బెంగుళూరు టెక్కీలకు శుభవార్త.. మంచి ప్లాట్ కావాల.. గజం ఎంత.. పెట్టుబడికి బెస్ట్ అప్షన్..
గత కొన్ని సంవత్సరాలుగా మంచి లాభాల వల్ల ప్లాట్ల బిజినెస్ మంచి పెట్టుబడి అప్షన్ లా మారింది. ఇండియాలోని కొన్ని నగరాలలో చూస్తే రియల్ ఎస్టేట్ రంగం కాస్త డీలా పడిన ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు, గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లకు డిమాండ్ పెదగడం చూడొచ్చు. ఇక బెంగుళూరులోని ఉత్తరం, తూర్పు వంటి ప్రాంతాలలో అపార్ట్‌మెంట్లు ఇంకా విల్లాల కంటే ప్లాట్ల అభివృద్ధి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొరోనా తర్వాత దేవనహళ్లి, కోరమంగళ, ఇందిరానగర్‌లకు సమీపంలోని తూర్పు, సిటీ మధ్యలో భూముల ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా చెబుతున్నారు.
బెంగళూరులో పెట్టుబడి అప్షన్స్
రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉత్తర బెంగళూరులోని ప్లాట్ల డెవలప్మెంట్ ధరలు పెరిగాయి. అంతేకాదు తూర్పు ఐటీ కారిడార్‌లోని పరిసర ప్రాంతాలలో కూడా రేట్లు పెరిగాయి. సబర్బన్ రైలు, పెరిఫెరల్ రింగ్ రోడ్, బెంగళూరు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ వంటి రాబోయే మౌలిక సదుపాయాలు ఈ డిమాండ్‌లో కీలకంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బెంగళూరులో ప్లాట్ల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
ఉత్తర బెంగళూరులోని గ్రేడ్ A డెవలపర్‌ల ప్రకారం 1200 చదరపు అడుగుల ప్లాట్‌కు చదరపు అడుగుకు కనీసం రూ.7000 నుండి ఉంటుందని బ్రోకర్లు చెబుతున్నారు. ఉత్తరాదిలోని హెన్నూర్, బాగలూరు వంటి ఇతర ప్రాంతాలలో ప్లాట్లకు చదరపు అడుగుకు రూ.6000గా ఉంది. గ్రేడ్ A డెవలపర్‌లు అభివృద్ధి చేసిన ఈ గేటెడ్ కమ్యూనిటీలు రేట్లను పెంచేలా చేసాయి. చిన్న ప్రాజెక్ట్‌లలో కూడా చదరపు అడుగుకు రూ.4000-5000గా ఉంది అని తెలిపారు. తూర్పు ఇంకా దక్షిణం వైపు ప్లాట్లు సైజ్ ఇంకా అభివృద్ధి రకాన్ని బట్టి చదరపు అడుగులకి రూ.4000-5000కి ఉన్నాయి. "దక్షిణాదిలో కనకపుర రోడ్ వైపు ధరలు గత సంవత్సరంలో 10-15% పెరిగి చదరపు అడుగులకి రూ.5000-6000 వరకు పెరిగాయి. గ్రేడ్ A డెవలపర్‌ల ద్వారా చదరపు అడుగులకి రూ.8000 చొప్పున కొన్ని ప్లాట్‌లను కూడా చూడవచ్చు" అని కుమార్ చెప్పారు.
బెంగళూరులో ప్లాట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు ఎం గుర్తుంచుకోవాలి?
ఫిక్స్డ్ 15-20% రేటుతో బెంగళూరులో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి వార్షికంగా వృద్ధి చెందుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు చెబుతున్నారు. అయితే ఇది స్థలం, భూమిని విక్రయించే డెవలపర్ రకంపై కూడా ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు ప్రాజెక్ట్ అందించే సౌకర్యాల వంటి అంశాలను చూడాలి అని చెప్పారు. నేడు, బెంగుళూరు నగరం అంతటా ఎన్నో ప్లాట్లు చేసిన దేవలప్డ్ ప్రాజెక్టులు లగ్జరీ క్లబ్‌హౌస్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్ ప్రదేశాలు వంటి సౌకర్యాలను అందిస్తున్నాయి. ఇవి భూమి ధరను పెంచుతాయని, పెట్టుబడులకు సేఫ్ అప్షన్ అని వారు అంటున్నారు. అలాగే పెట్టుబడి పెట్టడానికి ముందు డెవలపర్‌పై పెండింగ్‌లో ఉన్న లిటిగేషన్‌లు, వారి కెపాసిటీ గురించి క్షుణ్ణంగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలి. కొన్ని సందర్భాల్లో బయ్యర్లు 'ఖాతా ఎ' భూములను కూడా చూడాలి అని చెప్పారు. ఖాతా ఎ అనేది అసెట్ యజమాని BBMPకి సంబంధిత ఆస్తి పన్నులను సక్రమంగా చెల్లించారని, చట్టపరమైన అసెట్ అని వెరిఫై చేసే డాక్యుమెంట్. B అకౌంట్ అనేది చట్టవిరుద్ధమైన ఆస్తులు లేదా లిటిగేషన్స్ ఉన్న లోకల్ మునిసిపల్ బాడీచే నిర్వహించే ప్రత్యేక రిజిస్టర్.
ఈ రోజుల్లో ప్లాట్లు కొనడానికి చాల బ్యాంకులు లోన్స్ అందిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా, బెంగళూరులో ఇంటి కొనుగోలుదారులు ఖాతా ఎ ప్లాట్లను కొనుగోలు చేస్తే మాత్రమే బ్యాంకు రుణాలను పొందవచ్చు. ఇప్పుడు, ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ఇ-అకౌంట్ తప్పనిసరి. రెంళ్లలోపు ఇల్లు నిర్మిస్తే సగటున వడ్డీ రేట్లు 8-9% మధ్య ఉంటాయి. RBI మార్గదర్శకాల ప్రకారం, కొనుగోలుదారుడు ఇల్లు కొన్న రెండేళ్ల తరువాత ఇంటిని నిర్మిస్తే బ్యాంకు 9% కంటే అధిక వడ్డీ రేట్లు లేదా జరిమానాలకు దారి తీస్తుంది అని బెంగళూరుకు చెందిన బ్యాంకర్ సుజిత్ గౌడ తెలిపారు. సత్వ గ్రూప్ వంటి ఎన్నో బెంగళూరు డెవలపర్లు తాజాగా ఉత్తర బెంగళూరులో దాదాపు 343 ప్లాట్లతో 20 ఎకరాల ప్లాట్ల అభివృద్ధిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రెస్టీజ్ గ్రూప్ గత సంవత్సరం 600 ప్లాట్లతో ప్లాట్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ కింగ్స్ కౌంటీని ప్రారంభించింది.


Click it and Unblock the Notifications