బెంగళూరులో గృహ కొనుగోలు చేసే యువకులు ఎదుర్కొంటున్న పెద్ద సందిగ్ధతపై ఒక రెడ్డిట్ పోస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉన్న సిటీ సెంటర్ అపార్ట్‌మెంట్‌లను ఎంచుకోవాలా, లేక నగర శివార్లలో ఉన్న పెద్ద విల్లాల్లో పెట్టుబడి పెట్టాలా అనే ప్రశ్నపై వందలాది మంది నెటిజన్లు తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చలో స్థోమత, రోజువారీ ప్రయాణం, ఉద్యోగ బదిలీలు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలపై డిబేట్ సాగింది.
చాలా మంది రెడ్డిట్ వినియోగదారులు ఉద్యోగ బదిలీలు గృహ నిర్ణయాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరించారు. ఒక ప్రొఫెషనల్ 2018లో ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత 14 నెలలకే మరో నగరానికి బదిలీ అయ్యారని తెలిపారు. కోవిడ్ సమయంలో ఆ ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చినప్పటికీ.. తరువాత మరో ఉద్యోగ మార్పు వల్ల మళ్లీ అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. అయినప్పటికీ, ఆ ఇంటిని తాను పదవీ విరమణ తర్వాత నివసించేందుకు ఉంచుకున్న ఆస్తిగా భావిస్తున్నానని.. దీర్ఘకాలికంగా ఒక సామాజిక నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నానని ఆయన పేర్కొన్నారు.

ఇతరులు కూడా మరింత ఒత్తిడితో కూడిన అనుభవాలను పంచుకున్నారు. మారతహళ్లిలో నివసించే ఒక ఉద్యోగి తన కంపెనీ విమానాశ్రయ ప్రాంతానికి మారడంతో వారానికి నాలుగు రోజులు కార్యాలయానికి హాజరు కావాల్సి వచ్చిందని చెప్పారు. రోజువారీ ప్రయాణం అసహనంగా మారిందని.. 15 ఏళ్ల పాత ఫ్లాట్‌కు అధిక ధర చెల్లించినప్పటికీ ఇప్పుడు ఆ నిర్ణయం భారంగా అనిపిస్తోందని ఆవేదన చెందారు. ఈ ఉదాహరణలు ఉద్యోగ మార్పులు.. అనుకూలంగా కనిపించి కొనుగోలు చేసిన ఇళ్లు ఎలా సవాలుగా మారుతున్నాయో చూపిస్తున్నాయి.
కొంతమంది నివాసితులు ప్రయాణ అసౌకర్యాలకన్నా కుటుంబ స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పాఠశాలలు, కమ్యూనిటీలు, స్నేహితుల వలయం దగ్గరగా ఉండటం వల్ల పిల్లలకు స్థిరమైన జీవనశైలి లభిస్తుందని ఒక తండ్రి పేర్కొన్నారు. రోజువారీ ప్రయాణం ఎక్కువైనా, కుటుంబ జీవన నాణ్యత కోసం ఆ త్యాగం అవసరమని అభిప్రాయపడ్డారు. మెట్రో కనెక్టివిటీ కూడా కీలక అంశంగా చర్చలో నిలిచింది.
Bengaluru వైట్‌ఫీల్డ్‌లో నివసిస్తూ మెట్రో ద్వారా ప్రయాణించిన అనుభవాన్ని ఒక ప్రొఫెషనల్ వివరించారు. డ్రైవింగ్‌తో పోలిస్తే మెట్రో ప్రయాణం తక్కువ ఒత్తిడిగా ఉందని, పిల్లల పాఠశాలలు మార్చాల్సిన అవసరం రాలేదని చెప్పారు. ఈ విధమైన ప్రణాళిక భవిష్యత్తులో ఉద్యోగ బదిలీలను సులభంగా ఎదుర్కొనేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం.. ఈ చర్చ బెంగళూరు మార్కెట్లో ఉన్న మౌలిక సమస్యను ప్రతిబింబిస్తోంది. నగర కేంద్రంలో ఉన్న ఫ్లాట్లు రోజువారీ సౌలభ్యాన్ని అందిస్తే, శివార్లలోని విల్లాలు ఎక్కువ స్థలం, దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలను ఇస్తాయి. ఇద్దరు భాగస్వాములు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే యువ జంటలకు ఈ నిర్ణయం మరింత క్లిష్టంగా మారుతోంది.
హను రెడ్డి రియాలిటీకి చెందిన కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వైట్‌ఫీల్డ్, బెల్లందూర్ వంటి శివార్ల ప్రాంతాల్లో ఆస్తి విలువలు సెంట్రల్ బెంగళూరుతో పోలిస్తే సగటున 2 శాతం ఎక్కువ వృద్ధి చూపుతున్నాయని తెలిపారు. దీర్ఘకాలికంగా నగరంలో స్థిరపడాలనుకునే వారు ఇప్పుడు ఈ అభివృద్ధి చెందుతున్న సూక్ష్మ మార్కెట్లపై దృష్టి పెడుతున్నారని అన్నారు.
ANAROCK డేటా ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని దేవనహళ్లిలో గత ఆరు సంవత్సరాల్లో ధరలు దాదాపు 49 శాతం పెరిగాయి. మెట్రో విస్తరణ, రహదారి అభివృద్ధి, కొత్త టెక్ పార్కుల కారణంగా శివారుప్రాంతాలపై ఆసక్తి మరింత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications