Bengaluru Real Estate: బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొద్ది సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు భారీ లాభాల్ని అందించింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు పెట్టుబడిదారులను ఆందోళన పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రియల్టర్లు తమ ఆస్తుల్ని అమ్మేసుకుని బెంగుళూరును వదిలి వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ రావడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో టెక్ ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. దీనితో పాటు ఫ్రెషర్స్ హైరింగ్‌ను కంపెనీలు తగ్గించాయి. చాలా కంపెనీలు ఉద్యోగ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. జీతాలు పెరుగుదల కనిపించడం లేదు.
దీంతో బెంగుళూరు నగరానికి మూల స్థంభంగా ఉన్న టెక్ మార్కెట్ ఇప్పుడు నేల చూపులు చూసే పరిస్తితి కనిపిస్తోంది. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు బెంగళూరు నగరాన్ని వదిలివెళుతున్నారు. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ మీద దాని ప్రభావం పడుతోంది. వచ్చే ఉద్యోగంతో సొంత ఇళ్లు కొనుక్కోవాలనే సాఫ్ట్ వేర్లు ఇప్పుడు తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఇళ్లు ఏంకొనుగోలు చేద్దాములే.. దానిపై ఇన్వెస్ట్ మెంట్ చేయడం పెద్ద తలనొప్పి అనే పరిస్థితికి వస్తున్నారు. దీంతో రియల్ ఎప్టేట్ డిమాండ్ తగ్గిపోతోంది బెంగుళూరులో..

సాధారణంగా ఉద్యోగులు కొంతకాలం ఉద్యోగ అనుభవం వచ్చిన తర్వాత ఇంటి కొనుగోలుకు ప్లాన్ చేసుకునే వారు. 10 ఏళ్ళు పనిచేసిన వారు ఇళ్లు కొనుగోలుకు ప్లాన్ చేసే స్థాయి నుండి 6 ఏళ్ళ అనుభవం ఉంటే బెంగుళూరులో ఇల్లుకొనుగోలు చేయవచ్చనే స్థాయికి ఒకప్పుడు మార్కెట్ నడిచింది. గత ఏడాది అయితే చిన్న ఉద్యోగం చేసేవాళ్లు సైతం రూ. 1.2 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. తమ సొంతూరులో ఉన్న ఆస్తులను అమ్మి ఇక్కడ ఫ్లాట్ కొనేందుకు ఉత్సాహం చూపారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడటం లేదు.
టెక్ రంగంలో పెరుగుతున్న లేఆప్స్ : రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇటీవల కాలంలో టెక్ రంగంలో జరుగుతున్న లేఆప్స్ వల్ల కొనుగోలు దారులు ఇంటిని కొనేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇది మార్కెట్లో అస్థిరతను ఏర్పరిచింది. కేవంల కొనుగోలు దారులే కాకుండా ఇంటిని అద్దెకు ఇచ్చే వాళ్లు కూడా ఆలోచన చేసే పరిస్థితులు బెంగుళూరులో కనిపిస్తున్నాయి. చాలామంది ఓనర్లు ఇప్పుడు సాప్ట్ వేర్లకు అద్దెకు ఇచ్చే ఇంటిని కేవలం 12 నెలల కాలానికి మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే పొడిగించే దానికి ఆసక్తి చూపడం లేదు.
ANAROCK గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రియాంకా కపూర్ ఏమంటున్నారంటే..టెక్ ఉద్యోగులకు తమ ఉద్యోగం ఎప్పుడు తీసేస్తారో అనే భయంతో ఫ్లాట్ కొనడానికి ముందుకు రావడంలేదు. దీంతో కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ నిపుణులు తమ ఆస్తిని ఇప్పుడే విక్రయించకుండా వేచి ఉండటం మంచిదని సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఆస్తి ధరలు పడే అవకాశాలు తక్కువే. అవి కొంత కాలం పాటు స్థిరంగా ఉండొచ్చు కానీ తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక లాభాలు ఆశిస్తున్న పెట్టుబడిదారులకు ఇది సరైన సమయం కాదని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్తు గురించి ప్లాన్: 2024-25 మధ్య ఆస్తుల ధరలు, 2022-23లో పెరిగిన స్థాయిలో పెరగలేదు. ఈ పరిస్థితులను టెక్ రంగంలోని ఉద్యోగులు అవగాహన చేసుకుని భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లాట్ కొన్నా భవిష్యత్తులో అది పెరిగే అవకాశం లేదు కాబట్టి కొనడం ఎందుకులే అనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొద్ది సంవత్సరాలుగా బెంగళూరులోని అవుటర్ రింగ్ రోడ్ (ORR), సర్జాపూర్ రోడ్, వైట్‌ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో ఆస్తుల ధరలు భారీగా పెరిగాయి. టెక్ రంగం వల్ల డిమాండ్ పెరగడం, కోవిడ్ తర్వాత పెట్టుబడులు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆ ఊపు అక్కడ లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నెమ్మదించిన స్టార్టప్: బెంగుళూరులో స్టార్టప్ రంగం కూడా నెమ్మదిగా నడుస్తోంది. Tracxn Technologies డేటా ప్రకారం..కర్ణాటక స్టార్టప్‌లు 2025 తొలి త్రైమాసికంలో కేవలం 633 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టగా. గతేడాది 2024 చివరి త్రైమాసికంలో అది 825 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇది 23% తగ్గుదలను చూపిస్తోంది. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. 2024-25లో ఆస్తుల ధరలు 2022-23లో పోల్చితే అంతగా ఏమీ పెరగలేదు. దీంతో పాటుగా పెరిగిన జీవన వ్యయం, నీటి కొరత, పచ్చదనం తగ్గిపోవడం, తీవ్రమైన వాతావరణ మార్పులు, కనీస మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. భవిష్యత్తులో అమలులోకి రానున్న టన్నెల్ రోడ్లు మొదలైన ప్రాజెక్టులు కొంతకాలం ట్రాఫిక్‌ను పెంచే ప్రమాదం ఉన్నట్లు కొంతమంది చెబుతున్నారు. గృహ ధరలు అధికంగా ఉండడంతో నిజమైన కొనుగోలు దారుల నుంచి డిమాండ్ తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications