ఒరాకిల్‌లో ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేసిన ప్రదీప్ కన్నన్ 2019లో అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు.నెలకు మంచి జీతం వచ్చే సురక్షితమైన ఉద్యోగం,సౌకర్యవంతమైన బెంగళూరు జీవితం, ప్రేమతో కూడిన కుటుంబం.. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఆయన మనసులో ఒక శూన్యత ఉండేది. నాలో ఏదో లేకపోవడం అనిపించేదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. తనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఉద్యోగం కాదని తెలుసుకున్న ప్రదీప్, ఆ ఆలోచనతోనే ఉద్యోగానికి రాజీనామా చేసి తన స్వస్థలం తమిళనాడులోని కరూర్ కు తిరిగి వెళ్లాడు. అక్కడ ఆయన తనకు ఇష్టమైన ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యాపారం ఏదంటే.. ఫలూదా ఐస్ క్రీం అమ్మకం
చుట్టుపక్కలవారు ఈ నిర్ణయాన్ని అసాధారణంగా చూసి గేలి చేయడం ప్రారంభించారు. ఇంత మంచి Oracle ఉద్యోగం వదిలి ఐస్ క్రీం అమ్మేవాడివయ్యావా? అంటూ నవ్వుకున్నారు. కానీ ప్రదీప్ నిశ్చయంతో ముందుకు సాగాడు. చిన్న దుకాణం, పరిమిత వనరులు, అనుభవం లేకపోయినా ఆయన క్రమంగా మార్కెట్‌ను అర్థం చేసుకుని, రుచితో పాటు నాణ్యతపై దృష్టి పెట్టాడు.ఆ క్రమంలోనే ఆయన Falooda Nation అనే బ్రాండ్‌ను స్థాపించాడు.

ప్రారంభంలో సాధారణ కస్టమర్లతో మొదలైన ఈ వ్యాపారం, నాణ్యత, వినూత్న రుచుల కారణంగా వేగంగా ప్రాచుర్యం పొందింది. కేవలం ఆరు సంవత్సరాల్లోనే ప్రదీప్ కన్నన్ భారతదేశం, దుబాయ్ అంతటా 18 అవుట్‌లెట్లు ప్రారంభించి తన కలను నిజం చేశాడు. తన విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన.. నన్ను అందరూ పిచ్చివాడిని అన్నారు. కానీ ఆరు సంవత్సరాల తర్వాత, అదే ఫలూదా షాప్ ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్‌గా మారింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని రాశాడు. తన ప్రయాణం గురించి చెబుతూ ఇది రాత్రికి రాత్రే వచ్చిన విజయం కాదు. అనేక విఫల ప్రయత్నాలు, అనిశ్చితత, ఆర్థిక కష్టాలు ఎదురైనా, నేను నమ్మకాన్ని కోల్పోలేదన్నారు.
ప్రదీప్ కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనేక మంది వినియోగదారులు ఆయన ధైర్యాన్ని, అంకితభావాన్ని ప్రశంసించారు. సూపర్ నిజంగా ప్రేరణాత్మకమైన ప్రయాణం అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరొక నెటిజన్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం ఎంతో ధైర్యం కావాలి. మీరు అది సాధించారు అని రాశారు.
ప్రదీప్ కన్నన్ కథ, ఉద్యోగ భద్రత కంటే మనసుకు నచ్చిన పనిని ఎంచుకోవడంలో ఉన్న శక్తిని చూపిస్తుంది. ఇది ప్రస్తుతం యువతలో పెరుగుతున్న కొత్త ధోరణికి ప్రతిబింబం. అంటే ఉద్యోగ స్థిరత్వం కంటే అభిరుచిని, స్వాతంత్ర్యాన్ని ప్రాధాన్యంగా చూసే మార్పుగా ఆయన చెప్పుకొచ్చారు
ఇలాంటి మార్గంలో నడిచిన మరొక ఉదాహరణగా పంజాబ్‌లోని మొహాలీకి చెందిన మణీందర్ సింగ్ కూడా ఉన్నాడు. ఆయన అమెరికాలో టెక్ కెరీర్ వదిలి భారతదేశానికి తిరిగి వచ్చి తన భార్యతో కలిసి రాజ్మా చావల్, సోయా చాప్ వంటి పంజాబీ వంటకాలను అమ్మే ఫుడ్ స్టాల్ ప్రారంభించాడు.జీవితంలో నిజమైన విజయాన్ని జీతం కొలవదు, మనసుకు నచ్చిన పనిని ధైర్యంగా చేయడమే నిజమైన సంపద అనే సందేశాన్ని మనకు ఈ కథలు ఇస్తున్నాయి.
More From GoodReturns

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications