బెంగళూరు ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో 8 రోజుల పాటు పవర్ కట్, పూర్తి వివరాలు ఇవిగో
బెంగళూరు నగర ప్రజలు వచ్చే ఎనిమిది రోజుల పాటు తరచూ విద్యుత్ అంతరాయాలను ఎదుర్కోబోతున్నారు. వివిధ సబ్‌స్టేషన్లు, 11 కెవి ఫీడర్ లైన్లలో నిర్వహణ, మరమ్మత్తు, అప్‌గ్రేడ్ పనుల కారణంగా బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ (BESCOM) నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 31 వరకు విద్యుత్ కోతలు కొనసాగనున్నాయి.
బెస్కామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంతరాయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు (8 గంటల వ్యవధి) ఉంటుంది. అయితే, పనులు షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తయితే విద్యుత్తు పునరుద్ధరించబడుతుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ కాలంలో నివాసితులు తమ రోజువారీ కార్యక్రమాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని, ముఖ్యంగా వ్యాపార, విద్య, గృహ అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని బెస్కామ్ సూచించింది.

విద్యుత్ కోత ప్రభావిత ప్రాంతాలు:
బనశంకరి
జెపి నగర్
జయనగర్
బిటిఎం లేఅవుట్
విజయనగర్
నాగర్భావి
రాజరాజేశ్వరి నగర్
కెంగేరి
చంద్ర లేఅవుట్
విద్యారణ్యపుర
యెలహంకా
హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్
ఇందిరానగర్
మహదేవపుర
కెఆర్ పురం
ఎలక్ట్రానిక్ సిటీ
వైట్‌ఫీల్డ్
ఇవి Bengaluru నగరంలోని అత్యంత జనసంచారం గల ప్రాంతాలు కావడంతో విద్యుత్ నిలిపివేత వల్ల రోజువారీ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, మహదేవపుర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు తమ పని ప్రణాళికలను తగిన విధంగా సర్దుబాటు చేసుకోవాలని సూచించబడింది.
ఈ చర్యలు నగర విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, విద్యుత్ లోడ్ సామర్థ్యాన్ని పెంచడానికి, భవిష్యత్తులో విద్యుత్ అంతరాయాలను తగ్గించడానికి చేపట్టబడ్డాయని. ముఖ్యంగా పాత ఫీడర్లను మార్చడం, ట్రాన్స్‌ఫార్మర్ అప్‌గ్రేడ్‌లు చేయడం, కేబుల్ లైన్లను బలపరచడం వంటి పనులు జరుగనున్నాయని బెస్కామ్ అధికారులు తెలిపారు.
మరోవైపు, బెంగళూరు నివాసితులు పణత్తూర్ ప్రధాన రోడ్డులో మరమ్మత్తు, నిర్వహణ పనుల కారణంగా తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై వైట్ టాపింగ్ పనులకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నందున.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ట్రాఫిక్ దారుల్లో మార్పులు చేసింది. సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.
బెస్కామ్ వినియోగదారులు తమ మొబైల్‌లో "BESCOM Mitra" యాప్ ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ ప్రాంతానికి సంబంధించిన తాజా పవర్ అవుటేజ్ అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు. కంపెనీ తెలిపిన ప్రకారం, అత్యవసర సేవలు (హాస్పిటల్స్, వాటర్ సప్లై ప్లాంట్స్ మొదలైనవి) కోసం నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా పేర్కొంది.


Click it and Unblock the Notifications