TCS News: బెంగళూరులో టీసీఎస్ మాజీ ఉద్యోగి అరెస్ట్.. ఎందుకో తెలుసా..??
TCS News: కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన మహిళా టెక్కీని తాజాగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల యువతి చేసిన పనితో టెక్ దిగ్గజం టీసీఎస్ ఇటీవల ఒక్కసారిగా ఆందోళనకు గురైంది.
వివరాల్లోకి వెళితే టాటా కన్సల్టెన్సీ మాజీ ఉద్యోగిని బెంగళూరులోని ఐటీ మేజర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు పంపినట్లు గుర్తించి ఎట్టకేలకు B శ్రుతి శెట్టిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో టీసీఎస్ లో ఆమె పనిచేశారు. అయితే 2017లో ఎంబీఏ పూర్తి చేసేందుకు ఆమె తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. అయితే ఆ తర్వాత ఆమెను టీసీఎస్ మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోబోవడం లేదని తెలిసి ఆందోళన చెందింది. అయితే ఫేక్ కాల్ చేయటం ద్వారా కంపెనీకి తిరిగి రావాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే బెంగళూరు టీసీఎస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే నవంబర్ 15న బెళగావిలోని ఆమె ఇంటి నుంచి శ్రుతి శెట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంపెనీ ఆవరణలో బాంబు ఉందటూ శ్రుతి నవంబర్ 14న కంపెనీ ట్రాన్స్‌పోర్ట్ హెల్ప్‌డెస్క్‌కి ఫోన్ చేసి బెదిరించింది. దీంతో యాజమాన్యంతో పాటు ఉద్యోగులు సైతం భయాందోళనకు గురయ్యారు. కంపెనీ ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపింది.
బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజు చెట్రీ పోలీసులను అప్రమత్తం చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మాజీ ఉద్యోగిని శ్రుతి కంపెనీ తనను తిరిగి నియమించుకోవడానికి నిరాకరించిందనే ఆగ్రహంతో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో సదరు మహిళ బెదిరింపు కాల్‌ను తాను ఉద్యోగంలో ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న కంపెనీ బస్సు డ్రైవర్‌కు డయల్ చేసింది. తల్లి ఫోన్ నుంచి కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే చివరికి బెయిల్ పై విడుదలయ్యారు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతోందని, ఈ క్రమంలోనే తాజా చర్యకు పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications