IT News: బెంగళూరులోని టెక్కీలకు దారుణ పరిస్థితి..!! రంగంలోకి నారా లోకేష్..

Nara Lokesh: సిలికాన్ సిటీలో పనిచేస్తున్న టెక్కీలు కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. తరచుగా బెంగళూరును వరదలు ముంచెత్తడంతో పాటు వేసవిలో భారీగా ఏర్పడుతున్న నీటి కొరత వర్క్ ప్రెజర్ కంటే ఎక్కువగా ఆందోళనను కలిగిస్తోంది. రెండు రోజుల కిందట బెంగళూరులో ఒక బిల్డింగ్ పేకమేడలా కూలిపోవటంతో నగరంలో నివశిస్తున్న చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ట్రాఫిక్ స్తంభించిన విషయాలు సోషల్ మీడియాలో చాలా మంది టెక్కీలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు వాసులు తమ వాహనాలను విడిచిపెట్టి ఇంటికి నడిచివెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నిన్న సాయంత్రం నగరంలో అనేక ప్రాంతాల్లో కురిసిన వర్షం దాటికి ట్రాఫిక్ పోలీసులు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ ఒక వైపు మూసివేశారు. దీంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు లాంగ్ వెయిటింగ్ వల్ల విసిగి వేసారిన కొందరు తమ వాహనాలను రోడ్డుపైనే వదిలేసి ఇళ్లకు నడిచివెళ్లిపోవాలని నిర్ణయింటం అక్కడి పరిస్థితుల దుస్థితికి అద్దం పడుతోంది.

Bengaluru rains huring Techies in Bengaluru Mohandas Pai comments on nara Lokesh tweet

వరదభీబత్సం కారణంగా రెండు కిలోమీటర్లు ప్రయాణించటానికి దాదాపు రెండున్నర గంటల సమయం పట్టిందని ఒక వ్యక్తి ట్విట్టర్లో వీడియోను పంచుకుంటూ వెల్లడించారు. మరో వ్యక్తి ఎలక్ట్రానిసిటీ ఫ్లైఓవర్‌లో గత 1.5 గంటల ఇంటికి వెళ్లటానికి వేచి ఉన్నానని పేర్కొన్నాడు. భారీ వర్షం కారణంగా బొమ్మనహళ్లి నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీకి వాహనాలు నిలిచిపోవడంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయిందని మరో వాహన యజమాని వెల్లడించాడు. గత కొన్ని వారాలుగా బెంగళూరులో వర్షాలు పడటంతో అనేక టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించాలని ప్రభుత్వం కోరింది. పాఠశాలలు మూతపడ్డాయి.

బెంగళూరులో నీరు నిలిచిపోవటం భారీగా ఇబ్బందులు కలిగిస్తున్నాయని మాజీ ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను కూడా ట్యాగ్ చేశారు. చాలా కంపెనీలు సిటీ బయటకు వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్నాయని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై నమ్మకం పోతోందని అన్నారు. గడచిన 20 ఏళ్లలో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదని, నగరంలో ఇబ్బందులు, దొంగ హామీలపై ఆయన ప్రస్తావిస్తూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

అయితే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు. ప్రస్తుతం వ్యాపారవేత్తలను ప్రోత్సహించే అనుకూలమైన పద్ధతులు ఉన్నాయని వెల్లడించారు. అయితే గత సీఎం జగన్ పాలనతో ఏపీపై నమ్మకం తగ్గిపోయిందని అమరావతిలో భారీగా పనులు జరిగితేనే నమ్మకం పెరుగుతుందని అన్నారు. అలాగే అవసరమైన నిపుణుల సంఖ్య కూడా తక్కువ లభ్యత ఉందని పాయ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏపీ భవిష్యత్తును నాశనం చేయటం బాధాకరంగా ఉందని పాయ్ పేర్కొన్నారు. అయితే గ్రౌండ్ స్థాయిలో పనులు వేగవంతం చేయాలని ట్విట్టర్లో సూచించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+