భారతదేశ టెక్ రాజధాని, లక్షలాది మందికి ఉపాధి కల్పించే Bengaluru (బెంగళూరు) నగరం గురించి ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల గురించి కాదు.. రోడ్ల మీద ఉన్న గుంతల గురించి! సాధారణంగా బెంగళూరు రోడ్ల మీద ప్రయాణం అంటేనే నడుము విరిగిపోయే గుంతలు గుర్తొస్తాయి. కానీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మాత్రం దీనిపై ఒక సంచలన వ్యాఖ్య చేశారు.

గుంతలు లేవు.. అంతా క్రియేషనే!
ఇటీవల ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో మాట్లాడిన శివకుమార్, "బెంగళూరులో గుంతలే లేవు.. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం మాత్రమే" అని కొట్టిపారేశారు. నగరం చాలా బాగుందని, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారని, ప్రజలు హాయిగా నివసిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో తానే స్వయంగా ఇంజనీర్లతో కలిసి రోడ్ల మరమ్మతులు చేయిస్తున్నట్లు ఫోటోలు పెట్టిన మంత్రి గారు ఇప్పుడు అసలు సమస్యే లేదనట్టు మాట్లాడారు. ఒకపక్క టెక్ దిగ్గజాల నుంచి నెటిజన్ల వరకూ బెంగళూరు రోడ్ల పరిస్థితి గురించి, గుంతల గురించి ఆవేదన చెందతుంటే ఇప్పుడు డిప్యూటీ సీ ఏం గారు.. ఇలా అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దిగ్గజాల ఆవేదన.. కంపెనీల వలస!
మంత్రి గారు గుంతలు లేవని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా వంటి దిగ్గజాలు ఇప్పటికే రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. "విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చినప్పుడు.. రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయేంటి? ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించడం లేదా? అని అడుగుతున్నారు" అని కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా దారుణం ఏమిటంటే.. రోడ్లు, ట్రాఫిక్ సమస్యల కారణంగా 'బ్లాక్ బక్' (BlackBuck) అనే ప్రముఖ ట్రకింగ్ ప్లాట్‌ఫామ్ తన కార్యాలయాన్ని బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ నుండి మార్చేయాలని నిర్ణయించుకుంది.
సోషల్ మీడియా వర్సెస్ వాస్తవం
నెటిజన్లు మాత్రం మంత్రి గారి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు (Bengaluru) లోని బెల్లందూర్, సర్జా పూర్, వైట్ ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, బైక్ మీద వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని ఫోటోలు, వీడియోలతో రీ-కౌంటర్ ఇస్తున్నారు.
ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు నిలయమైన నగరం, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నప్పుడు.. మౌలిక సదుపాయాల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం తగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం "సోషల్ మీడియా క్రియేషన్" అని కొట్టిపారేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా.. మంత్రి గారి మాటలు విన్నాక బెంగళూరు వాహనదారులు మాత్రం "మేము రోజు చూస్తున్నవి గుంతలు కావు.. సోషల్ మీడియా మాయా?" అని నవ్వుకుంటున్నారు.
More From GoodReturns

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

చమురు సంక్షోభం వేళ గుడ్ న్యూస్: మంగళూరు తీరానికి చేరుకున్న రష్యన్ క్రూడ్ ట్యాంకర్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications