్ట్ రోడ్డు పరిసర ప్రాంతాలు ఫ్యూచర్ గ్రోత్ డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గరగా ఉండటం, కమర్షియల్ హబ్‌లు వేగంగా పెరగడం , రాబోయే బ్లూ లైన్ మెట్రో ప్రాజెక్ట్ ఈ ఏరియా రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్నాయి.

రేసులో తగ్గని సౌత్ బెంగళూరు

నార్త్ బెంగళూరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, సౌత్ బెంగళూరు రెండో స్థానంలో గట్టి పోటీ ఇస్తోంది. ఒకప్పుడు ఇక్కడ కేవలం మిడిల్ క్లాస్ బడ్జెట్ ఇండ్లు మాత్రమే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజల లైఫ్‌స్టైల్ మారిపోయింది. సర్జాపూర్ రోడ్, బేగూర్, ఎలక్ట్రానిక్ సిటీ, బన్నెరఘట్ట రోడ్, కనకపుర రోడ్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడు లగ్జరీ , ప్రీమియం అపార్ట్‌మెంట్లు క్యూ కడుతున్నాయి. పెద్ద ఇండ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ వంటి మోడ్రన్ ఫెసిలిటీస్ కావాలనుకునే వారు ఈ ఏరియాల వైపు మొగ్గు చూపుతున్నారు.

రూ. 1 కోటి నుండి రూ. 5 కోట్ల రేంజ్.. పెరిగిన కొనుగోలు శక్తి!

ఇప్పుడు బెంగళూరులో ఇల్లు కొనాలనుకునే వారి బడ్జెట్ కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 1 కోటి నుండి రూ. 5 కోట్ల రేంజ్ ఉన్న ఫ్లాట్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఐటీ ఉద్యోగుల జీతాలు పెరగడం, క్వాలిటీ లైఫ్ కోసం చూస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఆఫీసులకు దగ్గరగా ఉండటంతో పాటు పిల్లల స్కూళ్లు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసిన కమ్యూనిటీలను కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇన్వెస్టర్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ కొత్త ప్రాంతాల్లో రేట్లు కాస్త రీజనబుల్‌గా ఉన్నప్పుడే ఎంటర్ అయి, లాంగ్ టర్మ్‌లో భారీ లాభాలు అందుకోవాలని చూస్తున్నారు. మెట్రో లైన్లు పూర్తయి, కమర్షియల్ యాక్టివిటీ ఇంకా పెరిగితే ఈ ఏరియాల్లో రేట్లు ఆకాశాన్ని తాకడం ఖాయం. కాబట్టి, రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి బెంగళూరులోని ఈ కొత్త కారిడార్లు ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+