బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ మంచి డిమాండ్ తో కూడి ఉంటుంది. ఒక ప్రాంతం సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉండి, ఒక్కసారిగా భారీ వృద్ధికి కేంద్రంగా మారుతుంది. ఇందుకు ప్రధాన కారణాలు.. కొత్త రవాణా మార్గాలు, మెట్రో లైన్లు, IT పార్కులు, పరిశ్రమలు, వ్యాపార కేంద్రాల పెరుగుదల, ఉద్యోగ అవకాశాలు. ఈ నేపథ్యంలోనే నగరంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అనేది చాలా మందికి ప్రశ్నలా మారింది.
రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో ఎక్కడ ప్రగతి, డిమాండ్ పెరుగుతుంది అనే విషయం గురించి ఆలోచిస్తున్నారు..అయితే ప్రస్తుతం Bengaluru లో దీర్ఘకాలిక పెట్టుబడికి అత్యంత బలమైన భవిష్యత్తు ఉన్న ఐదు ముఖ్య ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉత్తర బెంగళూరు : కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఖాళీ భూములతోనే ఉన్న ఉత్తర బెంగళూరు, ఇప్పుడు విపరీతమైన అభివృద్ధిని చూసింది. అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, కొత్త రోడ్లు, రింగ్ రోడ్డు, బహుళ టెక్ పార్కులు, డిఫెన్స్ R&D హబ్‌లు ఆ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేశాయి. యలహంక, జక్కూరు, బాగలూరు వంటి ప్రాంతాల్లో ధరలు వేగంగా పెరుగుతున్నాయి, ఇంకా అద్దె ఆదాయం కూడా చాలా స్థిరంగా ఉంది. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ విలువలు ఇంకా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
వైట్‌ఫీల్డ్ : ఒకప్పుడు నగరానికి చాలా దూరం అని భావించిన వైట్‌ఫీల్డ్, ఇప్పుడు స్వతంత్ర నగరంగా ఎదిగింది. మెట్రో ప్రారంభం ప్రాంత విలువను పూర్తిగా మార్చింది. కోటి రూపాయల IT ఉద్యోగాల పెరుగుదల, మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, బహుముఖ అభివృద్ధి కారణంగా, ఇక్కడ అద్దె ఇళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కడగోడి, కన్నమంగళ, హోస్కోట్ ఇంకా సరసమైన రేట్లతో అందుబాటులో ఉన్నందున భవిష్యత్తులో ఇవి బంగారు గనులుగా మారే అవకాశం ఉంది.

సర్జాపూర్ రోడ్ : సర్జాపూర్ రోడ్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. IT కంపెనీలు, ORR కనెక్టివిటీ, టెక్ కారిడార్, మెట్రో విస్తరణ, భారీ టౌన్‌షిప్ ప్రాజెక్ట్‌లు - ఇవన్నీ ఈ ప్రాంత విలువను నిరంతరం పెంచుతున్నాయి. దొడ్డమసంద్ర, అత్తిబెలె ప్రాంతాలు వేగంగా ఎదుగుతున్నాయి. ఎక్కువ డిమాండ్, మంచి అద్దె, విలువ పెరుగుదల.. ఈ మూడు కారణాలు దీన్ని పెట్టుబడి కోసం అత్యుత్తమ ప్రదేశంగా మారుస్తాయి.
కనకపుర రోడ్: మెట్రో లైన్ కనకపుర రోడ్‌ను నగరానికి దగ్గర చేసింది. పచ్చదనం, ప్రశాంతమైన నివాస వాతావరణం, పాఠశాలలు, దేవాలయాలతో కుటుంబాలకు ఇది ప్రాధాన్యత పెరుగుతున్న ప్రాంతం. ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి, రిస్క్ తక్కువ, రాబడి ఎక్కువ.. ఇది సంప్రదాయ పెట్టుబడి దారుల కోసం సురక్షిత ప్రాంతం.
తానిసంద్ర - నాగవార : మాన్యత టెక్ పార్క్, రాబోయే మెట్రో లైన్లు, భారీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు.. ఇవన్నీ ఈ ప్రాంతాన్ని అత్యంత వేగంగా పెరగుతున్న ప్రాపర్టీ హబ్‌గా మార్చుతున్నాయి. ఇప్పుడు ధరలు వైట్‌ఫీల్డ్, ORR కంటే తక్కువగా ఉండటంతో, ఇది పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం. నిపుణులు అద్దె, రీసేల్ విలువలు రెండూ భారీగా పెరుగుతాయి అని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications