Bengaluru: బెంగళూరు వాసులకు అలర్ట్! పీణ్యా ఫ్లైఓవర్ క్లోజ్! ఆల్టర్నేటివ్ రూట్స్ ఇవే..!

బెంగళూరు అంటేనే ట్రాఫిక్.. ట్రాఫిక్ అంటేనే బెంగళూరు. అలాంటిది సిటీలో ఎంతో కీలకమైన ఒక ఫ్లైఓవర్‌ను మూడు రోజుల పాటు మూసివేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును, మీరు విన్నది నిజమే! బెంగళూరు (Bengaluru) లోని పీణ్యా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ (డాక్టర్ శ్రీ శివకుమార్ స్వామిజీ ఫ్లైఓవర్) మీద మే 5వ తేదీ నుండి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు.

Bengaluru Peenya Flyover Closed For 3 Days From May 5 Check Traffic Diversions And Routes

ఎందుకు మూసివేస్తున్నారు?

ఈ ఫ్లైఓవర్ పనులు చాలా కాలంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల కేబుల్ రిపేర్ పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు చివరిగా 'లోడ్ టెస్టింగ్' చేయాల్సి ఉంది. అంటే, ఈ వంతెన ఎంత బరువును తట్టుకోగలదు, నిర్మాణం ఎంత బలంగా ఉందో పరీక్షించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 78 గంటల పాటు వంతెనపై ఎలాంటి వాహనాలను అనుమతించరు.

సమయం, తేదీలు గుర్తుపెట్టుకోండి!

మే 5వ తేదీ ఉదయం 5 గంటల నుండి మే 8వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కెన్నమెటల్ వైడియా అప్పర్ రాంప్ నుండి ఎస్ఆర్ఎస్ డౌన్ రాంప్ వరకు, అలాగే CMTI జంక్షన్ నుండి పార్లే- జి టోల్ వరకు ఫ్లైఓవర్ క్లోజ్ అయి ఉంటుంది.

ట్రాఫిక్ మళ్లింపు - మీరు వెళ్లాల్సిన దారులు ఇవే!

ఫ్లైఓవర్ మూసివేయడం వల్ల కింద ఉన్న సర్వీస్ రోడ్లపై విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది. అందుకే ట్రాఫిక్ పోలీసులు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు..

  • నేలమంగళ నుండి బెంగళూరు వైపు వచ్చే వారు: కెన్నమెటల్ ఫ్యాక్టరీ దగ్గర డైవర్షన్ తీసుకోవాలి. అక్కడి నుండి ఎన్.హెచ్-4 సర్వీస్ రోడ్డు ద్వారా 8వ మైలు, దాసరహళ్లి, జాలహళ్లి క్రాస్, పీణ్య పోలీస్ స్టేషన్ జంక్షన్, ఎస్ఆర్ఎస్ జంక్షన్ మీదుగా గొరగుంటెపాళ్య చేరుకోవచ్చు.
  • CMTI నుండి నేలమంగళ వైపు వెళ్లే వారు: సర్వీస్ రోడ్డును ఉపయోగించి ఎస్ఆర్ఎస్ జంక్షన్, పీణ్య పోలీస్ స్టేషన్ జంక్షన్, జాలహళ్లి క్రాస్, దాసరహళ్లి మీదుగా పార్లే- జి టోల్ చేరుకోవాల్సి ఉంటుంది.

ముందస్తు ప్లానింగ్ అవసరం!

తుమకూరు రోడ్డు అనేది బెంగళూరుకు వెన్నెముక వంటిది. వేల సంఖ్యలో వాహనాలు, ముఖ్యంగా భారీ ట్రక్కులు, బస్సులు ఈ రూట్లోనే వెళ్తుంటాయి. ఫ్లైఓవర్ క్లోజ్ అవ్వడం వల్ల సర్వీస్ రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆఫీసులకు వెళ్లే వారు లేదా ఊర్లకు వెళ్లే వారు కొంచెం ముందుగా బయలుదేరడం మంచిది. వీలైతే మెట్రో లేదా ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడటం వల్ల టైమ్ సేవ్ అవుతుంది.

రోడ్డు భద్రత కోసం, వంతెన పటిష్టత కోసం చేసే ఈ పనులకు బెంగళూరు (Bengaluru) ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. సో, ఈ మూడు రోజులు మీ ప్రయాణాన్ని కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+