భారతదేశ సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా జోరు అందుకుంటోంది. నగరంలో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సరసమైన రియాల్టీ ఆస్తులు బాగా తగ్గాయి. ఇదే సమయంలో గృహ కొనుగోలుదారుల్లో ఏది కొనుగోలు చేయాలనే దానిపై ఆలోచనలో పడుతున్నారు.వెంటనే మారడానికి సిద్ధంగా ఉన్న పాత స్థానిక ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలా లేదా మరిన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో కొత్త అపార్ట్‌మెంట్‌ను ఎంచుకోవాలా అనే దానిపై నగరంలో చాలామంది మల్లగుల్లాలు పడుతున్నారు.
పాత బిల్డింగ్ విశ్లేషణ.. నగరంలో పాత అపార్ట్‌మెంట్ల ఆకర్షణ వాటి స్థానం గురించి ఓ సారి చూద్దాం. ఉదాహరణకు.. ఒక యువకుడు కడుబిసనహళ్లి ప్రాంతంలో రూ. 1 కోటికి 16 ఏళ్ల 3BHK ఫ్లాట్ కొనడానికి ఆసక్తిని వ్యక్తం చేశాడు, ఇది ప్రధాన రహదారికి, బస్ స్టాండ్ అలాగే రాబోయే మెట్రో స్టేషన్ కు కొద్ది దూరంలో ఉంది. ఈ ఆస్తి నుండి నెలకు రూ. 4 వేలు అద్దె రూపంలో ఆదాయం కూడా అతను ఆశిస్తున్నాడు. అయితే ఆ ఫ్లాట్‌లో స్విమ్మింగ్ పూల్, క్లబ్‌హౌస్ లేదా ఆట స్థలం వంటి ఆధునిక సౌకర్యాలు లేవు. అలాగే కమ్యూనిటీ కూడా చిన్నది.

రియల్ ఎస్టేట్ నిపుణుడు వివేక్ రతి చెబుతున్న వివరాల ప్రకారం.. ముఖ్యంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలలో ఉన్న పాత ఫ్లాట్‌లు మెరుగైన కనెక్టివిటీ, పాఠశాలలు, ఆసుపత్రులకు సామీప్యత, మౌలిక సదుపాయాల లభ్యత వంటి ప్రయోజనాలను అందిస్తాయి. అవి సాధారణంగా విస్తృతమైన సౌకర్యాలతో వస్తాయి. అయితే 25 సంవత్సరాల తర్వాత ఈ కట్టడాలు నిర్మాణ లోపాలు, సౌకర్యాలు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల, ఆక్యుపెన్సీ కాలం, నిర్వహణ స్థితి, అమ్మకపు విలువను ముందుగా విశ్లేషించుకోవాలని కోరారు.
కొత్త ఫ్లాట్లు విశ్లేషణ: వైట్‌ఫీల్డ్, సర్జాపూర్, యెలహంక, దేవనహళ్లి వంటి నగర శివార్లలో కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు పుట్టుకొస్తున్నాయి. వీటిలో క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, EV ఛార్జింగ్ పాయింట్, పిల్లల ఆట స్థలం వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ అపార్ట్‌మెంట్‌లు సమకాలీన డిజైన్‌తో గొప్ప కమ్యూనిటీ వాతావరణాన్ని అందిస్తాయి. కానీ ఈ ప్రాంతాలలో అనేక మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి కాలేదు. పని ప్రదేశాలకు ఇక్కడ నుంచి ప్రయాణించడానికి చాలా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు.
స్క్వేర్ యార్డ్‌కు చెందిన సోపన్ గుప్తా అభిప్రాయం ప్రకారం.. కొత్త అపార్ట్‌మెంట్‌లు భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రారంభంలో ప్రజలు రాకపోకలు, మౌలిక సదుపాయాల కొరత, ప్రజా రవాణా లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటారు. ఫీచర్లో ఈ సమస్యలేమి ఉండవు. భవిష్యత్తులో నగరం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
నిర్ణయం తీసుకునేటప్పుడు పరిగణించవలసిన అంశాలు: మీరు బెంగుళూరు నగరంలో రియాల్టీ కొనుగోలుకు ప్లాన్ చేస్తుంటే.. మీ బడ్జెట్ ఎంత? పని ప్రదేశం పిల్లల పాఠశాలలకు దగ్గరగా ఉందా? మీరు వెంటనే మారాల్సిన అవసరం ఉందా, లేదా మీకు సమయం ఉంటే దీర్ఘకాలిక పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారా? మీరు పునఃవిక్రయం, అద్దె సామర్థ్యాన్ని కూడా పరిగణించారా? అనే అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. పాత ఫ్లాట్‌లు వాటి స్థానానికి ప్రయోజనకరంగా ఉంటాయి, కొత్త అపార్ట్‌మెంట్‌లు విస్తృత శ్రేణి సౌకర్యాలను, భవిష్యత్తులో ధర పెరుగుదలను అందిస్తాయి. కొనుగోలుదారులు వారి ఉద్దేశ్యం, సమయం, బడ్జెట్, జీవనశైలి అవసరాలను అర్థం చేసుకోవడం, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications