బెంగళూరు (Bengaluru) నగరంలో స్థిరాస్తి కలిగిన వారికి లేదా అక్కడ ఇల్లు కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పన్ను వసూళ్ల విషయంలో ఇప్పుడు చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. సుమారు 437 కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడానికి అథారిటీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించని దాదాపు 7,020 ఆస్తులను బహిరంగ వేలం వేయాలని అధికారులు నిశ్చయించారు.

వేలం ఎప్పుడు? ఎక్కడ?
జీబీఏ చీఫ్ కమిషనర్ మాదేశ్వర రావు గారు ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ భారీ వేలం ప్రక్రియ ఫిబ్రవరి 17, 2026 న జరగనుంది. ఆయా జోనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ వేలం నిర్వహిస్తారు. పన్ను చెల్లించమని ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ.. ఆస్తి యజమానుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో అధికారులు ఈ 'చివరి అస్త్రాన్ని' ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఆస్తుల అటాచ్‌మెంట్ ఆర్డర్లు జారీ చేసినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు వేలం ద్వారా డబ్బు వసూలు చేయాలని నిర్ణయించారు.
ఏ ఏరియాలో ఎన్ని బకాయిలు ఉన్నాయి?
ఈ పన్ను బకాయిలు కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదు. నగరం అంతటా విస్తరించి ఉన్నాయి..
- ఈస్ట్ డివిజన్: 1,615 ఆస్తుల నుంచి అత్యధికంగా రూ. 48.98 కోట్లు రావాల్సి ఉంది.
- వెస్ట్ డివిజన్: 1,504 ఆస్తుల నుంచి రూ. 35.83 కోట్లు.
- సెంట్రల్ డివిజన్: 1,398 ఆస్తుల నుంచి రూ. 34.26 కోట్లు.
- నార్త్ & సౌత్: వీటిలో కూడా వరుసగా రూ. 32 కోట్లు, రూ. 30 కోట్ల పైచిలుకు బకాయిలు పేరుకుపోయాయి.
ఈ బకాయిల్లో కేవలం అసలు పన్ను మాత్రమే లేదు. ఆలస్యమైనందుకు విధించిన పెనాల్టీలు (రూ. 131.80 కోట్లు), వడ్డీ (రూ. 74.91 కోట్లు), సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెస్ కూడా భారీగా ఉన్నాయి.
యజమానులకు చివరి అవకాశం
అయితే తమ ఆస్తులను వేలం నుంచి కాపాడుకోవడానికి యజమానులకు ఇంకా కొంత సమయం ఉంది. జీబీఏ వెబ్‌సైట్ (BBMPTax.karnataka.gov.in) లో పన్ను చెల్లించని ఆస్తుల జాబితాను ఉంచారు. ఒకవేళ మీ పేరు లేదా మీ ఆస్తి ఆ జాబితాలో ఉంటే.. వెంటనే ఆన్‌లైన్ ద్వారా బకాయిలు చెల్లించి వేలాన్ని ఆపుకోవచ్చు.
మొత్తంగా చూస్తే.. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లలో 25% వృద్ధిని సాధించి రూ. 4,930 కోట్లు సేకరించింది. ఈ ఏడాది రూ. 6,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కాబట్టి ఆస్తి పన్ను విషయంలో జాగ్రత్తగా ఉండటం, సకాలంలో చెల్లించడం ఎంతో ముఖ్యం.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications