భారతదేదేశానికి ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ Bengaluru నగరం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్టప్‌లు, ఐటీ కంపెనీలు, ట్రాఫిక్ రద్దీ. ఈ మూడు లేకుండా బెంగళూరు నగరాన్ని ఊహించలేం. అయితే తాజాగా నగరం మరో రూపానికి వేదికగా నిలవబోతోంది. రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఇలా అన్ని రంగాల్లో భారీ ప్రాజెక్టులు నగరానికి ఆణిముత్యంగా మారనున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే బెంగుళూరు నగరం స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. నగర రవాణా విధానాన్ని ఈ ప్రాజెక్టులు పూర్తిగా మార్చి వేస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా భారీగానే పుంజుకోనుంది
నమ్మ మెట్రో బ్లూ లైన్ (ఫేజ్ 2): ఫేజ్ 2Aలో సిల్క్ బోర్డ్ నుంచి KR పురం వరకు 19 కి.మీ. మేర ORR మెట్రో లైన్ త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఇది 13 స్టేషన్లతో నగరంలోని అత్యంత ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపశమనం ఇవ్వనుంది. ఫేజ్ 2Bలో KR పురం నుంచి నేరుగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (36.4 కి.మీ.) రానున్న ఈ మెట్రో రాక 2026 నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.

నమ్మ మెట్రో రెడ్ లైన్ (ఫేజ్ 3): సర్జాపూర్-హెబ్బాల్, JP నగర్-కెంపాపుర, హోసహల్లి-కడబాగెరె వంటి కొత్త లైన్లతో మొత్తం 80 కి.మీ. మేర విస్తరణతో ఈ మెట్రో అందుబాటులోకి రానుంది. 30 కొత్త స్టేషన్ల మధ్య నడవనున్న ఈ మెట్రో పూర్తి అయితే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. వచ్చే ఈ దశ 2028 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్ట్ (BSRP): 148 కి.మీ. పొడవైన ఈ రైలు నెట్‌వర్క్ నాలుగు కారిడార్లలో విస్తరిస్తుంది. తద్వారా ప్రయాణం మరింత సులభం కానుంది. KSR బెంగళూరు నుంచి దేవనహళ్లి, బెన్నిగనహళ్లి నుంచి చిక్కబనవర, కెంగేరి నుంచి వైట్‌ఫీల్డ్, హీలలిగే నుంచి రాజనుకుంటే వరకు ఈ కారిడార్ ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇది 2026-2029 మధ్య పూర్తవుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
4.18 కి.మీ. భూగర్భ రోడ్డు: హెబ్బాల్ నుంచి సిల్క్ బోర్డ్ వరకు ట్విన్-ట్యూబ్ టన్నెల్ రోడ్ రూ.12,690 కోట్లు ఖర్చుతో 2025లో ఈ రోడ్డు ప్రారంభం కానుంది. ఇది నగర ఉత్తర-దక్షిణ ట్రాఫిక్‌ను భూమి సొంరంగాల ద్వారా క్లియన్ చేయనుంది. తద్వారా ట్రాఫిక్ సమస్య నగరంలో చాలా వరకు తీరనుంది.
శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ (STRR) & పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR): STRR 280 కి.మీ. పొడవుతో నగరంలో అందుబాటులోకి రానుంది. ఈ రింగ్ రోడ్డు నగరం చుట్టుపక్కలా 12 పట్టణాలను కలుపుతుంది. మొదటి భాగం ఇప్పటికే ప్రారంభం కాగా... మొత్తం ప్రాజెక్ట్ 2026-27 నాటికి పూర్తి కానుందని తెలుస్తోంది.. PRR 74 కి.మీ., 8-లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా 2027 నాటికి సిద్ధం కానుందని అంచనా.
హెబ్బాల్-KIA ఫ్లైఓవర్: విమానాశ్రయ రాకపోకలను సులభతరం చేయడానికి ప్రత్యేక ఫ్లైఓవర్ ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఉంది. ఇది పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
బెంగళూరు స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (B-SMILE): రూ. 7 వేల కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, సొరంగాలు వంటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి కావడానికి సహకరించనుంది. నగరంలో ఈ ప్రాజెక్టులు పూర్తయితే 2025-27 నాటికి ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.2030 నాటికి బెంగళూరు రవాణా, జీవన విధానం కూడా సరళంగా మారనుంది.


Click it and Unblock the Notifications