బెంగుళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో IT ఉద్యోగులు మేము ఆఫీసుకు రాలేమని తెగేసి చెబుతున్నారు. వరదలతో కొట్టుకుపోతామని అందువల్ల తగ్గే వరకు ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని కంపెనీలకు స్పష్టం చేస్తున్నారు. ఇక బెంగుళూరు నగరంలో వరుసగా కురుస్తున్న వర్షాలు, పాతకట్టు డ్రెయినేజ్, నీటిలో మునిగిన రోడ్ల కారణంగా నగర జీవనం స్తంభించింది.Manyata Tech Park, Outer Ring Road ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.కొన్ని చోట్ల రెండు అడుగుల వరకు నీరు చేరింది. వాహనాలు ఆగిపోయాయి, ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. సోమవారం ఉదయం Manyata Tech Park లో మోకాలు లోతులో నీరు నిలిచింది. కొన్ని చోట్ల రెండు అడుగుల వరకు నీరు చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు తీవ్ర కష్టాలు పడ్డారు.

బెంగళూరు IT ఉద్యోగులు వర్షాకాలంలో వారం మొత్తానికి 70 గంటలు పని చేస్తారని ఒకరు సోషల్ మీడియాలో రాసుకువచ్చారు. అదే వర్క్ ఫ్రం హోం అయితే మరిన్ని గంటలు పనిచేస్తారని తెలిపారు. అందుకే Work-from-home (WFH)ని వాతావరణ విపత్తుల సమయంలో తప్పనిసరిగా చేయండి అన్న సోషల్ మీడియా వేదికగా తమ డిమాండ్ ను వినిపిస్తున్నారు. కంపెనీలు ఇంటి దగ్గర నుంచి ఉద్యోగులను పనిచేయమని చెబితే వర్షాల బాధ తప్పతుందని ఇంకా ఎక్కువ కష్టపడవచ్చని అంటున్నారు.
ఇక బెంగుళూరు నగరంలో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు full-time office కి రావాలని బలవంతం చేస్తున్నాయి.ఇదెక్కడి న్యాయమంటూ మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. వర్షాల వంటి సమయంలో ఉద్యోగులు ఇంట్లోనే ఉండటం వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే కంపెనీలకు వర్క్ గ్రోత్ పెరుగుతుందని చెబుతున్నారు. వర్షాల నేపథ్యంలో కార్పొరేట్, సివిక్ బాడీలపై ఒత్తిడి పెరుగుతుంది. డిమాండ్స్ పెరుగుతుండటంతో, Rigid return-to-office policies పునరాలోచన చేయమన్న ఒత్తిడి ఇప్పుడు కంపెనీలపై, ప్రభుత్వంపై పెరుగుతోంది.
నగర అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలు, వర్షాలపైనా అధికారుల హామీలు ఎంతైనా వినిపిస్తున్నా, ప్రతి సంవత్సరం వచ్చే మాన్సూన్‌కి ముందుగా పరిష్కారం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, ఉద్యోగుల డిమాండ్ స్పష్టంగా చెబుతోంది - WFH అనేది ఇక "ఒప్పంద సౌకర్యం" కాదు, అవసరమైన వాస్తవం. వాతావరణ అత్యవసర పరిస్థితుల్లో కూడా rigid office attendance policies కొనసాగిస్తే, అది ఉద్యోగుల భద్రత, నగర వసతులపై మరింత ఒత్తిడి తేచ్చేదే. సాంకేతికతతో నడుస్తున్న నగరంగా పేరుగాంచిన బెంగళూరు, ఇప్పుడు సాంకేతిక సహకారంతో కూడిన నిర్ణయాలను తీసుకునే సమయం వచ్చిందని యూజర్లు డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications